Bangles : ప్రతి ఒక్క మహిళ కూడా చేతులకి గాజులు వేసుకోవాలని పెద్దలు చెప్తూ ఉంటారు. చేతులకి గాజులు లేకుండా ఉండకూడదని, గాజులు వేసుకోకపోతే మంచిది కాదని అంటూ ఉంటారు. శాస్త్రాలు కూడా స్త్రీలు గాజులు వేసుకోవాలని, ఏ కీడు జరగకుండా గాజులు రక్షణగా ఉంటాయని అంటున్నాయి. అయితే గాజులు వేసుకోవడం వలన అసలు ఏమవుతుంది..?, ఎలాంటి లాభాలు కలుగుతాయి అనేది ఇప్పుడు చూద్దాం.
అప్పుడే పుట్టిన పిల్లలకి నల్ల గాజులని వేస్తూ ఉంటారు. దాని వలన దిష్టి తగలదు. దోషాలు రావు. పైగా ఆ గాజుల శబ్దం ఆనందాన్ని, సంతోషాన్ని ఇస్తుంది. ఆడపిల్లలు లక్ష్మీదేవి స్వరూపులు. చేతికి నిండుగా గాజులు వేసుకుంటే ఆ ఇంట్లో లక్ష్మీదేవి ఉంటుందని అంటారు. గాజులు పగిలిపోకుండా జాగ్రత్తగా చూసుకునే మహిళలు ఇంటి వ్యవహారాలను కూడా ఎంతో చక్కగా చూసుకోగలుగుతారని అంటారు. రంగురంగుల గాజులు వేసుకుంటే చూడడానికి చాలా అందంగా ఉంటుంది.
పైగా ఆ రంగులకి కూడా అర్థాలు ఉన్నాయి. ఎరుపు రంగు గాజులు శక్తిని, నీలిరంగు గాజులు విజ్ఞానాన్ని సూచిస్తాయి. ఆకుపచ్చ అదృష్టాన్ని, పసుపు రంగు సంతోషాన్ని, ఊదా రంగు స్వేచ్ఛని.. సూచిస్తాయి. హిందూ సాంప్రదాయం ప్రకారం గాజులు సౌభాగ్యానికి చిహ్నం. బంగారం గాజులు ఎన్ని వేసుకున్నా, చేతికి ఒకటి రెండు మట్టి గాజులు వేసుకోవాలని అంటారు. అమ్మవారిని పూజించేటప్పుడు, పసుపు కుంకుమతోపాటు గాజులని కూడా పెట్టి పూజిస్తారు.
మట్టి గాజులు వేసుకుంటే ముత్తైదువుతనాన్ని సూచిస్తుంది. గాజులు పగిలిపోవడం మంచిది కాదని.. అమంగళం, అశుభమని అంటారు. ఇలా గాజులకి ఇంత ప్రాముఖ్యత ఉంది. కాబట్టి పెళ్లయిన ప్రతి స్త్రీ కూడా కచ్చితంగా గాజులని ధరించాలి. గాజులను వేసుకుంటే ఇంట్లో లక్ష్మీదేవి ఉంటుందని అంటారు. కనుక కచ్చితంగా పెళ్లయిన మహిళలు గాజులని వేసుకుని తీరాలి.
మన శరీరంలో ఊపిరితిత్తులు ఎంత ముఖ్యమైనవో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఊపిరితిత్తులు దెబ్బతింటే శ్వాస తీసుకోవడం చాలా కష్టమవడంతోపాటు అతి తక్కువ…
ఇటీవలి కాలంలో వీధికుక్కల బెడద మరింత ఎక్కువైంది. పిల్లల నుంచి పెద్దల వరకు అందరూ రోడ్డుపై స్వేచ్ఛగా తిరిగేందుకు చాలా…
సాహో చిత్రంలో ప్రభాస్ సరసన కథానాయికగా నటించి అలరించిన శ్రద్ధా కపూర్ రీసెంట్‌గా స్త్రీ2 అనే మూవీతో పలకరించింది. 2018లో…
ప్రముఖ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ పెద్ద చిక్కుల్లో పడ్డాడు. జానీ మాస్టర్ తనను లైంగికంగా వేధించాడని రాయదుర్గం పోలీసులకు మహిళా…
ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాన్ ఇటు రాజకీయాలు, అటు సినిమాలు రెండింటిని బ్యాలెన్స్ చేస్తూ ముందుకు సాగుతున్నారు. అయితే…
హారర్ సినిమా ప్రేమికుల్లో 'డీమాంటీ కాలనీ' సినిమాకు సపరేట్ ఫ్యాన్ బేస్ ఉన్న విషయం తెలిసిందే. తమిళ సినిమాయే అయినప్పటికీ...…
ఒక్కోసారి ఎవరిని ఎప్పుడు అదృష్టం ఎలా వరిస్తుందో తెలియదు. ఊహించని విధంగా లక్షాధికారి అవుతుంటారు. తుగ్గలి మండలం సూర్యతాండాలో రైతుకూలీకి…
ఈ రోజుల్లో బంధాలు ఎక్కువ కాలం కొనసాగడం లేదు. లక్షలు ఖర్చు పెట్టి ఎంతో అట్టహాసంగా పెళ్లి చేసుకుంటుండగా,ఆ పెళ్లి…