జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ప్రతి ఒక్కరి జీవితం వారి గ్రహాల గమనంపై ఆధార పడుతుంది. గ్రహాలు అనుకూలించడం, ప్రతికూలించడం అంటుంటారు. అంటే నవగ్రహాల్లో కొన్ని గ్రహాలు మంచి చేస్తే.. కొన్ని చెడు చేస్తాయన్నమాట. అందుకని గ్రహాలు అనుకూలించడం లేదు.. అంటుంటారు. ఈ విధంగా శని గ్రహం కూడా చాలా మందికి ఇబ్బందులను కలిగిస్తుంటుంది.
చాలా మంది జాతకంలో శని దోషం ఉంటుంది. దీంతో ఏ పని చేసినా కలసి రావడం లేదని, అంతా నష్టమే జరుగుతుందని కొందరు ఎప్పుడూ విచారిస్తుంటారు. అయితే అలాంటి వారు వినాయక నవరాత్రుల సందర్భంగా గణేషున్ని గరికతో పూజించాలి. గరిక అంటే ఆయనకు మహా ప్రీతి. అందువల్ల ఈ సమయంలో ఆయనను గరికతో పూజిస్తే శని దోషం పోతుంది. సకల శుభాలు కలుగుతాయి.
వినాయకుడికి గరిక అంటే చాలా ఇష్టం కనుక వినాయక చవితి రోజు పత్రిలో గరికను ఉంచి గణేషున్ని పూజిస్తారు. అయితే మిగిలిన సమయాల్లోనూ వినాయకున్ని గరికతో పూజించవచ్చు. ముఖ్యంగా ఇది నవరాత్రుల సమయం కనుక ఆయనను గరికతో పూజిస్తే శని దోషం పోతుంది. శని దగ్గరకు కూడా రాడని, అంతా శుభమే కలుగుతుందని పండితులు చెబుతున్నారు. కనుక శని దోషం పోవాలంటే వినాయకుడికి గరికతో పూజ చేయండి. ఆలయానికి వెళ్లేటప్పుడు గరికను తీసుకుని వెళ్లి వినాయకుడికి సమర్పించండి. దీంతో శని దోషం పోయి అంతా శుభమే కలుగుతుంది. అదృష్టం కలసి వస్తుంది.