భార్య గర్భంతో ఉందంటే చాలు భర్త ఎంతో సంతోషిస్తాడు. భర్తే కాదు, అతని తరఫు వారు, ఆమె తరఫు వారు ఎంతో సందడి చేస్తారు. ప్రధానంగా హిందువుల్లో అయితే శ్రీమంతం వంటి శుభకార్యాలు నిర్వహిస్తారు. అయితే భార్య గర్భం దాల్చినప్పుడు ఆ వర్గానికి చెందిన కొన్ని విశ్వాసాల ప్రకారం భర్త పలు పనులు చేయకూడదట. అలా చేస్తే అరిష్టమని పురాణాలు చెబుతున్నాయి. ఈ క్రమంలో అలాంటి సమయంలో భర్తలు చేయకూడని ఆ పనులు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందామా..!
భార్య గర్భంతో ఉన్నప్పుడు భర్త సముద్ర స్నానం చేయకూడదు. అలాగే చెట్లను కూడా నరకకూడదట. అలా చేస్తే పుట్టే బిడ్డకు అరిష్టం కలుగుతుందట. భార్య గర్భం దాల్చాక ఆరు నెలల సమయం తరువాత భర్త కటింగ్ అస్సలు చేయించుకోకూడదు. కనీసం షేవింగ్ కూడా చేసుకోకూడదు. శ్మశానాలకు శవాలను తీసుకెళ్లే అంతిమ యాత్రలో శవాలను మోయకూడదు. అలా చేస్తే అరిష్టం చుట్టుకుంటుందట. భార్య ప్రెగ్నెంట్ అయ్యాక భర్త విదేశీ ప్రయాణాలకు వెళ్లకూడదట. అస్సలు ఆమెను విడిచి దూరంగా పోకూడదట. భార్య గర్భం దాల్చిన 7వ నెల మొదలైనప్పటి నుండి తీర్థయాత్రలకు వెళ్లకూడదట. అలాగే పడవలను ఎక్కకూడదట.
పర్వతారోహణము చేయకూడదు. యుద్దము చేయడం మానేయాలి. ఇంటికి స్తంభ ముహూర్తము పెట్టించకూడదు. గృహ ప్రవేశం చేయకూడదు. వాస్తుకర్మ నిర్వహించరాదు. ఈ పనులకు దూరంగా ఉండడమే మంచిది. శవాన్ని అనుసరించి వెళ్ళరాదు. అంటే శవయాత్రలోనూ పాల్గొనరాదు. దీంతోపాటు ప్రేత కర్మలు చేయకూడదట. ఇంకా ఉపశమనం, పిండదానం వంటి పనులు చేయకపోవడమే మంచిదట. పైన చెప్పినవి భార్య గర్భంతో ఉన్నప్పుడు భర్త చేయకూడని పనులు. అలాగే చేయాల్సిన పని ఒకటి ఉంది. అదేమిటంటే.. ఆ సమయంలో భార్య ఏది అడిగితే అది భర్త తెచ్చివ్వాలట. అలా చేస్తేనే ఆమె సంతోషంగా ఉండి తద్వారా పుట్టే బిడ్డ ఆరోగ్యంగా ఉంటుందట.
అస్సాం రైఫిల్స్ వారు పలు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు గాను ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల…
బ్యాంకుల్లో ఉన్నత స్థానాల్లో ఉద్యోగం చేయాలని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బరోడా గొప్ప అవకాశాన్ని కల్పిస్తోంది. ఆ…
బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిరపడాలని అనుకుంటున్న వారి కోసం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…
పబ్లిక్ సెక్టార్‌కు చెందిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి గాను ఆసక్తి,…
దేశంలోని ప్రముఖ పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి పలు…
రైల్వేలో ఉద్యోగం చేయాలనుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు శుభవార్త చెప్పింది. పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…
ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో పనిచేయాలని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవకాశం అని చెప్పవచ్చు. ఇండియన్ ఎయిర్…
పోస్టల్ శాఖలో ఉద్యోగం చేయాలని అనుకుంటున్నారా..? అయితే ఈ సదకాశం మీకోసమే. తపాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…