Surya Namaskar : ఉదయాన్నే ప్రసరించే సూర్య కిరణాల్లో ఔషధ గుణాలుంటాయి. ఉదయాన్నే శరీరం, మనసు తాజాగా ఉంటాయి. ఈ సమయంలో సూర్యుడి కిరణాలు శరీరం పడితే మరింత ఆరోగ్యకరంగా ఉంటుంది. ఉదయ కిరణాల్లో విటమిన్ ఎ, డి లు పుష్కలంగా ఉండటంతో చర్మ వ్యాధులు దరికి రావు. అంతే కాకుండా నరాల బలహీనత, గుండె జబ్బులు కూడా తగ్గిపోతాయి. ఆయుర్వేదంలో సూర్యకిరణాలను చాలా ఉపయోగించుకుంటారు. ప్రకృతి వైద్యంలో రోగికి ఉదయాన్నే సూర్యరశ్మి తాకేలా నిలుచో బెడుతారు. ఏ రకంగా చూసినా సూర్యుడు లేనిదే మనుగడ లేదు.
ఇక సూర్యోదయం సమయంలో ఆచరించే నది స్నానాలకు విశిష్టత లేకపోలేదు. ఈ సమయంలో చేసే స్నానం ఒంటికి మంచిదని చెబుతారు. దీనికి కారణం తెలతెల వారుతుండగా నీటిపై పడే సూర్యకిరణాలు శరీరంలోని రుగ్మతలను దూరం చేస్తాయని ఆయుర్వేద శాస్త్రం చెపుతోంది. సైన్స్ కూడా ఈ విషయాన్ని నమ్ముతోంది. దీనికి కారణం లేలేత సూర్యకిరణాలు నీటిపై పడి ఏడు వర్ణాలుగా మార్పు చెందుతాయని.. ఆ కిరణాలు తిరిగి ఒంటి మీద పడటం వలన సన్ థెరపీ జరిగి చర్మ వ్యాధులు, గుండెకు, నరాలకి సంబంధించిన వ్యాధులు రావని అంటారు. అయితే ఈ సమయంలో రాగి పాత్రలతో నీటి తర్పణం చేయడం.. స్నానం చేయడం వలన పొటెన్షియల్ పవర్ పెరుగుతుందని సైన్స్ ధృవీకరిస్తోంది. రాగి పాత్రలోని నీటి గుండా సూర్యకిరణాలు ప్రసరించి మైండ్ కు రిలీఫ్ ను కలుగజేస్తాయని చెబుతోంది.
ఇక హిందు ధర్మశాస్త్రం ప్రకారం.. సూర్యుడిని ఆది దేవుడుగా పూజిస్తున్న సంగతి తెలిసిందే. ప్రాతః కాల స్నానం ఆచారిస్తున్నప్పుడు సూర్య నమస్కారాలు చేయడం వలన పాపాలు తొలగుతాయని నమ్మకం. ఇందులో భాగంగా 1. ఓం గ్లీమ్ సూర్య ఆదిత్యాయః 2. ఓం సూర్యాయ నమః అనే శ్లోకాలను పఠించడం ఆనవాయితీ. దీంతో ఆరోగ్యకరమైన ప్రయోజనాలు కలుగుతాయని చెబుతున్నారు.
అస్సాం రైఫిల్స్ వారు పలు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు గాను ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల…
బ్యాంకుల్లో ఉన్నత స్థానాల్లో ఉద్యోగం చేయాలని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బరోడా గొప్ప అవకాశాన్ని కల్పిస్తోంది. ఆ…
బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిరపడాలని అనుకుంటున్న వారి కోసం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…
పబ్లిక్ సెక్టార్‌కు చెందిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి గాను ఆసక్తి,…
దేశంలోని ప్రముఖ పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి పలు…
రైల్వేలో ఉద్యోగం చేయాలనుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు శుభవార్త చెప్పింది. పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…
ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో పనిచేయాలని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవకాశం అని చెప్పవచ్చు. ఇండియన్ ఎయిర్…
పోస్టల్ శాఖలో ఉద్యోగం చేయాలని అనుకుంటున్నారా..? అయితే ఈ సదకాశం మీకోసమే. తపాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…