దసరా పండుగని, హిందువులందరూ కూడా, ఘనంగా జరుపుకుంటారు. ఈ తొమ్మిది రోజులూ కూడా, అమ్మవారిని పూజించి, ధూప దీప నైవేద్యాలని పెడుతూ ఉంటారు. ఆశ్వీయుజ శుద్ధ పాడ్యమి నుండి నవమి దాకా, తొమ్మిది రోజులు పాటు దసరా ఉత్సవాలను జరుపుతూ ఉంటారు. పదవరోజు విజయదశమి పండగ చేసి, దసరా పండుగని పూర్తిచేస్తారు. దసరా పండుగ అంటే శక్తి, ఆరాధనకి ప్రాధాన్యతను ఇచ్చే పండుగ అని చెప్పొచ్చు. ఈ తొమ్మిది రోజులని, నవరాత్రులు లేదా శరన్నవరాత్రులు అని పిలుస్తారు.
శరదృతువు ఆరంభంలో వచ్చే పండుగ కాబట్టి, శరన్నవరాత్రులు అనే పేరు వచ్చింది. చెడుపై మంచి గెలిచిందని, విజయానికి గుర్తుగా ఈ పండుగని విజయదశమి అని పిలవడం జరుగుతుంది. తొమ్మిది రోజులు పాటు 9 అవతారాల్లో అమ్మవారిని పూజించి, పదవ రోజు విజయదశమి పండుగను చేసుకుంటాము. విజయదశమి రోజున చరిత్ర ప్రకారం చూసినట్లయితే, రాముడు రావణుడు పై గెలిచాడు అని చెప్తారు.
అంతేకాకుండా, పాండవులు వనవాసానికి వెళ్తూ, జమ్మి చెట్టు మీద ఆయుధాల్ని తిరిగి తీసుకువచ్చిన రోజు కూడా ఇదే అని చెప్తారు. ఈ సందర్భంగా, శమీ పూజ చేయడం కూడా జరుగుతుంది. అయితే, ఈ పండుగ సమయంలో కొన్ని తప్పులు చేయకూడదు. మహిళలు గాజులు వేసుకునేటప్పుడు అసలు ఈ పొరపాటు చేయకుండా మహిళలు చూసుకోవాలి.
మహిళలు వేసుకునే గాజులు సౌభాగ్యానికి చిహ్నం. మట్టి గాజులు వేసుకుంటే, మహాలక్ష్మి దేవి ఆ ఇంట కొలువై ఉంటుందట. బంగారు గాజులు ఉన్నవాళ్లు, బంగారు గాజులు కూడా వేసుకోవచ్చు. కానీ, వాటితో పాటుగా మట్టి గాజులు కూడా వేసుకోవాలి. అప్పుడే లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది. లక్ష్మీ కటాక్షం కలగడం కోసం, నవరాత్రుల్లో ఎరుపు రంగు, ఆకుపచ్చ రంగు, పింక్ కలర్ గాజులు వేసుకుంటే మంచిది. ఈ రంగు గాజులు వేసుకున్నట్లయితే, లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది.