ఆధ్యాత్మికం

ఆడ‌వారు పుట్టింటి నుంచి ఈ వ‌స్తువుల‌ను తీసుకురావ‌ద్దు..!

ఆడాళ్లకు రెండిళ్లు ఉంటాయి. ఒకటి పుట్టినిల్లు రెండు మెట్టినిల్లు. పెళ్లయ్యేదాకా పుట్టింట్లో ఉంటుంది. వివాహమయ్యాక మెట్టినిల్లు. ఆడపిల్లకు మెట్టినింటి కంటే పుట్టింట్లోనే స్వాతంత్ర్యం ఎక్కువ. ఇక్కడే పుట్టి పెరిగింది కాబట్టి. అమ్మానాన్న మీద ప్రేమ ఉంటుంది. వారికి కూడా కొడుకుకంటే కూతురంటేనే ఇష్టంగా ఉంటుంది. అందుకే ఆడపిల్ల ఏది అడిగినా కాదనరు. చిటికెలో కొనిస్తారు. వారు కూడా అన్నీ అడగరు. తమ ఇంట్లో ఏదైనా లేకపోతేనే అమ్మ నేను ఇది తీసుకెళ్తా అని అడుగుతారు. అదేం భాగ్యం తల్లి తీసుకో అంటూ ఉంటారు పుట్టింటి వారు. ఇలా ఆడపిల్లకు అత్తింటి వారికంటే పుట్టింటి వారితోనే అనుబంధం ఎక్కువగా ఉంటుంది. అక్కడ ఎలా ఉన్నా ఇక్కడ మాత్రం గారాల పట్టిగానే ఉంటుంది.

వాస్తు ప్రభావ రీత్యా ఇంటి ఆడపిల్ల‌ కొన్ని రకాల వస్తువులు మాత్రమే తీసుకెళ్లొచ్చనే నిబంధనలు ఉన్నాయి. అన్ని రకాల వస్తువులు తీసుకెళ్లకూడదు. ఇక స్వీట్లు అయితే అందరు తినేవే. వాటిని నిరభ్యంతరంగా తీసుకెళ్లొచ్చు. తమ అత్తగారింట్లో అందరి నోరు తీపి చేయడానికి తియ్యని వస్తువులు తీసుకెళ్లడంలో ఎలాంటి దోషాలు ఉండవు. వాటిని ఎప్పుడైనా తీసుకెళ్లి అత్తగారింట్లో అందరికి పంచొచ్చు. దీంతో వారిలో కూడా సంతోషాలు వెల్లివిరుస్తాయి. తమ కోడలు స్వీట్లు తెచ్చిందని అత్తగారు కూడా ఎంతో మురిసిపోతారు.

పుట్టింటి నుంచి ఆడవారు పూజా వస్తువులు తీసుకెళ్లకూడదు. ముఖ్యంగా మన ఇంట్లో వాడినవి అసలు ముట్టుకోకూడదు. దీపపు కుందులు కాని హారతి పళ్లెం కాని తాకకూడదు. ఎందుకంటే వాటిని పుట్టింటి నుంచి తీసుకెళితే ఆమెకు మంచిది కాదు. ఇటు పుట్టింటి వాళ్లకు కూడా నష్టమే. కావాలంటే వారి ఇంటి దగ్గరే కొత్తవి కొనుక్కోవాలి. కానీ పుట్టింటి నుంచి తీసుకెళ్లడం క్షేమం కాదు. కొంతమంది పెళ్లయినా ఇంటి దగ్గరే ఉండటంతో పుట్టింటి నుంచి ఏవేవో తీసుకెళ్తుంటారు. అలా చేయకూడదు. ఏం తీసుకెళ్లవచ్చో ఏం తీసుకెళ్ల కూడదో తెలుసుకుని మరీ తీసుకెళ్లడం మంచిది. లేదంటే రెండు కుటుంబాలకు అరిష్టమే కలుగుతుంది.

కాకరకాయ, మెంతి కూర వంటివి పుట్టింటి నుంచి అసలు తీసుకెళ్లరాదు. దీంతో ఆడపిల్లలు జాగ్రత్తగా ఉండాల్సిందే. పుట్టింటి నుంచి చాలా రకాల వస్తువులు తీసుకెళ్లడానికి వీలు లేదు. మనం కావాలని తీసుకెళ్లినా రెండు కుటుంబాలకు మంచిది కాదు. దీంతో మనం తీసుకెళ్లకుండా ఉండటమే శ్రేయస్కరం. ఆడపడుచు పుట్టింటి వారి గౌరవం, మెట్టినింటి వారి ఖ్యాతిని నిలిపేందుకు రెండు కుటుంబాలకు మధ్య వారధిగా ఉండాల్సిన అవసరం ఉంటుంది. అలాగే ఉప్పు, చింత‌పండు, పాలు, పెరుగు, చీపురు త‌దిత‌ర వ‌స్తువుల‌ను కూడా ఆడ‌వారు త‌మ పుట్టింటి నుంచి అత్తింటికి తీసుకెళ్ల‌కూడ‌దు. తీసుకెళ్తే అన్నీ అన‌ర్థాలే క‌లుగుతాయ‌న్న విష‌యం గుర్తుంచుకోవాలి.

