Mariamman Temple : మన దేశంలో అత్యంత చరిత్ర కలిగిన పురాతన ఆలయాలు ఎన్నో ఉన్నాయి. అలాంటి ఆలయాల్లో చాలా ఆలయాలను మహిమాన్వితమైనవిగా చెబుతారు. మనుషులు ఎప్పటి నుంచో అలాంటి ఆలయాల్లో పూజలు చేస్తున్నారని స్థల పురాణాలు కూడా చెబుతుంటాయి. అలాంటి ఆలయాల్లో తమిళనాడుకు చెందిన మరిఅమ్మన్ ఆలయం కూడా ఒకటి. ఈ ఆలయం స్థానికంగా ఎంతో ప్రసిద్ధి గాంచింది. ఇక్కడ దుర్గా దేవి భక్తులకు మరిఅమ్మన్‌గా దర్శనమిస్తుంది. ఈ ఆలయాన్ని 18వ శతాబ్దంలో విజయరాయ చక్రవర్తి నిర్మించారు. అయితే అంతకు కొన్ని వందల ఏళ్ల ముందు నుంచే ఆలయం లేనప్పుడే ఈ అమ్మవారిని పూజించడం మొదలు పెట్టారు.
ఇక్కడ అమ్మవారికి ఏదైనా సమర్పిస్తే భక్తులు కోరిన కోర్కెలను నెరవేరుస్తుందని నమ్మకం. అందుకనే చాలా మంది బెల్లం, బియ్యం, నెయ్యితో చేసే మవిళక్కు అనబడే ఓ ప్రత్యేకమైన వంటకాన్ని ఇక్కడ వండి అమ్మవారికి నైవేద్యంగా సమర్పిస్తారు. అలాగే స్థోమతను బట్టి వెండి లేదా ఉక్కుతో తయారు చేసిన లోహపు వస్తువులను ఇక్కడ విరాళంగా ఇస్తారు. హుండీల్లో వాటిని వేస్తారు. ఇలా చేయడం వల్ల అమ్మవారు అనుగ్రహిస్తుందని నమ్ముతారు.
ఇక ఈ ఆలయ ప్రాంగణంలో అడుగు పెడితే చాలు ఎలాంటి మొండి వ్యాధులు అయినా సరే నయమవుతాయని భక్తుల విశ్వాసం. పూర్వ కాలంలో ఈ ప్రాంతంలో ప్రజలకు తీవ్రమైన అనారోగ్య సమస్యలు వచ్చాయట. అప్పుడు భక్తులు అమ్మవారికి పూజలు చేసి వేడుకున్నారట. దీంతో వారి రోగాలు అన్నీ నయమయ్యాయట. అందుకనే రోగాలను నయం చేసే అమ్మగా ఈ దేవి ఎంతో ప్రసిద్ధి గాంచింది. ఇక ఈ ఆలయంలో ప్రతి ఆది వారం, మంగళవారం, శుక్రవారాలతోపాటు సెలవు రోజుల్లో విపరీతమైన రద్దీ ఉంటుంది. ఇక్కడికి రావాలంటే భక్తులు చెన్నై, కోయంబత్తూరు, ఈరోడ్ లకు వచ్చి ఈ ప్రాంతానికి చేరుకోవచ్చు.
అస్సాం రైఫిల్స్ వారు పలు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు గాను ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల…
బ్యాంకుల్లో ఉన్నత స్థానాల్లో ఉద్యోగం చేయాలని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బరోడా గొప్ప అవకాశాన్ని కల్పిస్తోంది. ఆ…
బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిరపడాలని అనుకుంటున్న వారి కోసం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…
పబ్లిక్ సెక్టార్‌కు చెందిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి గాను ఆసక్తి,…
దేశంలోని ప్రముఖ పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి పలు…
రైల్వేలో ఉద్యోగం చేయాలనుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు శుభవార్త చెప్పింది. పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…
ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో పనిచేయాలని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవకాశం అని చెప్పవచ్చు. ఇండియన్ ఎయిర్…
పోస్టల్ శాఖలో ఉద్యోగం చేయాలని అనుకుంటున్నారా..? అయితే ఈ సదకాశం మీకోసమే. తపాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…