మన హిందూ ఆచారాల ప్రకారం ప్రతి నెలా మనకు రెండు ఏకాదశి తిధులు వస్తాయి. అందులో ఒకటి శుక్లపక్షంలో రాగా, మరొకటి కృష్ణపక్షంలో వస్తుంది. ఈ విధంగా సంవత్సరంలో 24 ఏకాదశులు వస్తాయి. ఈ ఇరవై నాలుగు ఏకాదశులలో కెల్లా అత్యంత ముఖ్యమైన ఏకాదశి నిర్జల ఏకాదశి. ఈ నిర్జల ఏకాదశి జేష్ట మాస శుక్ల పక్షంలో వస్తుంది. ఈ ఏకాదశి రోజు ఎంతో నియమ నిష్టలతో విష్ణు దేవుడికి పూజ చేయటం వల్ల మిగిలిన 23 ఏకాదశలకు పూజ చేసిన ఫలితాన్ని పొందవచ్చు. మరి ఎంతో పవిత్రమైన ఈ ఏకాదశి రోజు ఏ విధంగా పూజ చేయాలో ఇక్కడ తెలుసుకుందాం.
జేష్ట మాస శుక్ల ఏకాదశి రోజు వచ్చే ఏకాదశి అంటే ఆ విష్ణుమూర్తికి ఎంతో పవిత్రమైనది. ఏకాదశి రోజు బ్రహ్మ ముహూర్తంలో స్నానమాచరించి గంగాజలంతో విష్ణు ప్రతిమకు అభిషేకం చేయాలి. అదేవిధంగా విష్ణు దేవుడికి ప్రత్యేకమైన అలంకరణ చేసి వివిధ రకాల పుష్పాలతో పాటు తులసి మాలలను కూడా సమర్పించాలి. అయితే ఏకాదశీ వ్రతం చేసే వారు ఉపవాసంతో పూజ చేయాలి. కనీసం పచ్చి మంచినీళ్లు కూడా తీసుకోకూడదు.
ఈ ఏకాదశి బ్రహ్మ ముహూర్తంలో మొదలై అమృత కాలంలో ముగిస్తుంది. ఈ విధంగా స్వామివారికి పూజ అనంతరం విష్ణు సహస్రనామాలను పఠించాలి.అలాగే స్వామివారికి సాత్విక నైవేద్యం సమర్పించడంతో స్వామి వారు ఎంతో ప్రీతి చెంది మనం కోరిన కోరికలను తప్పక నెరవేరుస్తారు. స్వామివారికి సమర్పించే నైవేద్యంలో తప్పనిసరిగా తులసీదళాలతో ఉండేలా చూసుకోవాలి. తులసీ దళాలు లేనిది స్వామి వారి పూజ పూర్తి కాదు.ఎంతో పవిత్రమైన ఈ ఏకాదశి రోజు కేవలం స్వామి వారికి మాత్రమే కాకుండా లక్ష్మీదేవిని పూజించడం వల్ల సర్వ శుభాలు కలుగుతాయని పండితులు తెలియజేస్తున్నారు.
అస్సాం రైఫిల్స్ వారు పలు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు గాను ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల…
బ్యాంకుల్లో ఉన్నత స్థానాల్లో ఉద్యోగం చేయాలని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బరోడా గొప్ప అవకాశాన్ని కల్పిస్తోంది. ఆ…
బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిరపడాలని అనుకుంటున్న వారి కోసం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…
పబ్లిక్ సెక్టార్‌కు చెందిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి గాను ఆసక్తి,…
దేశంలోని ప్రముఖ పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి పలు…
రైల్వేలో ఉద్యోగం చేయాలనుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు శుభవార్త చెప్పింది. పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…
ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో పనిచేయాలని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవకాశం అని చెప్పవచ్చు. ఇండియన్ ఎయిర్…
పోస్టల్ శాఖలో ఉద్యోగం చేయాలని అనుకుంటున్నారా..? అయితే ఈ సదకాశం మీకోసమే. తపాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…