సాధారణంగా ప్రతినెల మనకు అమావాస్య పౌర్ణమిలు వస్తూ ఉంటాయి. ఈ విధంగానే జూన్ 10వ తేదీ జ్యేష్ఠ అమావాస్య వస్తుంది. సాధారణంగా ఈ అమావాస్య పౌర్ణమి రోజులలో మన ఇంట్లో పెద్ద ఎత్తున పూజలు నిర్వహించి ఉపవాస దీక్షలు చేస్తుంటారు. అదేవిధంగా పేదలకు దానధర్మాలు చేస్తారు. అయితే నేడు వచ్చిన జ్యేష్ఠ అమావాస్యకు ఎంతో ప్రత్యేకత ఉంది. ఈ అమావాస్య రోజునే వట సావిత్రి పూజ, శని జయంతి కూడా నేడే కావడంతో ఈ అమావాస్య ఎంతో విశిష్టమైనది అని చెప్పవచ్చు.
ఎంతో పవిత్రమైన ఈ అమావాస్య రోజు వేకువ జామునే నిద్రలేచి నదీ ప్రాంతంలో స్నానాలు ఆచరించాలి. అదే విధంగా ఒక రాగి చెంబులో అక్షింతలు, నీరు, ఎర్రటి పుష్పాలను వేసి సూర్య దేవుడికి అర్ఘ్యం ఇవ్వాలి. అమావాస్య రోజు ఉపవాస దీక్షలతో పేదలకు దానధర్మాలు చేయడం వల్ల పితృదేవతలు సంతోష పడతారు.
అదేవిధంగా ఈ అమావాస్య రోజు శని జయంతి, వటసావిత్రి వ్రతం కావటంవల్ల మహిళలు ఉపవాస దీక్షలతో ఉండి అమ్మవారికి పూజ చేయడంతో వారి భర్తల దీర్ఘాయువుతో ఉంటారని చెప్పవచ్చు. అదే విధంగా శని జయంతి కూడా నేడే కావడంతో ఈరోజు శని దేవుడికి ప్రత్యేక పూజలు చేయడం వల్ల మన పై ఉన్న శని ప్రభావం తొలగిపోతుందనీ పండితులు చెబుతున్నారు.