Lord Ganesha : ఏ వినాయకుడి ప్రతిమకైనా తొండం ఉంటుంది కదా, మరది ఏ వైపుకు తిరిగి ఉంటుందో జాగ్రత్తగా గమనించారా..? చాలా మంది గమనించరు. సహజంగా ఎవరైనా తొండం చూస్తారు గానీ, అది ఏ వైపుకు తిరిగి ఉంది, అని అంతగా పరిశీలించరు. అయితే జనరల్‌గా మనం ఇంట్లో పూజలు చేసేవి, వీధుల్లో మండపాల్లో పెట్టే వినాయకుడి విగ్రహాల్లో వినాయకుడి తొండం ఎడమ వైపుకు తిరిగి ఉంటుంది. ఇక దేవాలయాల్లో, కొన్ని ప్రత్యేకమైన ప్రదేశాల్లో పెట్టే విగ్రహాల్లో మాత్రమే వినాయకుడి తొండం కుడివైపుకు తిరిగి ఉండడమో, లేదంటే నిటారుగా, స్ట్రెయిట్‌గా ఉండడమో కనిపిస్తుంది. అయితే ఈ మూడు వైపుల్లో ఒక్కో వైపుకు తొండం ఉన్న గణేషున్ని పూజిస్తే ఒక్కో విధమైన ఫలితం కలుగుతుందట. అదేంటో ఇప్పుడు తెలుసుకుందాం.
పైన ఇప్పటికే చెప్పుకున్నాం కదా. మన ఇండ్లలో, వీధుల్లో ఏర్పాటు చేసే గణేష్ విగ్రహాలకు తొండం ఇలా ఎడమ వైపుకు ఉంటుందని. అవును, మీరు విన్నది కరెక్టే. అయితే ఇలా తొండం ఎడమ వైపుకు ఉన్న గణేషున్ని పూజిస్తే ఇంట్లో ఉన్న వాస్తు దోషం తొలగిపోతుందట. ఇంట్లో ఉన్న వారందరి ఆరోగ్యం బాగుంటుందట. దీనికి తోడు గణేషుడి తల్లి అయిన పార్వతీ దేవి ఆశీస్సులు కూడా ఆ ఇంట్లోని వారందరికీ లభిస్తాయట. ఇంట్లో ఎల్లప్పుడూ సంతోషం ఉంటుందట.
దేవాలయాల్లో ప్రతిష్టించే గణేష్ విగ్రహాలకు తొండం ఇలా కుడివైపుకు ఉంటుందట. ఈ గణేషున్ని సిద్ధి వినాయకుడని పిలుస్తారట. ఇలాంటి గణేషున్ని పూజిస్తే మనం అనుకున్నది వెంటనే సిద్ధిస్తుందట. ముంబైలోని సిద్ది వినాయకుడి ఆలయంలో ఏది కోరినా వెంటనే జరిగిపోతుందనే ఓ నమ్మకం ఉంది. అందుకే అక్కడి వినాయకున్ని కోరిన కోర్కెలు తీర్చే వర సిద్ధి వినాయకుడని అందరూ పిలుస్తారు.
తొండం నిటారుగా ఉన్న గణేషుడి విగ్రహాలు చాలా అరుదుగా కనిపిస్తాయట. ఇలాంటి ఆకారంలో ఉన్న వినాయకున్ని పూజిస్తే జీవితంలో అనుకోని విధంగా గొప్ప కార్యాలు నెరవేరుతాయట.
అస్సాం రైఫిల్స్ వారు పలు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు గాను ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల…
బ్యాంకుల్లో ఉన్నత స్థానాల్లో ఉద్యోగం చేయాలని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బరోడా గొప్ప అవకాశాన్ని కల్పిస్తోంది. ఆ…
బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిరపడాలని అనుకుంటున్న వారి కోసం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…
పబ్లిక్ సెక్టార్‌కు చెందిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి గాను ఆసక్తి,…
దేశంలోని ప్రముఖ పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి పలు…
రైల్వేలో ఉద్యోగం చేయాలనుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు శుభవార్త చెప్పింది. పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…
ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో పనిచేయాలని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవకాశం అని చెప్పవచ్చు. ఇండియన్ ఎయిర్…
పోస్టల్ శాఖలో ఉద్యోగం చేయాలని అనుకుంటున్నారా..? అయితే ఈ సదకాశం మీకోసమే. తపాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…