ఆధ్యాత్మికం

Naivedyam : దేవుడికి స‌రైన ప‌ద్ధ‌తిలోనే నైవేద్యం పెడుతున్నారా.. లేదా.. తెలుసుకోండి..!

Naivedyam : దేవుడి ఆరాధనలో ప్రధానమైనది నైవేద్య‌ నివేదన.. గుడిలో దేవుడికే కాదు, ఇంట్లో నిత్య పూజ చేసేటప్పుడు, వ్రతాలు చేసినప్పుడు, ప్రత్యేక పూజలప్పుడు దేవుడికి నైవేద్యం సమర్పించడం సాధారణం. అలాంటి నైవేద్య‌ నివేద‌న చేసేట‌ప్పుడు మనకు తెలియకుండానే కొన్ని పొరపాట్లు చేస్తుంటాం. దానివల్ల ఉత్తమగతులు పొందే అవకాశాలను కోల్పోతుంటాం. కాబట్టి ఇకపై నైవేద్య‌ నివేద‌న చేసేప్పుడు ఈ నియమాల‌ను తప్పక పాటించండి.

నైవేద్యం ప్లాస్టిక్, స్టీల్, గ్లాస్ గిన్నెలలో పెట్టకూడదు. నైవేద్య‌ నివేదనానికి బంగారు, వెండి లేదా రాగి పాత్రలను మాత్రమే వాడాలి. వేడిగా ఉన్న పదార్దాలను నైవేద్యంగా పెడితే అది మహాపాపం అవుతుంది. అలా అని చల్లని పదార్దాల‌ను కూడా నైవేద్యానికి పెట్టకూడదు. గోరువెచ్చని పదార్థాలను దేవుడికి నైవేద్యంగా పెట్టాలి. ఎవరైతే నైవేద్య‌ పదార్థాలను తయారు చేస్తారో వాళ్లే నివేద‌న చేయాలి. అలాకాకుండా వేరొకరి చేత చేయించినట్టయితే నా తరపున వేరొకరు నివేద‌న చేస్తున్నారు, అపరాధం ఉంటే క్షమించమని అడగాలి.

Naivedyam

ఇంట్లో కానీ, ఆఫీసులో కానీ గృహస్తు మాత్రమే నైవేద్య‌ నివేద‌న చేయాలి. వేరొకరు పనికి రారు. బయటకొన్న పదార్థాలను, అతిగా పులిసినవి, ఇంట్లో తయారు చేసినవే అయినప్పటికీ, అతిగా పులుపువి, అతి కారంగా ఉన్న పదార్థాల‌ను నైవేద్యంగా పెట్టకూడదు. నైవేద్యం పెట్టిన వ్యక్తి తప్పనిసరిగా హారతి ఇవ్వాలి. నైవేద్యంలో బెల్లం ముక్క, నేతి అభిఘారమూ తప్పనిసరిగా ఉండేట్లు చూసుకోవాలి. నైవేద్యం పెట్టిన తర్వాత ఒక 5 నిముషాలు అలాగే వదిలేసి మనం పూజగదిలో నుండి వచ్చేయాలి. ఇలా చేస్తే దేవుడి చూపు ఆ ప్రసాదం పైన పడుతుంది.

నైవేద్యం ఎప్పుడూ కూడా చేసింది చేసినట్టుగా పెట్టాలి. కానీ దేవుడి కోసం విడిగా పెడితే అది మంచిది కాదు. ఈ నేపథ్యంలో కొంతమంది ముందుగానే నైవేద్యాలను తయారుచేసి పెట్టుకుంటే, మరికొందరు అప్పటికప్పుడు సిద్ధం చేసి పెడుతుంటారు. అయితే ఈ రెండు విధానాలు కూడా సరైనవికావని శాస్త్రం చెబుతోంది. నైవేద్యం పెట్టే సమయంలో ఆహార‌ పదార్థాల చుట్టూ కుడిచేత్తో నీళ్ళు చిలకరించి సంబంధిత దేవతా స్త్రోత్రం చదవాలి. ఏ కులస్థులైనా సరే, ఏ దేవీ దేవతలకైనా నైవేద్యం పెట్టేటప్పుడు ఓం సత్యమ్ చిత్తేన పరిషించామి, అమ్రుతమస్తు, అమ్రుతోపస్తరణమసి స్వాహా.. అని నైవేద్యం చుట్టూ నీటి బిందువుల్ని చిలకరించాలి.

