ఆధ్యాత్మికం

Lakshmi Devi : మీ ఇంట్లో ల‌క్ష్మీదేవికి చెందిన ఇలాంటి ఫొటోలు ఉంటే తీసేయండి.. ఎందుకంటే..?

Lakshmi Devi : హిందువుల్లో చాలా మంది త‌మ‌కు అష్టైశ్వ‌ర్యాలు క‌ల‌గాల‌ని త‌మ‌కు ఇష్ట‌మైన ల‌క్ష్మీ దేవిని ప్రార్థిస్తుంటారు. ఎందుకంటే ధ‌నానికి ఆమే అధిప‌తి. ఎవ‌రికి ఐశ్య‌ర్యం సిద్ధించాల‌న్నా ఆమె అనుగ్ర‌హంతోనే అది జ‌రుగుతుంది. క‌నుకే చాలా మంది లక్ష్మిని ప్రార్థిస్తారు. అయితే చాలా మంది భ‌క్తులు త‌మ అనుకూల‌త‌లు, ఇష్టాల‌ను బ‌ట్టి వివిధ రూపాలు, ఆకారాలు, చిత్రాల్లో ఉన్న ల‌క్ష్మీ దేవి ప‌టాల‌ను, బొమ్మ‌ల‌ను పూజిస్తారు. కానీ మీకు తెలుసా..? కొన్ని ర‌కాల ల‌క్ష్మీదేవి చిత్ర ప‌టాల‌ను పూజిస్తే ధ‌నం రాద‌ట‌. పైగా ఉన్న ధ‌నం కూడా ఎలా వ‌చ్చిందో అలాగే పోతుంద‌ట‌. ఈ క్ర‌మంలో భక్తులు ఎలాంటి ప‌టాల‌ను, బొమ్మ‌ల‌ను పూజించాలో, ఎలాంటి వాటిని పూజించ‌కూడ‌దో ఇప్పుడు తెలుసుకుందాం.

గుడ్ల‌గూబ తెలుసుగా. దానిపై లక్ష్మీ దేవి కూర్చున్న‌ట్టుగా ఉండే బొమ్మ‌ను పూజించ‌కూడ‌ద‌ట‌. దీంతో అంతా అశుభ‌మే జ‌రుగుతుంద‌ట‌. ధ‌నం వ‌చ్చింది వ‌చ్చిన‌ట్టు పోతుంద‌ట‌. తామ‌ర పూవుపై ల‌క్ష్మీదేవి నిలుచుని ఉన్న ఫొటో కాకుండా కూర్చున్న‌ట్టుగా ఉన్న ఫొటోను పూజించాల‌ట‌. దీంతో అంతా శుభ‌మే జ‌రుగుతుంద‌ట. ఐశ్వ‌ర్యం సిద్ధిస్తుంద‌ట‌. గ‌రుత్మంతునిపై విష్ణువుతోపాటు ల‌క్ష్మీ దేవి కూర్చుని ఉన్న ఫొటోను పూజించినా మిక్కిలిగా ధ‌నం ల‌భిస్తుంద‌ట‌. అంతా మంచే జరుగుతుంద‌ట‌.

Lakshmi Devi

శేష‌త‌ల్పంపై విష్ణువు ప‌డుకుని ఉండ‌గా, ఆయ‌న కాళ్ల వ‌ద్ద లక్ష్మీ దేవి ఉన్న బొమ్మ‌ను పూజిస్తే అలాంటి వారి దాంప‌త్య జీవితం సుఖ‌మయంగా సాగుతుంద‌ట‌. కుబేరుని విగ్ర‌హం లేదా ఫొటోను ఇంట్లో పెట్టుకుంటే దాంతో ల‌క్ష్మీ దేవి సంతృప్తి చెంది ఆ ఇంట్లోని వారికి ఐశ్వ‌ర్యాల‌ను క‌లిగిస్తుంద‌ట‌. పాద‌ర‌సంతో త‌యారు చేసిన ల‌క్ష్మీ దేవి విగ్ర‌హాన్ని పూజిస్తే దాంతో అన్నీ శుభాలే క‌లుగుతాయ‌ట‌. ధ‌నం కూడా బాగా స‌మ‌కూరుతుంద‌ట‌. దీపావళి రోజున స్ఫ‌టిక శ్రీ‌యంత్రాన్ని ఒక ఎర్ర‌ని వ‌స్త్రంలో చుట్టి దాన్ని మీ మ‌నీ లాక‌ర్‌లో పెట్టాలి. దీంతో ఆ ఇంట్లో అంతా శుభ‌మే జ‌రుగుతుంది.

