Samudra Manthan : హిందూ పురాణాల్లో ఇప్పటికీ మనకు తెలియని ఎన్నో విషయాలు దాగి ఉన్నాయి. వాటిలో క్షీరసాగర మథనం కూడా ఒకటి. అవును, అందులో నుంచే కదా విషం, అమృతం పుట్టాయి. విషాన్ని శివుడు తన కంఠంలో దాచుకోగా, అమృతాన్ని దేవతలందరూ తాగారు కదా.. అని మీరు అనబోతున్నారు కదా.. అయితే అది కరెక్టే, కానీ క్షీరసాగర మథనం జరిగినప్పుడు ఇంకా కొన్ని ప్రత్యేకమైనవి కూడా బయటికి వచ్చాయట. వాటి గురించే ఇప్పుడు మేం చెప్పబోయేది. అవేంటో తెలుసుకుందాం.
పురాణాల ప్రకారం ఒకప్పుడు దేవతలు అమృతం కోసం శ్రీమహావిష్ణువు విశ్రాంతి తీసుకునే క్షీరసాగరాన్ని మథించాలని (చిలకాలని) అనుకున్నారట. అయితే అందుకు వారి బలం సరిపోలేదు. దీంతో వారు రాక్షసుల సహాయం కూడా తీసుకోవాల్సి వచ్చింది. ఈ క్రమంలో దేవతలు, రాక్షసులు అందరూ కలిసి ఆదిశేషువును తాడుగా, మందరగిరి పర్వతాన్ని కవ్వంలా చేసుకుని క్షీరసాగరాన్ని మథించడం మొదలు పెడతారు. ఆ క్రమంలో మందరగిరి పర్వతం నేలకు కుంగిపోతూ ఉంటుంది. అప్పుడే విష్ణువు కూర్మావతారం (తాబేలు) ఎత్తి తన చిప్పను ఆ పర్వతం కింద పెడతాడు. దీంతో మళ్లీ సాగర మథనం మొదలవుతుంది.
అయితే ఈ క్షీరసాగర మథనాన్ని మన జీవితానికి కూడా అన్వయించుకోవచ్చని పురాణాల్లో చెప్పారు. అదెలాగంటే క్షీర సాగరం మనకు ప్రపంచం లాంటిది. మందరగిరి పర్వతం మన హృదయం. మన హృదయం దృఢంగా, నిశ్చయంగా ఉండాలంటే అందుకు కూర్మం (తాబేలు అవతారంలోని దేవుడు) అవసరం. అదేవిధంగా ఆదిశేషువు మన మైండ్. దీంతో ప్రపంచం లాంటి సముద్రాన్ని చిలికితేనే కదా మనం అనుకున్న ఫలితాలు వస్తాయి. ఇక మందరగిరి పర్వతం అంటే మన మనస్సు అప్పుడప్పుడు గాడి తప్పుతుంటుంది. అంటే పట్టు జారిపోతుంది. దాన్ని సరైన దారిలో నడిపించాలంటే మన మనస్సుపై మనకు నియంత్రణ అవసరం. దీన్నే పురాణాల్లో చెప్పారు.
క్షీర సాగర మథనం జరిపినప్పుడు బయటికి వచ్చినవేంటో ఇప్పుడు చూద్దాం.. క్షీర సాగర మథనం జరిపినప్పుడు చంద్రుడు బయటికి వస్తాడు. దాన్నిశివుడు తన తలపై ధరించాడు. విషం దావానలంలా ఉద్భవిస్తుంది. దాన్ని శివుడు తన కంఠంలో దాచుకున్నాడు. 4 దంతాలు ఉన్న ఐరావతమనే పెద్ద ఏనుగుతోపాటు మరో 64 ఇతర తెల్ల ఏనుగులు బయటికి వచ్చాయి. వాటిని ఇంద్రుడు స్వీకరించాడు. ఉచ్ఛైశ్రవమనే తెల్లని గుర్రం ఉద్భవించింది. దాన్ని రాక్షసుల రాజు బలి స్వీకరించాడు. రంభ, ఊర్వశి, మేనక, తిలోత్తమ వంటి అప్సరసలు మథనం నుంచి ఉద్భవించారు. వారిని స్వర్గానికి పంపారు. కోరిన కోర్కెలు తీర్చే ఆవు కామధేనువు జన్మిస్తుంది. దాన్నుంచి వచ్చే పాలు, పెరుగు, నెయ్యి వంటి వాటిని యజ్ఞ యాగాదుల కోసం ఉపయోగించడం మొదలు పెట్టారు.
