సాధారణంగా మనం ఎంతో పవిత్రమైన ఆలయాలకు వెళ్ళినప్పుడు అక్కడ ఆలయ అధికారులు దొంగలు ఉన్నారంటూ భక్తులకు హెచ్చరికలను జారీ చేస్తూ ఉంటారు. ఈ విధంగా ఆలయాలలో ఎటువంటి దొంగతనాలు జరగకుండా ఉండడం కోసం ఆలయ సిబ్బంది ఆలయ ప్రాంగణంలో సీసీ కెమెరాలను కూడా ఏర్పాటు చేస్తూ ఉంటారు. కానీ మీరు ఎప్పుడైనా దొంగతనాలు జరిగే ఆలయాన్ని చూశారా. అవును వినడానికి ఆశ్చర్యంగా ఉన్నా.. ఈ ఆలయంలో సాక్షాత్తూ పురోహితులు దొంగతనం చేయాలని భక్తులను ప్రేరేపిస్తారు. ఈ విధంగా ఆలయంలో దొంగతనం చేసినప్పుడే భక్తుల కోరికలు నెరవేరుతాయని అక్కడ భక్తులు విశ్వసిస్తారు. మరి ఆ విచిత్రమైన ఆలయం ఎక్కడ ఉంది, ఈ ఆలయ చరిత్ర ఏమిటనే విషయాలను ఇక్కడ తెలుసుకుందామా..!
ఉత్తరాఖండ్ రాష్ట్రంలోని రూర్కీలో చూడియాలాలో ఆలయం ఉంది. దాని పేరు చూడామణి ఆలయం. ఈ ఆలయాన్ని సంతాన ఆలయం అని కూడా పిలుస్తారు. పిల్లలు లేని వారు ఈ ఆలయానికి వచ్చి ఆలయంలో అమ్మవారి పాదాల చెంత ఉన్న విగ్రహాలను మాత్రమే దొంగతనం చేయాలి. ఈ విధంగా చెక్క విగ్రహాలను దొంగతనం చేయడం వల్ల వారికి సంతానం కలుగుతుందని, సంతానం కలిగిన తర్వాత ఆ చెక్క బొమ్మతో పాటు మరో చెక్క బొమ్మను తీసుకు వచ్చి ఆలయంలో స్వామివారికి సమర్పించడం ఇక్కడ ఆనవాయితీగా వస్తోంది.
ఈ క్రమంలోనే పిల్లలు లేని ఎంతో మంది దంపతులు ఈ ఆలయానికి వచ్చి ఆ చెక్క బొమ్మలను దొంగతనం చేస్తుంటారు. ఈ ఆలయంలోని అమ్మవారి అనుగ్రహం పొందాలంటే తప్పనిసరిగా దొంగతనం చేయాలని ఇక్కడి పూజారులు ప్రజలు భావిస్తారు. పూర్వం ఒక రాజుకి అమ్మవారు చెక్క రూపంలో దర్శనం ఇవ్వడం వల్ల ఆ రాజు ఆ చెక్క బొమ్మను ఇంటికి తీసుకువెళ్లగా తన భార్య మగబిడ్డకు జన్మనిచ్చింది. అంతా ఆ తల్లి మహిమేనని భావించిన రాజు తరువాత తన కుటుంబంతో చెక్క బొమ్మను తీసుకువచ్చి ఆలయంలో సమర్పించి అమ్మవారికి మొక్కులు చెల్లించుకున్నారని ఆలయం చరిత్ర చెబుతోంది. అప్పటి నుంచి సంతానం కావాలనే వారు ఈ సంతాన ఆలయానికి వచ్చి దొంగతనం చేయడం ఆనవాయితీగా వస్తోంది.
అస్సాం రైఫిల్స్ వారు పలు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు గాను ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల…
బ్యాంకుల్లో ఉన్నత స్థానాల్లో ఉద్యోగం చేయాలని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బరోడా గొప్ప అవకాశాన్ని కల్పిస్తోంది. ఆ…
బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిరపడాలని అనుకుంటున్న వారి కోసం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…
పబ్లిక్ సెక్టార్కు చెందిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి గాను ఆసక్తి,…
దేశంలోని ప్రముఖ పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి పలు…
రైల్వేలో ఉద్యోగం చేయాలనుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు శుభవార్త చెప్పింది. పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…
ఇండియన్ ఎయిర్ ఫోర్స్లో పనిచేయాలని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవకాశం అని చెప్పవచ్చు. ఇండియన్ ఎయిర్…
పోస్టల్ శాఖలో ఉద్యోగం చేయాలని అనుకుంటున్నారా..? అయితే ఈ సదకాశం మీకోసమే. తపాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…