ఆధ్యాత్మికం

మన పురాణాల ప్రకారం ఈ 8 మంది వ్యక్తులు ఇంకా బతికే ఉన్నారట..! ఇంతకీ వారెవరో చూడండి..!

మ‌నిషి అన్నాక ఒక‌సారి మ‌ర‌ణిస్తే ఇక అంతే. అత‌ను మ‌ళ్లీ బ‌తికేందుకు అవ‌కాశాలు లేవు. అలాగే ఏ మ‌నిషైనా ఎప్పుడో ఒక‌ప్పుడు, ఏదో ఒక రోజున మ‌ర‌ణించాల్సిందే. అది ఎలాగైనా కావ‌చ్చు. మ‌నిషికి మృత్యువు అనివార్యం. ఇప్ప‌టి వ‌ర‌కు మ‌నిషి అనేక రంగాల్లో అప్ర‌తిహ‌తంగా దూసుకెళ్తున్నాడు కానీ, మృత్యువును జ‌యించ‌గ‌లిగే మందును మాత్రం క‌నిపెట్ట‌లేక‌పోయాడు. కనుక ఎవ‌రైనా త‌మ జీవితంలో ఏదో ఒక సారి మృత్యువు బారిన ప‌డాల్సిందే. అయితే హిందూ పురాణాల ప్ర‌కారం కొంద‌రు మాత్రం ఇప్ప‌టికీ కొన్ని యుగాల నుంచీ బ‌తికే ఉన్నార‌ట‌. అవును, మీరు విన్న‌ది క‌రెక్టే. ఇంతకీ.. వారెవ‌రో మీకు తెలుసా..? అదే చూద్దాం పదండి..!

మూడ‌డుగుల స్థ‌లం కోరి వామ‌నుడి రూపంలో వ‌చ్చిన‌ శ్రీ‌మ‌హావిష్ణువుచే పాతాళ లోకానికి తొక్క‌బ‌డిన బ‌లి చ‌క్ర‌వర్తి తెలుసు క‌దా. అత‌ను ఇప్ప‌టికీ బ‌తికే ఉన్నాడ‌ట‌. ప్ర‌తి ఏటా ఒక రోజున అత‌ను పాతాళ లోకం నుంచి భూమిపైకి వ‌స్తాడ‌ట‌. అదే రోజున కేర‌ళీయులు ఓన‌మ్ పండుగ జ‌రుపుకుంటార‌ట‌. రావ‌ణుడి త‌మ్ముడు విభీష‌ణుడు. ఇత‌ను రాముడికి యుద్దంలో స‌హ‌కరిస్తాడు. దీంతో రాముడు ఇత‌నికి మ‌ర‌ణం లేకుండా మృత్యుంజ‌యునిగా చేస్తాడు. ఈ క్ర‌మంలోనే విభీష‌ణుడు ఇప్ప‌టికీ కొన్ని ప్రాంతాల్లో తిరుగుతూ ఉంటాడ‌ట‌. ఇత‌నికి చెందిన గుడి ఒక‌టి రాజస్థాన్‌లోని కోటా అనే టౌన్ లో ఉంది. దేశంలో విభీష‌ణుడికి ఉన్న ఏకైక ఆల‌యం ఇదే. ఇక్క‌డే విభీష‌ణుడు ఇప్ప‌టికీ తిరుగుతూ ఉంటాడ‌ట‌.

శ్రీ‌మ‌హావిష్ణువుకు ఉన్న 10 అవ‌తారాల్లో ప‌ర‌శురామావ‌తారం కూడా ఒక‌టి. ఇత‌ను 21 సార్లు విశ్వంలో ఉన్న చ‌క్ర‌వ‌ర్తులంద‌రినీ జ‌యిస్తాడు. ఇందుకోస‌మే విష్ణువు ఇత‌న్ని కాలాల‌కు స‌మన్వ‌య‌క‌ర్త‌గా నియమించిన‌ట్టు చెబుతారు. ఇత‌ను కూడా మృత్యుంజ‌యుడే. ఇప్ప‌టికీ ఇత‌ను జీవించే ఉన్నాడ‌ట‌. మ‌హాభార‌తాన్ని రాసిన వేద వ్యాస మ‌హ‌ర్షి కూడా మృత్యుంజ‌యుడే. ఇత‌నికీ మ‌ర‌ణం లేద‌ట‌. ఇప్ప‌టికీ జీవించే ఉన్నాడ‌ట‌. మ‌హాభారతంలో అశ్వ‌త్థామ‌ది ఒక ముఖ్య‌మైన పాత్ర‌. ఇత‌ను ద్రౌప‌ది కుమారుల‌ను నిద్ర‌లోనే చంపుతాడు. అభిమ‌న్యుడి కుమారుడు ప‌రీక్షిత్తును కూడా త‌ల్లి గ‌ర్భంలో ఉండగానే చంపుతాడు, కానీ కృష్ణుడు అత‌న్ని బ‌తికిస్తాడు. అనంతరం కృష్ణుడు అశ్వ‌త్థామ‌కు శాపం పెడ‌తాడు. అందులో భాగంగానే అశ్వ‌త్థామ ఇప్ప‌టికీ జీవించే ఉన్నాడ‌ట.

