Lord Shani Dev : ఎవరి జాతకం అయినా చెప్పాలంటే.. అందుకు ముందుగా గ్రహ సంచారం ఎలా ఉందో చూస్తారు. నవగ్రహాల సంచారాన్ని బట్టి జాతకం నిర్ణయిస్తారు. ఎవరి జాతకంలో అయినా ఉంటే గ్రహదోషాలు ఉంటాయి. కనుక ఆయా దోషాలకు అనుగుణంగా పరిహారాలు చేయిస్తుంటారు. అయితే నవగ్రహాల్లో శని గ్రహం కూడా ఒకటి. ఈ క్రమంలోనే శనివారం నాడు కొన్ని పనులు చేయడం ఆయనకు నచ్చదు. ఆ పనులు చేస్తే కచ్చితంగా శని చుట్టుకుంటుంది. కనుక శనివారం చేయకూడని పనులు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం.
శనివారం నాడు ఇంటి ముందు అపరిశుభ్రంగా ఉంటే శని ఆ ఇంట్లోకి ప్రవేశిస్తాడు. కనుక ఆ రోజు తప్పనిసరిగా ఇంటిని, ఇంటి పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవాలి. అలాగే ఇంటి ముందు చెప్పులు, చెత్తబుట్ట పెట్టరాదు. ఇలా పెడితే శనికి నచ్చదు. ఆయన నేరుగా ఇంట్లోకే వస్తాడు. దీంతో సమస్యలు మొదలవుతాయి. అలాగే శనివారం నాడు ఇంట్లో ఏడుపులు, పెడబొబ్బలు, గొడవలు ఉంటే.. శని ఇంట్లోకి ప్రవేశిస్తాడు. శనివారం నాడు ఎవరినీ ఇబ్బంది పెట్టకూడదు. పెడితే వారి శని మనకు చుట్టుకుంటుంది. కనుక ఈ విషయంలో జాగ్రత్తలు పాటించడం తప్పనిసరి.
శనివారం నాడు కోపంగా ఉంటే శని బాధలను ఎదుర్కోవాల్సి వస్తుంది. అలాగే శనివారం వెంకటేశ్వర స్వామికి పూజ చేసి హారతి ఇస్తే శని ప్రభావం ఉండదు. శివాభిషేకం కూడా చేయవచ్చు. ఇక శనివారం రోజు వీధి కుక్కలకు భోజనం పెడితే శని ఎంతో సంతోషిస్తాడు. మనల్ని ఏమీ చేయడు. శనివారం నాడు నువ్వుల నూనెను కొని ఇంటికి తేరాదు. శనివారం నలుపు రంగు దుస్తులను ధరించరాదు. అలాగే చీపురు శని దేవుడి ఆయుధం. కనుక దాన్ని కాళ్లతో తొక్కరాదు. ఎక్కడ పడితే అక్కడ పడేయరాదు. ఇలా పలు జాగ్రత్తలను పాటిస్తే శని దేవుడి ఆగ్రహానికి గురి కాకుండా తప్పించుకోవచ్చు. దీంతో శని నుంచి పుణ్యం లభిస్తుంది. కనుక శనిగ్రహం విషయంలో ఈ సూచనలను తప్పక పాటించాలి.
అస్సాం రైఫిల్స్ వారు పలు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు గాను ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల…
బ్యాంకుల్లో ఉన్నత స్థానాల్లో ఉద్యోగం చేయాలని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బరోడా గొప్ప అవకాశాన్ని కల్పిస్తోంది. ఆ…
బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిరపడాలని అనుకుంటున్న వారి కోసం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…
పబ్లిక్ సెక్టార్‌కు చెందిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి గాను ఆసక్తి,…
దేశంలోని ప్రముఖ పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి పలు…
రైల్వేలో ఉద్యోగం చేయాలనుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు శుభవార్త చెప్పింది. పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…
ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో పనిచేయాలని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవకాశం అని చెప్పవచ్చు. ఇండియన్ ఎయిర్…
పోస్టల్ శాఖలో ఉద్యోగం చేయాలని అనుకుంటున్నారా..? అయితే ఈ సదకాశం మీకోసమే. తపాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…