ఆధ్యాత్మికం

Lord Ganesha : ఈ పువ్వులు, పండ్ల‌తో పూజిస్తే.. వినాయ‌కుడు ప్ర‌స‌న్నం అవుతాడు..!

Lord Ganesha : వినాయకుడిని ప్రసన్నం చేసుకోవడానికి చాలా మంది అనేక రకాలుగా ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. మొట్టమొదట‌ మనం ఏ దేవుడిని పూజించాలన్నా వినాయకుడిని పూజించి, ఆ తర్వాత మిగిలిన దేవుళ్ళని పూజిస్తూ ఉంటాము. వినాయకుడు అడ్డంకులని తొలగిస్తాడు. వినాయకుడు మనం చేసే పనిలో ఏ ఆటంకాలు లేకుండా మన పనులు చక్కగా అయిపోయేటట్టు చూస్తాడు. అయితే వినాయకుడిని పూజించేటప్పుడు మీరు ఈ పూలతో పూజిస్తే వినాయకుడి ఆశీర్వాదాలు మీకు లభిస్తాయి. శ్రేయస్సు కలుగుతుంది.

వినాయకుడిని ప్రసన్నం చేసుకోవాలని అనుకునే వాళ్ళు ఈ పండ్లు, పూలని పెట్టడం మంచిదే. మందారం పూలు అంటే వినాయకుడికి చాలా ఇష్టం. ఎర్రటి పువ్వులు ఏమున్నా వినాయకుడికి పెట్టండి. వినాయకుడికి ఎర్రని పూలతో పూజ చేస్తే చాలా ఇష్టం. వినాయకుడిని ప్రసన్నం చేసుకోవచ్చు. పారిజాతం పూలతో కూడా వినాయకుడిని ఆరాధించండి. పారిజాతాలు అంటే వినాయకుడికి చాలా ఇష్టం. గరిక కూడా వినాయకుడికి చాలా ఇష్టం. కచ్చితంగా వినాయకుడి పూజలో గరికని ఉపయోగించండి. గరికతో వినాయకుడిని ఆరాధిస్తే కచ్చితంగా వినాయకుడు మిమ్మల్ని సంతోషంగా ఉంచుతాడు.

Lord Ganesha

జిల్లేడు పూలు అంటే కూడా వినాయకుడికి చాలా ఇష్టం. ఆయ‌న‌కి కచ్చితంగా జిల్లేడు పూలను కూడా పెడుతూ ఉండండి. కదంబ పుష్పాలు అంటే కూడా ఎంతో ప్రీతి. కదంబ పుష్పాల‌తో పూజ చేస్తే క‌చ్చితంగా మీకు శుభం జరుగుతుంది. మల్లెపూలు కూడా వినాయకుడికి పెట్టొచ్చు. వైవాహిక జీవితంలో ప్రశాంతత కలగాలంటే మల్లెపూలతో వినాయకుడిని ఆరాధించండి.

ఇక పండ్ల విషయానికి వస్తే వినాయకుడికి ప్రీతికరమైనవి అరటి పండ్లు, జామ పండ్లు. ఈ రెండు పండ్లను మీరు నైవేద్యంగా పెట్టండి. అలాగే దానిమ్మ పండ్లు, మామిడి పండ్లు అంటే కూడా వినాయకుడికి చాలా ఇష్టం. వీటిని కూడా మీరు నైవేద్యంగా పెట్టండి. చెరుకు అంటే వినాయకుడికి చాలా ఇష్టం. చెరుకుని కూడా మీరు పెట్టొచ్చు. అలాగే సీతాఫలం, యాపిల్ పండ్లు, ఆరెంజ్, పైనాపిల్, అంజీర్, ద్రాక్ష, నేరేడు పండ్లను కూడా మీరు వినాయకుడికి నైవేద్యంగా పెట్టొచ్చు.

Share
Sravya sree

Recent Posts

టెన్త్‌, ఇంట‌ర్‌, డిప్లొమా చ‌దివిన వారికి ఉద్యోగాలు.. ఆన్‌లైన్‌లో అప్లై చేయండి..!

అస్సాం రైఫిల్స్ వారు ప‌లు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టుల‌ను భ‌ర్తీ చేసేందుకు గాను ఆస‌క్తి, అర్హ‌త ఉన్న అభ్య‌ర్థుల…

Friday, 14 March 2025, 10:39 AM

డిగ్రీ చ‌దివిన వారికి శుభ‌వార్త‌.. బ్యాంక్ ఆఫ్ బ‌రోడాలో ఉద్యోగాలు..

బ్యాంకుల్లో ఉన్న‌త స్థానాల్లో ఉద్యోగం చేయాల‌ని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బ‌రోడా గొప్ప అవ‌కాశాన్ని క‌ల్పిస్తోంది. ఆ…

Sunday, 2 March 2025, 2:33 PM

యూనియ‌న్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సువ‌ర్ణ అవ‌కాశం.. 2691 పోస్టుల‌కు నోటిఫికేష‌న్‌..

బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిర‌ప‌డాల‌ని అనుకుంటున్న వారి కోసం యూనియ‌న్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…

Saturday, 22 February 2025, 10:19 AM

భార‌త్ ఎల‌క్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL)లో ఉద్యోగాలు.. వివ‌రాలు ఇవే..!

ప‌బ్లిక్ సెక్టార్‌కు చెందిన భార‌త్ ఎల‌క్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) ప‌లు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భ‌ర్తీకి గాను ఆస‌క్తి,…

Friday, 21 February 2025, 1:28 PM

బ్యాంక్ ఆఫ్ బ‌రోడాలో 4500 పోస్టులు.. జీతం నెల‌కు రూ.64వేలు..

దేశంలోని ప్ర‌ముఖ ప‌బ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బ‌రోడా ఆస‌క్తి, అర్హ‌త ఉన్న అభ్య‌ర్థుల నుంచి ప‌లు…

Thursday, 20 February 2025, 5:38 PM

టెన్త్ చ‌దివిన వారికి గుడ్ న్యూస్‌.. సికింద్రాబాద్ జోన్‌లో రైల్వే ఉద్యోగాలు..

రైల్వేలో ఉద్యోగం చేయాల‌నుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు శుభ‌వార్త చెప్పింది. ప‌లు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…

Tuesday, 18 February 2025, 5:22 PM

ఇండియ‌న్ ఎయిర్ ఫోర్స్‌లో ఉద్యోగాలు.. నెల‌కు రూ.40వేలు జీతం.. ఇంట‌ర్ అర్హ‌త‌తో..!

ఇండియ‌న్ ఎయిర్ ఫోర్స్‌లో ప‌నిచేయాల‌ని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవ‌కాశం అని చెప్ప‌వ‌చ్చు. ఇండియ‌న్ ఎయిర్…

Monday, 17 February 2025, 9:55 PM

పోస్ట‌ల్ శాఖ‌లో 45వేల ఉద్యోగాలు.. రాత ప‌రీక్ష‌, ఇంట‌ర్వ్యూ లేకుండానే ఎంపిక‌.. టెన్త్ చ‌దివితే చాలు..!

పోస్ట‌ల్ శాఖ‌లో ఉద్యోగం చేయాల‌ని అనుకుంటున్నారా..? అయితే ఈ స‌ద‌కాశం మీకోస‌మే. త‌పాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…

Monday, 17 February 2025, 3:09 PM