మన తెలుగు నెలలో ప్రతి నెల ఏదో ఒక ప్రత్యేకతలను కలిగి ఉంటుంది. తెలుగు నెలలో 4వ నెల అయిన ఆషాడమాసం నేడు ప్రారంభం అవుతుంది. ఈ ఆషాడమాసంలో శుభకార్యాలను మాత్రమే వాయిదా వేసినప్పటికీ ఈనెలని ఎంతో పవిత్రంగా భావిస్తారు. ఈ ఆషాడ అమావాస్యను ఆషాధి అమావాస్య లేదా హలహరి అమావాస్య అని కూడా అంటారు. మరి ఎంతో ముఖ్యమైన ఈ అమావాస్య ఏ సమయంలో వస్తుంది. అమావాస్య రోజు ఏ పనులు చేయాలో ఇక్కడ తెలుసుకుందాం.
ఆషాడ అమావాస్య 2021 జులై 9వ తేదీన వస్తుంది. అమావాస్య ఉదయం 5:16 గంటలకు ప్రారంభమయ్యే పదవ తేదీ ఉదయం 6:46 గంటల వరకు అమావాస్య ఘడియలు ఉంటాయి. ఈ అమావాస్య రోజున ఉదయాన్నే నిద్రలేచి తలంటు స్నానం చేసి సూర్యభగవానుడికి నమస్కరించి నీటిని తర్పణంగా వదలాలి.అదేవిధంగా మన పూర్వీకులను, పితృదేవతలను తలచుకొని వారికోసం ఈ అమావాస్య రోజున ఉపవాసం ఉండటం వల్ల వారి ఆత్మకు శాంతి కలుగుతుంది.
ఎంతో విశిష్టమైన ఈ ఆషాఢ అమావాస్య రోజున నిరుపేదలకు మన స్తోమతకు తగ్గట్టుగా దానధర్మాలు చేయడం వల్ల శుభ ఫలితాలను పొందవచ్చు. అలాగే బ్రాహ్మణులకు భోజనం పెట్టడం వల్ల ఎంతో పుణ్యఫలం. ఈ అమావాస్య రోజు ఉదయం రావి చెట్టుకు నీరు పోసి రావాలి. సాయంత్రం రావి చెట్టుకింద నువ్వుల నూనెతో దీపారాధన చేయడం వల్ల అనుకున్న కోరికలు నెరవేరుతాయని పండితులు చెబుతున్నారు.ముఖ్యంగా ఈ ఆషాడమాసం నుంచి సూర్యుడు మకర రాశి నుంచి కర్కాటక రాశిలోనికి ప్రవేశిస్తాడు కనుక ఈ ఆరు నెలల కాలాన్ని దక్షిణాయానం అని పిలుస్తారు. ఎంతో పవిత్రమైన ఈ ఆషాడమాసంలో తెలంగాణలో బోనాల ఉత్సవాలను నిర్వహిస్తారు. అదేవిధంగా పూరి జగన్నాథ రథయాత్ర ను కూడా ఆషాడ మాసంలో ఎంతో వైభవంగా నిర్వహిస్తారు.
అస్సాం రైఫిల్స్ వారు పలు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు గాను ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల…
బ్యాంకుల్లో ఉన్నత స్థానాల్లో ఉద్యోగం చేయాలని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బరోడా గొప్ప అవకాశాన్ని కల్పిస్తోంది. ఆ…
బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిరపడాలని అనుకుంటున్న వారి కోసం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…
పబ్లిక్ సెక్టార్‌కు చెందిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి గాను ఆసక్తి,…
దేశంలోని ప్రముఖ పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి పలు…
రైల్వేలో ఉద్యోగం చేయాలనుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు శుభవార్త చెప్పింది. పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…
ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో పనిచేయాలని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవకాశం అని చెప్పవచ్చు. ఇండియన్ ఎయిర్…
పోస్టల్ శాఖలో ఉద్యోగం చేయాలని అనుకుంటున్నారా..? అయితే ఈ సదకాశం మీకోసమే. తపాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…