కృపాచార్యుడు పాండ‌వులు, కౌర‌వుల‌కు గురువు. ద్రోణుడికి బంధువు. ఇతనికి కూడా మ‌ర‌ణం లేద‌ట‌. చాలా చిన్న వ‌య‌స్సులోనే మ‌ర‌ణం ఉంద‌ని తెలుసుకున్న మార్కండేయుడు శివునికై త‌ప‌స్సు చేసి ఆయ‌న‌చే మ‌హామృత్యుంజ‌య మంత్రం పొందుతాడు. ఈ క్ర‌మంలోనే మార్కండేయుడు మృత్యుంజ‌యుడిగా మారుతాడు. అందుకే ఆయ‌నకు కూడా మ‌ర‌ణం ఉండ‌దు. ఇప్ప‌టికీ బ‌తికే ఉన్నాడ‌ని చెబుతారు. భ‌క్తుల‌ను కాపాడే క‌లియుగ దైవంగా హనుమంతుడు పేరుగాంచాడు. ఈయ‌న కూడా మృత్యుంజ‌యుడే. ఈయ‌న‌కూ మ‌ర‌ణం లేదు, రాదు.

Share
IDL Desk

Recent Posts

టెన్త్‌, ఇంట‌ర్‌, డిప్లొమా చ‌దివిన వారికి ఉద్యోగాలు.. ఆన్‌లైన్‌లో అప్లై చేయండి..!

అస్సాం రైఫిల్స్ వారు ప‌లు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టుల‌ను భ‌ర్తీ చేసేందుకు గాను ఆస‌క్తి, అర్హ‌త ఉన్న అభ్య‌ర్థుల…

Friday, 14 March 2025, 10:39 AM

డిగ్రీ చ‌దివిన వారికి శుభ‌వార్త‌.. బ్యాంక్ ఆఫ్ బ‌రోడాలో ఉద్యోగాలు..

బ్యాంకుల్లో ఉన్న‌త స్థానాల్లో ఉద్యోగం చేయాల‌ని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బ‌రోడా గొప్ప అవ‌కాశాన్ని క‌ల్పిస్తోంది. ఆ…

Sunday, 2 March 2025, 2:33 PM

యూనియ‌న్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సువ‌ర్ణ అవ‌కాశం.. 2691 పోస్టుల‌కు నోటిఫికేష‌న్‌..

బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిర‌ప‌డాల‌ని అనుకుంటున్న వారి కోసం యూనియ‌న్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…

Saturday, 22 February 2025, 10:19 AM

భార‌త్ ఎల‌క్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL)లో ఉద్యోగాలు.. వివ‌రాలు ఇవే..!

ప‌బ్లిక్ సెక్టార్‌కు చెందిన భార‌త్ ఎల‌క్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) ప‌లు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భ‌ర్తీకి గాను ఆస‌క్తి,…

Friday, 21 February 2025, 1:28 PM

బ్యాంక్ ఆఫ్ బ‌రోడాలో 4500 పోస్టులు.. జీతం నెల‌కు రూ.64వేలు..

దేశంలోని ప్ర‌ముఖ ప‌బ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బ‌రోడా ఆస‌క్తి, అర్హ‌త ఉన్న అభ్య‌ర్థుల నుంచి ప‌లు…

Thursday, 20 February 2025, 5:38 PM

టెన్త్ చ‌దివిన వారికి గుడ్ న్యూస్‌.. సికింద్రాబాద్ జోన్‌లో రైల్వే ఉద్యోగాలు..

రైల్వేలో ఉద్యోగం చేయాల‌నుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు శుభ‌వార్త చెప్పింది. ప‌లు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…

Tuesday, 18 February 2025, 5:22 PM

ఇండియ‌న్ ఎయిర్ ఫోర్స్‌లో ఉద్యోగాలు.. నెల‌కు రూ.40వేలు జీతం.. ఇంట‌ర్ అర్హ‌త‌తో..!

ఇండియ‌న్ ఎయిర్ ఫోర్స్‌లో ప‌నిచేయాల‌ని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవ‌కాశం అని చెప్ప‌వ‌చ్చు. ఇండియ‌న్ ఎయిర్…

Monday, 17 February 2025, 9:55 PM

పోస్ట‌ల్ శాఖ‌లో 45వేల ఉద్యోగాలు.. రాత ప‌రీక్ష‌, ఇంట‌ర్వ్యూ లేకుండానే ఎంపిక‌.. టెన్త్ చ‌దివితే చాలు..!

పోస్ట‌ల్ శాఖ‌లో ఉద్యోగం చేయాల‌ని అనుకుంటున్నారా..? అయితే ఈ స‌ద‌కాశం మీకోస‌మే. త‌పాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…

Monday, 17 February 2025, 3:09 PM