ఆధ్యాత్మికం

Lord Hanuman : ఆంజనేయుడికి హనుమంతుడు అని పేరు ఎలా వచ్చింది..? దాని వెనుక ఉన్న కథ తెలియాలంటే ఇది చదవాల్సిందే..!

Lord Hanuman : హిందువులకు పరమ పూజనీయుడు ఆంజనేయుడు. కలియుగం ఉన్నంతవరకూ చిరంజీవిగా నిలుస్తూ, భక్తుల కష్టాలను తీరుస్తూ ఉంటాడని నమ్మకం. ఆంజనేయుడికి అనేక పేర్లు ఉన్నాయి. అందులో ఒక్కటి హనుమంతుడు. మరి ఆ పేరు ఎందుకు వచ్చిందో తెలుసా..? వాయుదేవుని ద్వారా శివుని తేజం అంజనాదేవి అనే వానరకాంతకు చేరింది. అలా జన్మించినవాడు అంజనాదేవి కుమారుడు కాబట్టి ఆంజనేయుడు అనీ, వాయుదేవుని ద్వారా పుట్టినవాడు కాబట్టి పవనకుమారుడు అనీ పిలుచుకుంటారు. అంజనాదేవి భర్త పేరు కేసరి కాబట్టి, కేసరీనందనుడు అన్న పేరు కూడా లేకపోలేదు.

ఇక ఆంజనేయుడు బాల్యం నుంచీ చిలిపివాడే. అసలే నిమిషమైనా కుదురుగా ఉండలేడు. దానికి తోడు శివుని తేజము, వాయుదేవుని అంశ, కేసరి శక్తి ఉండనే ఉన్నాయి. దాంతో ఆయనను పట్టడం సాధ్యమయ్యేది కాదు. ఒకసారి ఆంజనేయుడు ఆకాశంలో సంచరిస్తుండగా ఎర్రటి సూర్యబింబం కనిపించింది. ఎర్రగా, గుండ్రంగా, తళతళలాడిపోతూ ఉన్న బింబాన్ని చూసి అదేదో పండు అని భ్రమించాడు ఆంజనీపుత్రుడు. వాయువేగంతో సూర్యుని వైపు దూసుకుపోయాడు. వాయుదేవునికి తన కుమారుని బాల్యచేష్టను చూసి ముచ్చట వేసిందే కానీ అందులో ఉన్న ప్రమాదం గోచరించలేదు.

Lord Hanuman

అందుకనే ఆంజనేయుని చుట్టూ చల్లటి గాలులను వీస్తూ, అతనికి వేడి తగలకుండా కాచుకున్నాడు. పైగా ఆ రోజు సూర్యగ్రహణం. దాంతో సూర్యుని తీక్షణత సైతం తక్కువగా ఉంది. ఒకవైపు నుంచి హనుమంతుడు సూర్యుని వైపు దూసుకుపోతుంటే, మరోవైపు నుంచీ సూర్యుని చెరపట్టేందుకు రాహువు పొంచుకు రాసాగాడు. కానీ హనుమంతుని చూసిన రాహువుకి మతిపోయింది. తాను సూర్యుని భక్షించేలోపే మరో రాహువు అందుకు సిద్ధపడటం ఏమిటి..? అని కంగారు పడిపోయాడు. వెంటనే వెనుతిరిగి ఇంద్రలోకం వైపు పరుగులు తీశాడు. స్వామీ ఇవాళ నేను సూర్యుని గ్రహించడం సాధ్యమయ్యేట్లు లేదు. మరో జీవి ఏదో సూర్యుని భక్షించేందుకు దూసుకువస్తోంది.. అంటూ మొరపెట్టుకున్నాడు.

రాహువు మాటలు విన్న ఇంద్రునికి పట్టరాని కోపం వచ్చింది. సృష్టి ధర్మానికి విరుద్ధంగా, పంచభూతాలను సైతం తోసిరాజని ముంచుకొస్తున్న ఆ ప్రమాదాన్ని స్వయంగా ఎదుర్కోవాలనుకున్నాడు. అమిత శక్తిమంతమైన తన వజ్రాయుధాన్ని విడిచాడు. ఇంద్రుని వజ్రాయుధానికి తిరుగేముంది, అది నేరుగా ఆంజనేయుని దవడకు తగిలింది. ఆ దెబ్బతో ఆంజనేయుడు మూర్ఛ‌రిల్లాడు. కుమారుడి అవస్థ చూసిన వాయుదేవునికి చెప్పలేనంత ఆగ్రహం కలిగింది. వెంటనే ముల్లోకాల నుంచీ తన పవనాలను ఉపసంహరించుకున్నాడు. వాయువు లేక ప్రపంచం తల్లడిల్లిపోయింది.

