సాధారణంగా మనం రోజు ఆలయానికి వెళ్ళి పూజలు చేయలేము కనుక మన ఇంట్లోనే పూజా మందిరాన్ని ఏర్పాటు చేసుకొని ప్రతిరోజు ఉదయం సాయంత్రం పూజలు నిర్వహిస్తుంటారు. అయితే ఈ విధంగా నిత్య పూజ కోసం మన గదిలో ఎలాంటి విగ్రహాలు ఉండాలి అనే విషయంలో చాలామంది సందేహాలు వ్యక్తం చేస్తుంటారు. అయితే నిత్య పూజకు మనం ఏ విగ్రహాలను వాడాలి?ఎలాంటి విగ్రహాలు పూజ గదిలో ఉండకూడదో ఇక్కడ తెలుసుకుందాం..
దేవుడి విగ్రహాలు ఎంతో అందంగా ఉన్నాయని మార్కెట్లో దొరికే మట్టి విగ్రహాలను, చెక్కతో చేసిన విగ్రహాలను మనం నిత్య పూజ చేయడానికి ఉపయోగించకూడదు. ఇలాంటి విగ్రహాలను కేవలం పండుగ సందర్భాలలో మాత్రమే ఉపయోగించి వాటిని వెంటనే నిమజ్జనం చేయాలి. ఈ విధమైనటువంటి విగ్రహాలను నిత్యపూజ ఉపయోగించడం వల్ల వాటికి పగుళ్లు ఏర్పడతాయి. ఈ విధంగా పగుళ్లు ఏర్పడిన విగ్రహాలకు పూజలు నిర్వహించ కూడదు.
ఈ క్రమంలోనే మన ఇంట్లో నిత్యం పూజకు ఉపయోగించే విగ్రహాలు లోహంతో తయారు చేసినవి మాత్రమే ఉపయోగించాలి. అయితే ఈ విగ్రహాలు చాలా ఎత్తులో కాకుండా, చిన్న పరిమాణంలో ఉండేలా చూసుకోవాలి. వినాయకుడి ప్రతిమను రాగితో తయారు చేసినది ఇంట్లో పెట్టుకుని పూజించడం వల్ల సకల శుభాలు కలుగుతాయి. అదేవిధంగా స్పటికంతో తయారు చేసిన విగ్రహాలను ఇంట్లో పెట్టుకోవడం వల్ల శుభ ఫలితాలు కలుగుతాయి. అలాగే ఉగ్ర రూపంలో ఉండే విగ్రహాలను పూజించకూడదు.నిత్య పూజలో మనకు ఎల్లప్పుడు అభయమిస్తూ ఆశీర్వదిస్తున్న టువంటి విగ్రహాలను మాత్రమే ఉపయోగించాలని పండితులు చెబుతున్నారు.
అస్సాం రైఫిల్స్ వారు పలు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు గాను ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల…
బ్యాంకుల్లో ఉన్నత స్థానాల్లో ఉద్యోగం చేయాలని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బరోడా గొప్ప అవకాశాన్ని కల్పిస్తోంది. ఆ…
బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిరపడాలని అనుకుంటున్న వారి కోసం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…
పబ్లిక్ సెక్టార్కు చెందిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి గాను ఆసక్తి,…
దేశంలోని ప్రముఖ పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి పలు…
రైల్వేలో ఉద్యోగం చేయాలనుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు శుభవార్త చెప్పింది. పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…
ఇండియన్ ఎయిర్ ఫోర్స్లో పనిచేయాలని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవకాశం అని చెప్పవచ్చు. ఇండియన్ ఎయిర్…
పోస్టల్ శాఖలో ఉద్యోగం చేయాలని అనుకుంటున్నారా..? అయితే ఈ సదకాశం మీకోసమే. తపాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…