తర్వాత ఓం ప్రాణాయ స్వాహా ! ఓం వ్యానాయ స్వాహా, ఓం ఉదానాయ స్వాహా , ఓం సమానాయ స్వాహా , ఓమ్ బ్రహ్మణే స్వాహా.. అని కుడిచేత్తో ఆహార పదార్థాల్ని దేవుళ్ల‌కు చూపించాలి. మధ్యే మద్యదే పానీయం సమర్పయామి.. అని.. నైవేద్యే పానీయం సమర్పయామి.. అని నైవేద్యం మీద మళ్ళీ నీటి బిందువుల్ని ప్రోక్షించాలి. నమస్కరోమి అని సాష్టాంగం చేసి లేవాలి. ఇలా దేవుళ్లు, దేవ‌త‌ల‌కు నైవేద్యాల‌ను స‌మ‌ర్పించాల్సి ఉంటుంది. అప్పుడే స‌రైన ప‌ద్ధ‌తిని పాటించిన‌ట్లు లెక్క‌. ఇలా కాకుండా త‌ప్పుగా నైవేద్యం పెడితే అన్నీ అన‌ర్థాలే క‌లుగుతాయి.. అన్న విష‌యాన్ని గుర్తుంచుకోవాలి.

Share
IDL Desk

Recent Posts

ప‌వ‌న్ క‌ళ్యాణ్‌తో ఇప్పుడు త‌న రిలేష‌న్ ఎలా ఉందో చెప్పిన ఆలీ..!

ఏపీ డిప్యూటీ సీఎం ప‌వ‌న్ క‌ళ్యాన్ ఇటు రాజ‌కీయాలు, అటు సినిమాలు రెండింటిని బ్యాలెన్స్ చేస్తూ ముందుకు సాగుతున్నారు. అయితే…

Friday, 20 September 2024, 9:42 AM

డీమోంట్ కాల‌నీ 2 ఓటీటీలోకి వ‌చ్చేస్తుంది.. ఎక్క‌డ, ఎప్పుడు అంటే..!

హారర్ సినిమా ప్రేమికుల్లో 'డీమాంటీ కాలనీ' సినిమాకు సపరేట్ ఫ్యాన్ బేస్ ఉన్న విష‌యం తెలిసిందే. తమిళ సినిమాయే అయినప్పటికీ...…

Thursday, 19 September 2024, 1:55 PM

పొలంలో రైతుకి దొరికిన రూ.5ల‌క్షల విలువైన వ‌జ్రం.. ఏకంగా జాక్ పాట్ త‌గిలిందిగా..!

ఒక్కోసారి ఎవ‌రిని ఎప్పుడు అదృష్టం ఎలా వ‌రిస్తుందో తెలియ‌దు. ఊహించ‌ని విధంగా ల‌క్షాధికారి అవుతుంటారు. తుగ్గలి మండలం సూర్యతాండాలో రైతుకూలీకి…

Wednesday, 18 September 2024, 10:46 AM

భ‌ర్త రోజూ స్నానం చేయ‌డం లేద‌ని ఏకంగా విడాకులు కోరిన భార్య‌

ఈ రోజుల్లో బంధాలు ఎక్కువ కాలం కొన‌సాగ‌డం లేదు. ల‌క్ష‌లు ఖ‌ర్చు పెట్టి ఎంతో అట్టహాసంగా పెళ్లి చేసుకుంటుండ‌గా,ఆ పెళ్లి…

Wednesday, 18 September 2024, 9:12 AM

అక్క‌డ కేవ‌లం స్విచ్‌ల‌ను ఆన్, ఆఫ్ చేయ‌డ‌మే ప‌ని.. జీతం రూ.30 కోట్లు.. ఎవ‌రికి జాబ్ కావాలి..?

ఒక‌టి కాదు రెండు కాదు, మూడు కాదు ఏకంగా ముప్పై కోట్ల జీతం. చేయాల్సిన ప‌ని ఏమి లేదు. స్విచ్…

Tuesday, 17 September 2024, 6:04 PM

పెట్రోల్ పంప్‌ల‌లో మోసం.. వాహ‌న‌దారులు ఈ టిప్స్ తెలుసుకుంటే మంచిది..

దేశంలో వాహ‌నాల వినియోగం ఎంత‌గా పెరుగుతుందో మ‌నం చూస్తూ ఉన్నాం. భారతదేశంలో రోజు రోజుకి వాహనాల సంఖ్య పెరుగుతూ పోతుండ‌డంతో…

Tuesday, 17 September 2024, 3:15 PM

పోస్టాఫీస్ బెస్ట్ స్కీమ్.. రూ.5ల‌క్ష‌లు పెట్టుబ‌డితో రూ.15 ల‌క్షల రాబ‌డి..

రిస్క్ చేయ‌కుండా మంచి ప్రాఫిట్ పొందాల‌ని అనుకునేవారు ఎక్కువ‌గా పోస్టాఫీస్‌పై ఆధార‌ప‌డుతుండ‌డం మ‌నం చూస్తూ ఉన్నాం. ప్రస్తుతం పోస్టాఫీసులో మంచి…

Tuesday, 17 September 2024, 11:11 AM

Devara Ticket Prices : అభిమానుల‌కు భారీ షాకిచ్చిన దేవ‌ర టీమ్‌.. టిక్కెట్ల రేట్ల‌ను భారీగా పెంచారుగా..!

Devara Ticket Prices : యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్ ఆర్ఆర్ఆర్ చిత్రం త‌ర్వాత న‌టించిన చిత్రం దేవ‌ర‌. కొర‌టాల శివ…

Monday, 16 September 2024, 6:57 AM