ఈ కల్లోలానికి కలవరపడి దేవతలంతా ఆంజనేయుని చెంతకు చేరుకున్నారు. బ్రహ్మ చేతి స్వర్శ తగలగానే ఆంజనేయుడు తిరిగి కోలుకున్నాడు. అదిగో అప్పటి నుంచీ ఆంజనేయుడు.. హనుమంతుడు అన్న పేరుని సాధించాడు. హను (దవడ) దెబ్బతిన్నది కనుక హనుమంతుడు అయ్యాడు. అలా హ‌నుమ‌గా మారి స‌క‌ల భ‌క్తుల‌చే పూజ‌లందుకుంటున్నాడు.

Share
IDL Desk

Recent Posts

టెన్త్‌, ఇంట‌ర్‌, డిప్లొమా చ‌దివిన వారికి ఉద్యోగాలు.. ఆన్‌లైన్‌లో అప్లై చేయండి..!

అస్సాం రైఫిల్స్ వారు ప‌లు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టుల‌ను భ‌ర్తీ చేసేందుకు గాను ఆస‌క్తి, అర్హ‌త ఉన్న అభ్య‌ర్థుల…

Friday, 14 March 2025, 10:39 AM

డిగ్రీ చ‌దివిన వారికి శుభ‌వార్త‌.. బ్యాంక్ ఆఫ్ బ‌రోడాలో ఉద్యోగాలు..

బ్యాంకుల్లో ఉన్న‌త స్థానాల్లో ఉద్యోగం చేయాల‌ని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బ‌రోడా గొప్ప అవ‌కాశాన్ని క‌ల్పిస్తోంది. ఆ…

Sunday, 2 March 2025, 2:33 PM

యూనియ‌న్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సువ‌ర్ణ అవ‌కాశం.. 2691 పోస్టుల‌కు నోటిఫికేష‌న్‌..

బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిర‌ప‌డాల‌ని అనుకుంటున్న వారి కోసం యూనియ‌న్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…

Saturday, 22 February 2025, 10:19 AM

భార‌త్ ఎల‌క్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL)లో ఉద్యోగాలు.. వివ‌రాలు ఇవే..!

ప‌బ్లిక్ సెక్టార్‌కు చెందిన భార‌త్ ఎల‌క్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) ప‌లు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భ‌ర్తీకి గాను ఆస‌క్తి,…

Friday, 21 February 2025, 1:28 PM

బ్యాంక్ ఆఫ్ బ‌రోడాలో 4500 పోస్టులు.. జీతం నెల‌కు రూ.64వేలు..

దేశంలోని ప్ర‌ముఖ ప‌బ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బ‌రోడా ఆస‌క్తి, అర్హ‌త ఉన్న అభ్య‌ర్థుల నుంచి ప‌లు…

Thursday, 20 February 2025, 5:38 PM

టెన్త్ చ‌దివిన వారికి గుడ్ న్యూస్‌.. సికింద్రాబాద్ జోన్‌లో రైల్వే ఉద్యోగాలు..

రైల్వేలో ఉద్యోగం చేయాల‌నుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు శుభ‌వార్త చెప్పింది. ప‌లు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…

Tuesday, 18 February 2025, 5:22 PM

ఇండియ‌న్ ఎయిర్ ఫోర్స్‌లో ఉద్యోగాలు.. నెల‌కు రూ.40వేలు జీతం.. ఇంట‌ర్ అర్హ‌త‌తో..!

ఇండియ‌న్ ఎయిర్ ఫోర్స్‌లో ప‌నిచేయాల‌ని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవ‌కాశం అని చెప్ప‌వ‌చ్చు. ఇండియ‌న్ ఎయిర్…

Monday, 17 February 2025, 9:55 PM

పోస్ట‌ల్ శాఖ‌లో 45వేల ఉద్యోగాలు.. రాత ప‌రీక్ష‌, ఇంట‌ర్వ్యూ లేకుండానే ఎంపిక‌.. టెన్త్ చ‌దివితే చాలు..!

పోస్ట‌ల్ శాఖ‌లో ఉద్యోగం చేయాల‌ని అనుకుంటున్నారా..? అయితే ఈ స‌ద‌కాశం మీకోస‌మే. త‌పాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…

Monday, 17 February 2025, 3:09 PM