Lord Shani Dev : మన సౌర వ్యవస్థలో 9 గ్రహాలు ఉంటాయని అందరికీ తెలిసిందే. వీటినే నవగ్రహాలు అని వ్యవహరిస్తాం. ఈ క్రమంలో జ్యోతిష్య శాస్త్రం, పురాణాల ప్రకారం ఈ 9 గ్రహాలు మనుషుల జీవితాలను ప్రభావితం చేస్తాయని చెబుతారు. వాటి గమనాన్ని బట్టి వ్యక్తుల జాతకం మారుతూ ఉంటుంది. ఒక్కో గ్రహం ఒక్కో రకమైన ఫలితాలను ఇస్తుంది. అదేవిధంగా వారంలో ఉన్న 7 రోజుల్లో ఒక్కో రోజుకు ఒక్కో గ్రహం అధిపతిగా ఉంటుంది (రాహు, కేతువులకు తప్ప). ఈ క్రమంలో శనిగ్రహం అధిపతిగా ఉన్న రోజు శనివారం. మరి ఆ రోజున ఎవరైనా ఏమేం పనులు చేయకూడదో, చేస్తే ఏం జరుగుతుందో ఇప్పుడు తెలుసుకుందామా.
వంకాయలు, నల్ల మిరియాలను శనివారం రోజున కొనకూడదు. అలాగే వాడకూడదు. వాడితే శనిగ్రహంతో సమస్యలు వచ్చి పడతాయట. ఆరోగ్యం బాగుండదట. సంపద హరించుకుపోతుందట. సాధారణంగా వ్యక్తులెవరూ మరొకరి చేతికి ఉప్పు ఇవ్వరు. కానీ శనివారం రోజున ఉప్పును ఎవరికైనా దానమివ్వవచ్చట తెలుసా. దీంతో సమస్యలు తొలగిపోతాయి. అయితే శనివారం రోజున ఉప్పును మాత్రం కొనకూడదు. కొంటే ఆర్థిక సమస్యలు వస్తాయట. శనివారం రోజున కొత్త వాహనాలను అస్సలు కొనకూడదు. అలాగే ఇనుప వస్తువులను కూడా కొనకూడదు. కొంటే ప్రమాదాల బారిన పడతారట. పండితులు కూడా ఇదే చెబుతారు. ఇనుప వస్తువులు కొనేందుకు శనివారం మంచిది కాదని వారు అంటారు.
మినప పప్పును శనివారం పూట కొనకూడదు. తినరాదు. కానీ దాన్ని ఆ రోజున వండి పేదలకు దానమివ్వవచ్చు. లేదంటే కాకులకు అయినా పెట్టవచ్చు. దీంతో శని సంతృప్తి చెందుతాడు. సత్ఫలితాలను ఇస్తాడు. నలుపు రంగు మీ ఫేవరెట్ కలరా. అయితే ఆ రంగు ఉన్న దుస్తులను మాత్రం శనివారం రోజున వేసుకోరాదు. అలా చేస్తే శనికి ఆగ్రహం వస్తుందట. అంతా అశుభమే కలుగుతుందట. శని సమస్యలను సృష్టిస్తాడట. ఆవాలను శనివారం పూట తినరాదు. అలాగే ఆవనూనెను కూడా. ఈ రెండింటినీ ఆ రోజున కొనరాదు కూడా. కానీ ఈ రెండింటితో చేసిన ఆహారాన్ని పేదలకు దానమివ్వవచ్చు. లేదంటే ఆవనూనెను శనివారం పూట శని విగ్రహంపై పోసి అభిషేకం చేయాలి. దీంతో శని సంతృప్తి చెంది మంచి ఫలితాలను ఇస్తాడట. చెక్క ఫర్నిచర్‌ను కూడా శనివారం పూట కొనకండి. ఒక వేళ ఆ రోజున వాటికి సంబంధించిన డెలివరీ వచ్చినా తీసుకోకండి. మరుసటి రోజు డెలివరీ తీసుకోండి. ఇలా చేస్తే శని సమస్యలను సృష్టించడు. అంతా మంచే చేస్తాడు.
అస్సాం రైఫిల్స్ వారు పలు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు గాను ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల…
బ్యాంకుల్లో ఉన్నత స్థానాల్లో ఉద్యోగం చేయాలని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బరోడా గొప్ప అవకాశాన్ని కల్పిస్తోంది. ఆ…
బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిరపడాలని అనుకుంటున్న వారి కోసం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…
పబ్లిక్ సెక్టార్‌కు చెందిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి గాను ఆసక్తి,…
దేశంలోని ప్రముఖ పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి పలు…
రైల్వేలో ఉద్యోగం చేయాలనుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు శుభవార్త చెప్పింది. పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…
ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో పనిచేయాలని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవకాశం అని చెప్పవచ్చు. ఇండియన్ ఎయిర్…
పోస్టల్ శాఖలో ఉద్యోగం చేయాలని అనుకుంటున్నారా..? అయితే ఈ సదకాశం మీకోసమే. తపాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…