ల‌క్ష్మీ పూజ చేసేట‌ప్పుడు తుల‌సి ఆకులు, ధూపం, దివ్వెలు, పూవుల‌ను ఎక్కువగా వాడి పూజ చేయాల‌ట‌. దీంతో అనుకున్న‌ది జ‌రుగుతుంద‌ట‌. దీపావళి రోజున ల‌క్ష్మీ దేవి, కుబేరున్ని పూజించి అనంత‌రం ఈ మంత్రాన్ని 108 సార్లు ప‌ఠించాలి. దీని వ‌ల్ల భక్తులకు అనుకున్న‌ది నెర‌వేరుతుంద‌ట‌. ఓం య‌క్షాయ కుబేరాయ వైశ్ర‌వ‌ణాయ ధ‌న‌ధాన్యాధిప‌త‌యే, ధ‌న‌ధాన్య‌స‌మృద్ధిం మే దేహి దాప‌య స్వాహా.. అనే మంత్రాన్ని జ‌పించాల్సి ఉంటుంది. దీంతో ఆర్థిక స‌మ‌స్య‌ల‌న్నీ పోతాయి. మిక్కిలిగా ధ‌నం సంపాదిస్తారు.

Share
IDL Desk

Recent Posts

టెన్త్‌, ఇంట‌ర్‌, డిప్లొమా చ‌దివిన వారికి ఉద్యోగాలు.. ఆన్‌లైన్‌లో అప్లై చేయండి..!

అస్సాం రైఫిల్స్ వారు ప‌లు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టుల‌ను భ‌ర్తీ చేసేందుకు గాను ఆస‌క్తి, అర్హ‌త ఉన్న అభ్య‌ర్థుల…

Friday, 14 March 2025, 10:39 AM

డిగ్రీ చ‌దివిన వారికి శుభ‌వార్త‌.. బ్యాంక్ ఆఫ్ బ‌రోడాలో ఉద్యోగాలు..

బ్యాంకుల్లో ఉన్న‌త స్థానాల్లో ఉద్యోగం చేయాల‌ని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బ‌రోడా గొప్ప అవ‌కాశాన్ని క‌ల్పిస్తోంది. ఆ…

Sunday, 2 March 2025, 2:33 PM

యూనియ‌న్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సువ‌ర్ణ అవ‌కాశం.. 2691 పోస్టుల‌కు నోటిఫికేష‌న్‌..

బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిర‌ప‌డాల‌ని అనుకుంటున్న వారి కోసం యూనియ‌న్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…

Saturday, 22 February 2025, 10:19 AM

భార‌త్ ఎల‌క్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL)లో ఉద్యోగాలు.. వివ‌రాలు ఇవే..!

ప‌బ్లిక్ సెక్టార్‌కు చెందిన భార‌త్ ఎల‌క్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) ప‌లు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భ‌ర్తీకి గాను ఆస‌క్తి,…

Friday, 21 February 2025, 1:28 PM

బ్యాంక్ ఆఫ్ బ‌రోడాలో 4500 పోస్టులు.. జీతం నెల‌కు రూ.64వేలు..

దేశంలోని ప్ర‌ముఖ ప‌బ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బ‌రోడా ఆస‌క్తి, అర్హ‌త ఉన్న అభ్య‌ర్థుల నుంచి ప‌లు…

Thursday, 20 February 2025, 5:38 PM

టెన్త్ చ‌దివిన వారికి గుడ్ న్యూస్‌.. సికింద్రాబాద్ జోన్‌లో రైల్వే ఉద్యోగాలు..

రైల్వేలో ఉద్యోగం చేయాల‌నుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు శుభ‌వార్త చెప్పింది. ప‌లు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…

Tuesday, 18 February 2025, 5:22 PM

ఇండియ‌న్ ఎయిర్ ఫోర్స్‌లో ఉద్యోగాలు.. నెల‌కు రూ.40వేలు జీతం.. ఇంట‌ర్ అర్హ‌త‌తో..!

ఇండియ‌న్ ఎయిర్ ఫోర్స్‌లో ప‌నిచేయాల‌ని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవ‌కాశం అని చెప్ప‌వ‌చ్చు. ఇండియ‌న్ ఎయిర్…

Monday, 17 February 2025, 9:55 PM

పోస్ట‌ల్ శాఖ‌లో 45వేల ఉద్యోగాలు.. రాత ప‌రీక్ష‌, ఇంట‌ర్వ్యూ లేకుండానే ఎంపిక‌.. టెన్త్ చ‌దివితే చాలు..!

పోస్ట‌ల్ శాఖ‌లో ఉద్యోగం చేయాల‌ని అనుకుంటున్నారా..? అయితే ఈ స‌ద‌కాశం మీకోస‌మే. త‌పాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…

Monday, 17 February 2025, 3:09 PM