ఆధ్యాత్మికం

Lord Ganesha : విష్ణుమూర్తిలాగే వినాయ‌కుడు కూడా అవ‌తారాలు ఎత్తాడు.. అవేమిటో తెలుసా..?

Lord Ganesha : వినాయకుడిని ఆరాధిస్తే, ఏ సమస్యలు లేకుండా సంతోషంగా ఉండొచ్చు. వినాయకుడిని ఆరాధిస్తే, విఘ్నాలు ఏమి లేకుండా, మన పనుల్ని మనం పూర్తి చేసుకోవచ్చు. అయితే, చాలామందికి తెలియని విషయం ఏమిటంటే, వినాయకుడికి కూడా విష్ణుమూర్తి లానే కొన్ని అవతారాలు ఉన్నాయి. ఆయా సందర్భాల్లో భక్తులను రక్షించడానికి, విఘ్నేశ్వరుడు దాదాపు 8 అవతారాలు ఎత్తినట్లు పురాణాల ద్వారా తెలుస్తోంది.

మాత్య‌ర్యాసురుడు, మదాసురుడు, మోహసురుడు వంటి రాక్షసులను జయించడానికి వక్రతుడు, ఏకదంతుడు, మహోదరుడు, గజాననుడు, లంబోదరుడు, వికతుడు, విఘ్నరాజు అనే అవతారాల‌ను వినాయకుడు ఎత్తాడు. ఆ అవతారాల గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం. చ్యవనుడనే రుషి మదాసురుడనే రాక్షసుడిని సృష్టించడం జరిగింది. రాక్షసుల గురువు శుక్రాచార్యుడు హ్రీం అనే మంత్రాన్ని ఉపదేశించగా ఎన్నో శక్తులు వచ్చాయి. దేవతలంతా భయపడిపోయారు. సనత్ కుమారుని వద్దకు వెళ్లి ఉపాయం అడగగా సనత్ కుమారుని సూచన మేరకు వినాయకుడిని ప్రార్థించగా ఆయన ఏకదంతునిగా అవతరించి మదాసురుడిని జయించాడు.

Lord Ganesha

ఇంద్రుడు చేసిన తప్పు వలన మాత్సర్యాసురుడు పుడతాడు. అతని బాధలని భరించలేక దేవతలంతా దత్తాత్రేయుని శరణు కోరగా విఘ్నేశ్వరుడిని ప్రార్థించమని చెప్తాడు. అప్పుడు వినాయకుడు వక్రతుండునిగా అవతరించాడు. అలానే, కుబేరుడి ఆశ నుండి లోభాసురుడు అనే రాక్షసుడు ఉద్భవించాడు. చివరికి వినాయకుడిని ప్రార్ధించి లోభాసురుడి నుండి విముక్తి కల్పించ‌మనగా గజాననుడిగా అవతరించి లోభాసురుడిని ఓడిస్తాడు వినాయకుడు.

అలానే, మోహాసురుడు అనే రాక్షసుడిని ఓడించడానికి వినాయకుడు మహోదరుడిగా పుట్టాడు. శంబరుడు అనే రాక్షసుని ప్రలోభంతో మోహాసురుడు ముల్లోకాలను పీడించాడు. అప్పుడు దేవతలు వినాయకుడిని ప్రార్ధించారు. అప్పుడు, విఘ్నరాజు అవతారంలో నాగుపాముని వాహనం చేసుకుని సంహరించాడు. అలానే, అహంకరాసురుడిని సంహరించడానికి, వినాయకుడు దూమ్రావర్ణుడు అనే అవతారాన్ని ఎత్తాడు. ఇలా వినాయకుడు కూడా విష్ణు మూర్తి లానే అవతారాలు ఎత్తాడు.

Share
Sravya sree

Recent Posts

టెన్త్‌, ఇంట‌ర్‌, డిప్లొమా చ‌దివిన వారికి ఉద్యోగాలు.. ఆన్‌లైన్‌లో అప్లై చేయండి..!

అస్సాం రైఫిల్స్ వారు ప‌లు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టుల‌ను భ‌ర్తీ చేసేందుకు గాను ఆస‌క్తి, అర్హ‌త ఉన్న అభ్య‌ర్థుల…

Friday, 14 March 2025, 10:39 AM

డిగ్రీ చ‌దివిన వారికి శుభ‌వార్త‌.. బ్యాంక్ ఆఫ్ బ‌రోడాలో ఉద్యోగాలు..

బ్యాంకుల్లో ఉన్న‌త స్థానాల్లో ఉద్యోగం చేయాల‌ని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బ‌రోడా గొప్ప అవ‌కాశాన్ని క‌ల్పిస్తోంది. ఆ…

Sunday, 2 March 2025, 2:33 PM

యూనియ‌న్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సువ‌ర్ణ అవ‌కాశం.. 2691 పోస్టుల‌కు నోటిఫికేష‌న్‌..

బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిర‌ప‌డాల‌ని అనుకుంటున్న వారి కోసం యూనియ‌న్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…

Saturday, 22 February 2025, 10:19 AM

భార‌త్ ఎల‌క్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL)లో ఉద్యోగాలు.. వివ‌రాలు ఇవే..!

ప‌బ్లిక్ సెక్టార్‌కు చెందిన భార‌త్ ఎల‌క్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) ప‌లు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భ‌ర్తీకి గాను ఆస‌క్తి,…

Friday, 21 February 2025, 1:28 PM

బ్యాంక్ ఆఫ్ బ‌రోడాలో 4500 పోస్టులు.. జీతం నెల‌కు రూ.64వేలు..

దేశంలోని ప్ర‌ముఖ ప‌బ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బ‌రోడా ఆస‌క్తి, అర్హ‌త ఉన్న అభ్య‌ర్థుల నుంచి ప‌లు…

Thursday, 20 February 2025, 5:38 PM

టెన్త్ చ‌దివిన వారికి గుడ్ న్యూస్‌.. సికింద్రాబాద్ జోన్‌లో రైల్వే ఉద్యోగాలు..

రైల్వేలో ఉద్యోగం చేయాల‌నుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు శుభ‌వార్త చెప్పింది. ప‌లు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…

Tuesday, 18 February 2025, 5:22 PM

ఇండియ‌న్ ఎయిర్ ఫోర్స్‌లో ఉద్యోగాలు.. నెల‌కు రూ.40వేలు జీతం.. ఇంట‌ర్ అర్హ‌త‌తో..!

ఇండియ‌న్ ఎయిర్ ఫోర్స్‌లో ప‌నిచేయాల‌ని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవ‌కాశం అని చెప్ప‌వ‌చ్చు. ఇండియ‌న్ ఎయిర్…

Monday, 17 February 2025, 9:55 PM

పోస్ట‌ల్ శాఖ‌లో 45వేల ఉద్యోగాలు.. రాత ప‌రీక్ష‌, ఇంట‌ర్వ్యూ లేకుండానే ఎంపిక‌.. టెన్త్ చ‌దివితే చాలు..!

పోస్ట‌ల్ శాఖ‌లో ఉద్యోగం చేయాల‌ని అనుకుంటున్నారా..? అయితే ఈ స‌ద‌కాశం మీకోస‌మే. త‌పాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…

Monday, 17 February 2025, 3:09 PM