Sitting In Temple : మన దేశంలో ప్రతి ఇంట్లోనూ దేవుడికి చిన్నపాటి గుడి అయినా కచ్చితంగా ఉంటుంది. ఇల్లు చిన్నగా ఉన్నా సరే దేవుడికి మాత్రం ఓ రూమ్ కేటాయిస్తాం. ప్రతి రోజూ దేవుడిని తలచుకోనిదే ఏ పని చేయని వారు కూడా ఉంటారు. ఎంత పెద్ద చదువులు చదివినా, ఎంత పెద్ద బిజినెస్ లు చేస్తున్నా.. ఎంత బిజీగా ఉన్నా సరే వారంలో ఒక్కసారైనా గుడులకు వెళ్తుంటారు జనాలు. కొందరు ప్రత్యేక పూజలు చేయిస్తారు. మరికొందరు హోమాలు, యాగాలు లాంటివి కూడా చేస్తారు. కష్టం వచ్చిన ప్రతి సారీ దేవుడిని నమ్ముకుని ముందుకు వెళ్తుంటారు. ఇక గుడికి వెళ్లడాన్ని పవిత్ర కార్యంగా చూస్తారు.
తాము అనుకున్న పనులు సవ్యంగా జరగాలని దేవుళ్లకు ప్రత్యేకంగా పూజలు చేయించేవారు ఎంతోమంది ఉంటారు. అయితే ఇలా గుడికి వెళ్లిన ప్రతి ఒక్కరూ తమ మొక్కులు చెల్లించుకుని, దేవుడి దర్శనం అయిన తర్వాత కచ్చితంగా గుడిలో కాసేపు కూర్చుంటారు. గుడిలో ప్లేస్ లేకపోతే కనీసం గుడి ఆవరణలో అయినా సరే కాసేపు కూర్చుంటారు. ఇది తరతారాల నుంచి ఆచారంగా వస్తోంది. కానీ ఇలా గుడిలో ఎందుకు కూర్చుంటారో చాలామందికి తెలియదు. కానీ పెద్ద వారి నుంచి చిన్న వయసు వారి దాకా అందరూ ఇలా గుడిలో కాసేపు కూర్చుని సేద తీరుతారు.
అయితే ఇలా గుడిలో కూర్చోవడానికి చాలా పెద్ద కారణాలే ఉన్నాయి. ఇలా గుడిలో కూర్చేంటే అనేక లాభాలు ఉన్నాయి. భగవంతుడి దర్శనంతో మన మనసు, శరీరం ఎంతో ప్రశాంతంగా ఉంటాయి. ఇంకా చెప్పాలంటే మన దేహం ఎంతో ఉత్తేజభరితంగా ఉంటుంది. శరీరంలో రక్త ప్రసరణ సరైన మోతాదులో జరుగుతుంది. గుడిలో కాసేపు కూర్చుంటే మన మనసు ఎంతో ప్రశాంతంగా ఉంటుంది. అక్కడ ఉండే ప్రశాంతమైన వాతావరణం మనలోని అలజడిని దూరం చేస్తుంది. అంతే కాకుండా గుడిలో పంతులు చదివే మంత్రాలు మన ఆలోచనలను ఉత్తేజపరుస్తాయి.
ఇంకో విషయం ఏంటంటే.. ఆలయాల నిర్మాణశైలి కూడా మనస్సును ప్రశాంతంగా ఉంచడానికి దోహదపడుతుంది. గుడి పరిసరాల్లో అస్కాయంత శక్తి తరంగాల పరిధి చాలా ఎక్కువగా ఉండేలా నిర్మిస్తారు. దాని వల్ల మన బాడీకి పాజిటివ్ ఎనర్జీ దొరుకుతుంది. మనసులో చెడు ఆలోచనలు రావు. అంతే కాకుండా మనం ఏ కోరికలతో గుడికి వస్తామో అవి మనమే నెరవేర్చుకునేంత పాజిటివ్ నెస్ మనలో స్పష్టంగా పెరుగుతుంది.
అందుకే ఈ గుడి ప్రదేశ కేంద్ర స్థానంలో మూల విరాట్‌ను ప్రతిష్ట చేస్తారట. కాబట్టి దేవుడి దర్శనం అయిన తర్వాత కొద్దిసేపు ఆలయంలో కూర్చుంటే మానసిక ప్రశాంతత దొరుకుతుంది. ఇది అనాదిగా వస్తున్న ఆచారం. కాకపోతే వీటి గురించి మనకు తెలియకపోయినా గుడిలో కాసేపు కూర్చుని మన మనసుకు ప్రశాంతతను పొందుతున్నాం. కాబట్టి మీరు ఎప్పుడైనా గుడికి వెళ్తే కచ్చితంగా గుడిలో కూర్చోండి.
అస్సాం రైఫిల్స్ వారు పలు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు గాను ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల…
బ్యాంకుల్లో ఉన్నత స్థానాల్లో ఉద్యోగం చేయాలని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బరోడా గొప్ప అవకాశాన్ని కల్పిస్తోంది. ఆ…
బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిరపడాలని అనుకుంటున్న వారి కోసం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…
పబ్లిక్ సెక్టార్‌కు చెందిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి గాను ఆసక్తి,…
దేశంలోని ప్రముఖ పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి పలు…
రైల్వేలో ఉద్యోగం చేయాలనుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు శుభవార్త చెప్పింది. పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…
ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో పనిచేయాలని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవకాశం అని చెప్పవచ్చు. ఇండియన్ ఎయిర్…
పోస్టల్ శాఖలో ఉద్యోగం చేయాలని అనుకుంటున్నారా..? అయితే ఈ సదకాశం మీకోసమే. తపాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…