లక్ష్మీ దేవి ఉద్భవించింది. ఆమె విష్ణువు మెడలో దండ వేసి ఆయన్ను వరించి వెళ్లింది. అడిగినవన్నీ ఇచ్చే కల్పవృక్షం పుట్టుకొస్తుంది. దాన్ని స్వర్గంలో ఉంచారు. సురాపానానికి (మద్యం) అధిపతి అయిన వారుణీ దేవి పుట్టుకొస్తుంది. ఆమెను రాక్షసులు స్వీకరిస్తారు. ముట్టుకోగానే ఎంతటి అలసటనైనా దూరం చేసే పారిజాత వృక్షం ఉద్భవిస్తుంది. దాన్ని స్వర్గంలో ఉంచుతారు. మణుల్లోకెల్లా అత్యంత గొప్పదైన కౌస్తుభమణి పుట్టుకొస్తుంది. దాన్ని విష్ణువు తన వక్షస్థలంపై అలంకరించుకున్నాడు. శంఖు చక్రాలు పుట్టుకొస్తాయి. వాటిని కూడా విష్ణువే స్వీకరిస్తాడు. చివరిగా ధన్వంతరి అమృత భాండంతో క్షీర సాగరం నుంచి బయటికి వస్తాడు. అందులో ఉన్న అమృతాన్ని తాగి దేవతలు మృత్యుంజయులుగా మారారు.
మన శరీరంలో ఊపిరితిత్తులు ఎంత ముఖ్యమైనవో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఊపిరితిత్తులు దెబ్బతింటే శ్వాస తీసుకోవడం చాలా కష్టమవడంతోపాటు అతి తక్కువ…
ఇటీవలి కాలంలో వీధికుక్కల బెడద మరింత ఎక్కువైంది. పిల్లల నుంచి పెద్దల వరకు అందరూ రోడ్డుపై స్వేచ్ఛగా తిరిగేందుకు చాలా…
సాహో చిత్రంలో ప్రభాస్ సరసన కథానాయికగా నటించి అలరించిన శ్రద్ధా కపూర్ రీసెంట్‌గా స్త్రీ2 అనే మూవీతో పలకరించింది. 2018లో…
ప్రముఖ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ పెద్ద చిక్కుల్లో పడ్డాడు. జానీ మాస్టర్ తనను లైంగికంగా వేధించాడని రాయదుర్గం పోలీసులకు మహిళా…
ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాన్ ఇటు రాజకీయాలు, అటు సినిమాలు రెండింటిని బ్యాలెన్స్ చేస్తూ ముందుకు సాగుతున్నారు. అయితే…
హారర్ సినిమా ప్రేమికుల్లో 'డీమాంటీ కాలనీ' సినిమాకు సపరేట్ ఫ్యాన్ బేస్ ఉన్న విషయం తెలిసిందే. తమిళ సినిమాయే అయినప్పటికీ...…
ఒక్కోసారి ఎవరిని ఎప్పుడు అదృష్టం ఎలా వరిస్తుందో తెలియదు. ఊహించని విధంగా లక్షాధికారి అవుతుంటారు. తుగ్గలి మండలం సూర్యతాండాలో రైతుకూలీకి…
ఈ రోజుల్లో బంధాలు ఎక్కువ కాలం కొనసాగడం లేదు. లక్షలు ఖర్చు పెట్టి ఎంతో అట్టహాసంగా పెళ్లి చేసుకుంటుండగా,ఆ పెళ్లి…