Lord Hanuman With Suvarchala : శ్రీరాముడి యొక్క అతి పెద్ద భక్తుడిగా పరిగణించబడే హనుమంతుడు మనందరికి బాల బ్రహ్మచారిగా తెలుసు. ఈ భూమిపై అమరత్వం పొందిన ఏడుగురు ఋషులల్లో హనుమంతుడు కూడా ఉన్నాడు. విశ్వమంతా హనుమంతుడిని బ్రహ్మచారిగా పరిగణిస్తుంది. కానీ హనుమంతుడు వివాహం చేసుకున్నాడని రుజువు చేసే ఆలయాలు కూడా ఉన్నాయి. భారత దేశంలో కొన్ని ప్రాంతాల్లో హనుమంతుడిని వివాహితుడిగా పరిగణిస్తారు. తెలంగాణాలో హనుమంతుడిని వివాహితుడిగా భావించే ఒక ఆలయం ఉంది. హైదరాబాద్ నుండి 220 కి.మీ దూరంలో ఖమ్మం జిల్లాలో హనుమంతుడు అతని భార్య సువర్చల దేవాలయం ఉంది. ఇది పురాతన దేవాలయం. ఇక్కడ హనుమంతుడు అతని భార్య సువర్చల విగ్రహాలు ఉన్నాయి.
ఈ దేవాలయాన్ని దర్శించుకున్న వారి యొక్క వైవాహిక జీవితంలో ఉన్న సమస్యలన్నీ తొలగిపోవడంతో పాటు భార్య భర్తల మధ్య బంధం బలపడుతుందని నమ్ముతారు. ఇక పురాణాల ప్రకారం హనుమంతుడి భార్య సువర్చల సూర్యభగవానుడి కుమార్తె. పరాశర సంహితంలో హనుమంతుడు మరియు సువర్చల వివాహ కథ కూడా ఉంది. పురాణాల ప్రకారం హనుమంతుడు సూర్యభగవానుడి నుండి జ్ఞానాన్ని పొందుతాడు. సూర్య భగవానుడికి 9 విద్యలలో జ్ఞానం ఉంది. అతను హనుమంతుడికి 5 విద్యల జ్ఞానాన్ని మాత్రమే భోదిస్తాడు. మిగిలిన విద్యలల్లో జ్ఞానాన్ని పొందాలంటే హనుమంతుడు వివాహం చేసుకోవాలి. లేదంటే అతను జ్ఞానాన్ని పొందలేడు. కానీ హనుమంతుడు బ్రహ్మచారి.
అప్పుడు సూర్యభగవానుడు ఈ సమస్యకు పరిష్కారాన్ని కనుగొన్నాడు. తన శక్తితో ఆడపిల్లకు జన్మనిచ్చి సువర్చల అని పేరు పెట్టాడు. సువర్చలను పెళ్లి చేసుకోమని సూర్యభగవానుడు హనుమంతుడిని కోరాడు. వివాహం చేసుకున్న తరువాత సువర్చల తపస్సులో మునిగిపోతుందని కనుక నీ బ్రహ్మచర్యానికి ఎటువంటి ఆటంకం ఉండదని సూర్యభగవానుడు చెప్పడంతో హనుమంతుడు సువర్చలను పెళ్లి చేసుకున్నాడు. పెళ్లి చేసుకున్న తరువాత సువర్చల తపస్సులో మునిగిపోయింది. దీంతో వివాహం చేసుకున్నప్పటికి హనుమంతుడు బ్రహ్మచారిగా ఉండిపోయాడు. వివాహం చేసుకున్నప్పటికి హనుమంతుడి బ్రహ్మచర్యానికి ఎటువంటి ఆటంకం కలగలేదు.
అస్సాం రైఫిల్స్ వారు పలు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు గాను ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల…
బ్యాంకుల్లో ఉన్నత స్థానాల్లో ఉద్యోగం చేయాలని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బరోడా గొప్ప అవకాశాన్ని కల్పిస్తోంది. ఆ…
బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిరపడాలని అనుకుంటున్న వారి కోసం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…
పబ్లిక్ సెక్టార్‌కు చెందిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి గాను ఆసక్తి,…
దేశంలోని ప్రముఖ పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి పలు…
రైల్వేలో ఉద్యోగం చేయాలనుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు శుభవార్త చెప్పింది. పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…
ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో పనిచేయాలని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవకాశం అని చెప్పవచ్చు. ఇండియన్ ఎయిర్…
పోస్టల్ శాఖలో ఉద్యోగం చేయాలని అనుకుంటున్నారా..? అయితే ఈ సదకాశం మీకోసమే. తపాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…