ఉప్పును రోజూ సహజంగానే మనం వంటల్లో వేస్తుంటాం. ఇది లేకుండా అస్సలు ఏ వంటా పూర్తి కాదు. ఉప్పు లేని కూరలను అస్సలు తినలేం. అయితే అనేక మతాలకు చెందిన వారు దుష్ట శక్తులను అడ్డుకునేందుకు ఉప్పును వాడుతుంటారు. హిందువులు అయితే ఉప్పుతో దిష్టి తీస్తారు. అలాగే పలు ఇతర మతాల వారు కూడా ఉప్పును భిన్న రకాలుగా దుష్ట శక్తులను ఎదిరించేందుకు ఉపయోగిస్తారు. ఇక జపాన్ వాసులు మాత్రం తమ ఇళ్ల ప్రధాన ద్వారాల ఎదుట ఉప్పును ఉంచుతారు.
చిత్రంలో చూపినట్లుగా ఒక చిన్నపాటి ప్లేట్‌లో ఉప్పును కుప్పలా పోసి ఉంచుతారు. దీని వల్ల దుష్టశక్తులు ఇళ్లలోకి రావని వారు నమ్ముతారు. అయితే జపాన్ ప్రజలందరూ దీన్ని పాటించరు. విశ్వాసం ఉన్నవారే ఇలా చేస్తారు. కానీ చాలా మంది ఇళ్ల బయట అలా కనిపిస్తుంది.
ఇక అలా ఉప్పు ఉంచడాన్ని అక్కడ Mori-shio అని పిలుస్తారు. ఉప్పును బయట అలా ఉంచితే అంతా మంచే జరుగుతుందని, దుష్ట శక్తులు ఇంట్లోకి రావని, ఇంట్లోకి నెగెటివ్ ఎనర్జీ రాకుండా అడ్డుకోవచ్చని నమ్ముతారు. ఇక అక్కడ ఇంట్లోని కుటుంబ సభ్యులు ఎవరి అంత్యక్రియలకు అయినా వెళ్లి వస్తే వారిపై ఉప్పు చల్లుతారు. దీంతో దుష్ట శక్తులు, దెయ్యాలు వంటివి రాకుండా ఉంటాయని విశ్వసిస్తారు.
అయితే కేవలం జపాన్ వాసులే కాదు.. చాలా మంది ఉప్పును దుష్ట శక్తులను పారద్రోలే పదార్థంగా నమ్ముతారు. ఉప్పును గుమ్మం వద్ద గీత మాదిరిగా పోస్తారు. అలాగే హిందూ సంప్రదాయంలో ఉప్పుతో దిష్టి తీస్తారు. ఇలా ఉప్పు దుష్టశక్తులను తరిమేందుకు పనికొస్తుంది. చాలా మంది ఉప్పును ఇందుకుగాను రకరకాలుగా ఉపయోగిస్తారు.
మన శరీరంలో ఊపిరితిత్తులు ఎంత ముఖ్యమైనవో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఊపిరితిత్తులు దెబ్బతింటే శ్వాస తీసుకోవడం చాలా కష్టమవడంతోపాటు అతి తక్కువ…
ఇటీవలి కాలంలో వీధికుక్కల బెడద మరింత ఎక్కువైంది. పిల్లల నుంచి పెద్దల వరకు అందరూ రోడ్డుపై స్వేచ్ఛగా తిరిగేందుకు చాలా…
సాహో చిత్రంలో ప్రభాస్ సరసన కథానాయికగా నటించి అలరించిన శ్రద్ధా కపూర్ రీసెంట్గా స్త్రీ2 అనే మూవీతో పలకరించింది. 2018లో…
ప్రముఖ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ పెద్ద చిక్కుల్లో పడ్డాడు. జానీ మాస్టర్ తనను లైంగికంగా వేధించాడని రాయదుర్గం పోలీసులకు మహిళా…
ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాన్ ఇటు రాజకీయాలు, అటు సినిమాలు రెండింటిని బ్యాలెన్స్ చేస్తూ ముందుకు సాగుతున్నారు. అయితే…
హారర్ సినిమా ప్రేమికుల్లో 'డీమాంటీ కాలనీ' సినిమాకు సపరేట్ ఫ్యాన్ బేస్ ఉన్న విషయం తెలిసిందే. తమిళ సినిమాయే అయినప్పటికీ...…
ఒక్కోసారి ఎవరిని ఎప్పుడు అదృష్టం ఎలా వరిస్తుందో తెలియదు. ఊహించని విధంగా లక్షాధికారి అవుతుంటారు. తుగ్గలి మండలం సూర్యతాండాలో రైతుకూలీకి…
ఈ రోజుల్లో బంధాలు ఎక్కువ కాలం కొనసాగడం లేదు. లక్షలు ఖర్చు పెట్టి ఎంతో అట్టహాసంగా పెళ్లి చేసుకుంటుండగా,ఆ పెళ్లి…