Praying To God : గుడికి వెళ్లినప్పుడైనా, ఇంట్లో పూజ చేసుకున్నప్పుడైనా దేవుడిని మనం కోరికలు కోరుకుంటూ ఉంటాం. కోరిక చిన్నదైనా, పెద్దదైనా దేవుని కోరిన కోరిక బయటికి చెప్పకూడదు అనే మాట వింటూ ఉంటాం. అసలు మనం కోరుకున్న కోరికను ఎందుకు బయటికి చెప్పొద్దంటారు. దాని వెనుక ఉన్న అసలైన కారణం ఏంటి.. అలా బయటికి చెబితే ఏం జరుగుతుంది.. అంతేకాదు గుడికి వెళ్లినప్పుడు మనం ఏం చేయాలి.. తదితర విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం.
దేవుడిని పూజించి కోరే కోరిక. బలీయమైనది.. కష్టమైనది.. మన వల్ల కానిది అయి ఉంటుంది.. అలాంటి కోరిక తీరిందంటే.. భగవంతుడు ఇచ్చాడంటే కచ్చితంగా ఎంతో ఆనందించే విషయమే అవుతుంది. అంత సుఖించే విషయం ధనం.. సౌఖ్యం.. మంచి భర్త.. లేదా భార్య.. పదవి ఏదైనా కావచ్చు. కోరిన కోరికను పైకి చెపితే విన్నవారు ఆనందంగా కనిపించినా.. లోలోన జరగకూడదని కోరుకోవచ్చు.పైకి మీ కోరిక తీరాలని మీతో చెప్పినప్పటికీ మనసులో మాత్రం తీరకూడదు అని కోరుకోవచ్చు. అలాంటి కోరిక జరగకుండా తీరకుండా మానవ ప్రయత్నం చేయవచ్చు. కోరిన కోరిక బయటకు చెప్పొద్దని పెద్దలు చెప్పడం వెనుకున్న కారణం ఇదే. గుళ్లో ఏ విధంగా మసలుకోవాలో ఒకసారి చదవండి..
గుడికి వెళ్ళినప్పుడు గట్టిగా నవ్వడం, అరవడం, ఐహిక విషయాల గురించి మాట్లాడడం చేయకూడదు. గుడి పరిసరాలను శుభ్రంగా ఉంచాలి. కొబ్బరి పెంకులు, అరటి తొక్కలు ఎక్కడబడితే అక్కడ వేయకూడదు. దర్శనం లైన్ లో తోసుకోకూడదు. దానివలన ఇతరులకు, మనకు ఇబ్బందే. అందరూ మనతోపాటుగా దేవుడి దర్శనానికి వచ్చినవారే కాబట్టి అందరితోపాటుగా వెళ్లడమే ఉత్తమం.
చాలామంది దేవుడి దగ్గరకు వెళ్లగానే కళ్లుమూసుకుని దండం పెట్టుకుంటారు. కానీ అలా చేయకూడదు. దేవుడిని ముందు తనివి తీరా చూడాలి. అంతేకానీ కళ్ళు మూసుకుని ఉండకూడదు. అంత దూరం వెళ్లింది దేవుడి దర్శనానికే కదా. అలాంటప్పుడు కళ్లు మూసుకుంటే దేవుడి దర్శనం ఎలా అవుతుంది. తీర్థం నిలబడే తీసుకోవాలి. ఇంట్లో అయితే తీర్థం కూర్చొని తీసుకోవాలి.
అస్సాం రైఫిల్స్ వారు పలు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు గాను ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల…
బ్యాంకుల్లో ఉన్నత స్థానాల్లో ఉద్యోగం చేయాలని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బరోడా గొప్ప అవకాశాన్ని కల్పిస్తోంది. ఆ…
బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిరపడాలని అనుకుంటున్న వారి కోసం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…
పబ్లిక్ సెక్టార్‌కు చెందిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి గాను ఆసక్తి,…
దేశంలోని ప్రముఖ పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి పలు…
రైల్వేలో ఉద్యోగం చేయాలనుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు శుభవార్త చెప్పింది. పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…
ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో పనిచేయాలని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవకాశం అని చెప్పవచ్చు. ఇండియన్ ఎయిర్…
పోస్టల్ శాఖలో ఉద్యోగం చేయాలని అనుకుంటున్నారా..? అయితే ఈ సదకాశం మీకోసమే. తపాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…