Share
IDL Desk

Recent Posts

ఈ ఫుడ్ తింటే ఊపిరితిత్తులు నెల రోజుల్లో పూర్తి ఆరోగ్యంగా మారుతాయి..!

మన శరీరంలో ఊపిరితిత్తులు ఎంత ముఖ్య‌మైన‌వో ప్ర‌త్యేకంగా చెప్ప‌న‌క్క‌ర్లేదు. ఊపిరితిత్తులు దెబ్బతింటే శ్వాస తీసుకోవడం చాలా కష్టమవడంతోపాటు అతి తక్కువ…

Monday, 23 September 2024, 5:22 PM

రోడ్డుపై కుక్క‌లు మిమ్మ‌ల్ని వెంబ‌డిస్తే ఆ స‌మ‌యంలో ఏం చేయాలి అంటే..?

ఇటీవలి కాలంలో వీధికుక్కల బెడద మ‌రింత ఎక్కువైంది. పిల్లల నుంచి పెద్దల వరకు అందరూ రోడ్డుపై స్వేచ్ఛగా తిరిగేందుకు చాలా…

Saturday, 21 September 2024, 3:01 PM

క‌లెక్ష‌న్ల‌లో దుమ్ము రేపుతున్న స్త్రీ 2 మూవీ.. బాలీవుడ్ లో ఆల్‌టైమ్ హై రికార్డు..!

సాహో చిత్రంలో ప్ర‌భాస్ స‌ర‌స‌న కథానాయిక‌గా న‌టించి అల‌రించిన శ్ర‌ద్ధా క‌పూర్ రీసెంట్‌గా స్త్రీ2 అనే మూవీతో ప‌ల‌క‌రించింది. 2018లో…

Saturday, 21 September 2024, 5:47 AM

జానీ మాస్ట‌ర్ కేసులో అస‌లు ఏం జ‌రుగుతోంది..?

ప్రముఖ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ పెద్ద చిక్కుల్లో ప‌డ్డాడు. జానీ మాస్టర్ తనను లైంగికంగా వేధించాడని రాయదుర్గం పోలీసులకు మ‌హిళా…

Friday, 20 September 2024, 9:27 PM

ప‌వ‌న్ క‌ళ్యాణ్‌తో ఇప్పుడు త‌న రిలేష‌న్ ఎలా ఉందో చెప్పిన ఆలీ..!

ఏపీ డిప్యూటీ సీఎం ప‌వ‌న్ క‌ళ్యాన్ ఇటు రాజ‌కీయాలు, అటు సినిమాలు రెండింటిని బ్యాలెన్స్ చేస్తూ ముందుకు సాగుతున్నారు. అయితే…

Friday, 20 September 2024, 9:42 AM

డీమోంట్ కాల‌నీ 2 ఓటీటీలోకి వ‌చ్చేస్తుంది.. ఎక్క‌డ, ఎప్పుడు అంటే..!

హారర్ సినిమా ప్రేమికుల్లో 'డీమాంటీ కాలనీ' సినిమాకు సపరేట్ ఫ్యాన్ బేస్ ఉన్న విష‌యం తెలిసిందే. తమిళ సినిమాయే అయినప్పటికీ...…

Thursday, 19 September 2024, 1:55 PM

పొలంలో రైతుకి దొరికిన రూ.5ల‌క్షల విలువైన వ‌జ్రం.. ఏకంగా జాక్ పాట్ త‌గిలిందిగా..!

ఒక్కోసారి ఎవ‌రిని ఎప్పుడు అదృష్టం ఎలా వ‌రిస్తుందో తెలియ‌దు. ఊహించ‌ని విధంగా ల‌క్షాధికారి అవుతుంటారు. తుగ్గలి మండలం సూర్యతాండాలో రైతుకూలీకి…

Wednesday, 18 September 2024, 10:46 AM

భ‌ర్త రోజూ స్నానం చేయ‌డం లేద‌ని ఏకంగా విడాకులు కోరిన భార్య‌

ఈ రోజుల్లో బంధాలు ఎక్కువ కాలం కొన‌సాగ‌డం లేదు. ల‌క్ష‌లు ఖ‌ర్చు పెట్టి ఎంతో అట్టహాసంగా పెళ్లి చేసుకుంటుండ‌గా,ఆ పెళ్లి…

Wednesday, 18 September 2024, 9:12 AM