Shakunalu : ఎన్నో అభివృద్ధి చెందుతున్నా సంస్కృతి, సంప్రదాయాలు అలానే ఉన్నాయి. చాలా మంది ఇప్పుడు కూడా పురాతన పద్ధతుల్ని పాటిస్తున్నారు. మన పూర్వీకులు నమ్మిన వాటిని ఇంకా నమ్మే వాళ్ళు చాలామంది ఉన్నారు. మంచి శకునం ఎదురు వస్తే తలపెట్టిన కార్యం, ఆటంకం లేకుండా పూర్తవుతుందని, పురాతన కాలం నుండి చాలా మంది నమ్ముతున్నారు. ఈరోజుల్లో కూడా ఎంతో మంది నమ్ముతున్నారు. మంచి శకునం చూసుకుని ఎక్కడికైనా వెళితే మనం శ్రీకారం చుట్టిన పని కచ్చితంగా పూర్తవుతుంది అని అంటారు. నీళ్ల బిందుతో స్త్రీలు ఎదురొస్తే అది చాలా మంచి శకునంగా భావించి, ముందుకు వెళుతుంటారు.
వెళ్తున్నప్పుడు గంట ధ్వని వినిపిస్తే ఎంతో శుభం కలుగుతుంది అంటారు. పిల్లాపాపలతో దంపతులు ఎదురు వస్తే కుడా చాలా మంచిదని భావిస్తారు. ఏనుగు, గుర్రం, ఆవులు వంటివి ఎదురు వచ్చినా కూడా అది చాలా మంచిగా భావించి పనికి వెళ్లడం జరుగుతుంది. ఒకవేళ చెడు శకునం ఎదురైతే కాసేపు కూర్చొని నీళ్లు తాగమని చెప్తుంటారు పెద్దలు. అయితే ఈరోజు అశుభ శకునాల గురించి చూద్దాం.
ఏడుపు, అకాల వర్షం, బల్లి పడడం, వితంతురు, జుట్టు విరబోసుకున్న వారు, జుట్టు లేని వారు కనపడడం, తుమ్ము, చెడు మాట, కాషాయ బట్టలు కట్టుకున్న వాళ్లు, కొత్త కుండ, కట్టెల మోపు, ముష్టివాడు, కుంటి కుక్క, పాము, రోగి, రజస్వల గర్భిణీ స్త్రీ, ఉప్పు, బొగ్గులు, రాళ్లు, బూడిద, మినుములు, నువ్వులు, ఆయుధాన్ని ధరించే వారు, చెడు జంతువులు, విరోధి, దెబ్బ తగలడం.
మనసు కీడు సంకించుట, ఆరోగ్యం బాగో లేకపోవడం ఇలాంటివన్నీ కూడా అశుభాలు జరుగుతాయని మంచి శకునాలు కావు అని అంటారు. ఇలాంటి శకునాలు ఎదురైతే చేతులు, కాళ్లు కడుక్కుని. 12సార్లు నీళ్లు పుక్కిలించి. ఆ తర్వాత తలపై నీళ్లు జల్లుకుని కాళ్లు నీటితో తుడుచుకుని నీళ్లు తాగి ఇష్టదైవాన్ని తలుచుకుని అప్పుడు బయలుదేరాలి. అప్పుడు తలపెట్టిన కార్యం కచ్చితంగా పూర్తవుతుంది.
అస్సాం రైఫిల్స్ వారు పలు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు గాను ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల…
బ్యాంకుల్లో ఉన్నత స్థానాల్లో ఉద్యోగం చేయాలని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బరోడా గొప్ప అవకాశాన్ని కల్పిస్తోంది. ఆ…
బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిరపడాలని అనుకుంటున్న వారి కోసం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…
పబ్లిక్ సెక్టార్కు చెందిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి గాను ఆసక్తి,…
దేశంలోని ప్రముఖ పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి పలు…
రైల్వేలో ఉద్యోగం చేయాలనుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు శుభవార్త చెప్పింది. పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…
ఇండియన్ ఎయిర్ ఫోర్స్లో పనిచేయాలని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవకాశం అని చెప్పవచ్చు. ఇండియన్ ఎయిర్…
పోస్టల్ శాఖలో ఉద్యోగం చేయాలని అనుకుంటున్నారా..? అయితే ఈ సదకాశం మీకోసమే. తపాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…