Lord Hanuman : ప్రతి మంగళవారం ఆంజనేయ స్వామికి చాలా మంది పూజలు చేస్తూ ఉంటారు. ఆంజనేయ స్వామి అనుగ్రహం కలిగితే కచ్చితంగా అన్ని శుభాలే జరుగుతాయి అని భావిస్తారు. కలికాలంలో శీఘ్రంగా వరాలను ఇచ్చే స్వామి అని కూడా అంటారు. అయితే ఆయనకి ఇష్టమైన పదార్థాలని, పండ్లని ఆయనకి నైవేద్యంగా పెడితే ఖచ్చితంగా మనం ఆయన అనుగ్రహాన్ని పొందొచ్చు. మరి ఇక ఆంజనేయస్వామికి ఇష్టమైన వాటి గురించి చూసేద్దాం..
మంగళవారం నాడు ఆంజనేయ స్వామిని కొలిచేటప్పుడు ఇలా చేస్తే, ఆంజనేయ స్వామి అనుగ్రహం మీకు కలుగుతుంది. సమస్యల నుండి గట్టెక్కి ఆనందంగా, ఆరోగ్యంగా జీవించడానికి అవుతుంది. ఆంజనేయ స్వామికి తమలపాకుల పూజ అంటే ఎంతో ఇష్టం. ఆయనకి నిమ్మ, కొబ్బరి, పనస అంటే ఇష్టం. అరటి, మామిడి, నేరేడు కూడా ఇష్టమే. పూజ చేసేటప్పుడు ఆంజనేయ స్వామికి ఇష్టమైన పారిజాతములు, మందార పుష్పములు, నందివర్ధనము పూలతో పూజ చేయడం మంచిది.

అలానే మల్లెలు, గన్నేరు వంటి పూలంటే కూడా ఆయనకి మహా ఇష్టం. తులసీ, మారేడు, మామిడి, మాచీపత్రము, ఉత్తరేణి పత్రములతో కూడా పూజ చేయండి. ఇవి కూడా ఆంజనేయ స్వామికి చాలా ఇష్టము. నైవేద్యంగా పాలు, పాయసం, పొంగలి, అప్పములు, వడలు, వడపప్పు, పానకము పెడితే ఇష్టం.
సింధూరము, సింధూరాక్షతలు, పసుపు అక్షతలు, కుంకుమ, సాంబ్రాణి, గుగ్గిలము, ఖర్జూరము వంటివి కూడా మహా ఇష్టము. ఆంజనేయ స్వామికి దీపారాధన చేసేటప్పుడు ఆవు నెయ్యితో దీపారాధన చేయడం మంచిది. అరటి తోటలంటే కూడా ఆయనకి ఎంతో ఇష్టము. కనుక అక్కడ కూడా పూజించవచ్చు. మంగళవారం, శనివారం స్వామిని పూజిస్తే అంతా మంచే జరుగుతుంది.