Holy Basil Plant : ప్రతి ఒక్క ఇంట్లో కూడా తులసి మొక్క ఉండాలి. తులసి మొక్కని ప్రతి ఒక్కరూ కూడా పూజిస్తూ ఉంటారు. తులసి మొక్క లేని ఇల్లు దరిద్రంతో ఉంటుందని పండితులు అంటున్నారు. అయితే తులసి మొక్కకి ఎంతో ప్రాధాన్యత ఉంది. పురాణాల్లో శ్రీకృష్ణుడికి తులాభారం వేసినప్పుడు, ఎంతకీ తూగని శ్రీకృష్ణుడు తులసి మొక్క కాడ వేయగానే తూగుతాడు. తులసి మొక్కకి ఉన్న దైవ శక్తి అటువంటిది. హిందూ ఆచార సంప్రదాయాలలో తులసికి అత్యంత ప్రాధాన్యత ఉంది.
తులసిని ప్రత్యేకంగా కోటలో ఉంచి పూజ చేస్తారు. అయితే, తులసి మొక్కని పెంచేటప్పుడు మాత్రం కొన్ని పొరపాట్లని చేయకూడదు. ముఖ్యంగా ఎలా పడితే అలా తులసి మొక్కని పెంచకూడదని శాస్త్రం అంటోంది. కాబట్టి తులసికి సంబంధించి కొన్ని వాస్తు నియమాలను ఇప్పుడు చూసేద్దాం. ఈ పొరపాట్లు చేయకుండా చూసుకోవడం మంచిది. తులసి మొక్కని కానీ తులసి కోటని కానీ ఎప్పుడూ తూర్పు వైపు పెట్టడం మంచిది.
ఉత్తరంలో కానీ, ఈశాన్య దిక్కున కానీ పెట్టుకోవచ్చు. ఈ దిక్కుల్లో ఉంటే, అంతా మంచి జరుగుతుంది. మీకు శుభం కలుగుతుంది. తులసి మొక్క పెట్టిన చోట, శుభ్రంగా ఉండాలి. బాగా కాంతి వచ్చేటట్టు ఉండాలి. చీకట్లో ఉండకూడదు. అలా ఉంటే ఇంటికి దరిద్రం. దుమ్ము ఉన్నచోటని కూడా తులసి మొక్కని పెట్టకూడదు. తులసి మొక్కని పెట్టినప్పుడు, కాస్త ఎత్తైన ప్రదేశంలో పెట్టాలి. అంటే ఏదైనా కుండీలో కానీ తులసికోటలో కానీ మీరు పెట్టుకోవచ్చు.
తులసి మొక్కకి కచ్చితంగా రోజు నీళ్లు పొయ్యాలి. తులసి ఎంత ఆరోగ్యంగా ఉంటే అంత పాజిటివ్ ఎనర్జీని ఇంటికి తీసుకువస్తుంది. దాంతో కుటుంబ సభ్యులందరికీ అదృష్టం కలుగుతుంది. తులసి మొక్క దగ్గర రోజు పూజ చేయడం మంచిది. కొంతమంది తులసి కోట చుట్టూ ప్రదక్షిణలు చేస్తారు. అలానే ఇంకొందరు దీపారాధన చేస్తూ ఉంటారు. ఇలా తులసి దగ్గర ఏ పూజలు చేసినా కూడా అభివృద్ధికి అది సహాయపడుతుంది. కాబట్టి ఈ విధంగా పాటిస్తూ ఉండండి. అప్పుడు కష్టాలు ఏమీ ఉండవు. సంతోషంగా ఉండొచ్చు.
అస్సాం రైఫిల్స్ వారు పలు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు గాను ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల…
బ్యాంకుల్లో ఉన్నత స్థానాల్లో ఉద్యోగం చేయాలని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బరోడా గొప్ప అవకాశాన్ని కల్పిస్తోంది. ఆ…
బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిరపడాలని అనుకుంటున్న వారి కోసం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…
పబ్లిక్ సెక్టార్‌కు చెందిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి గాను ఆసక్తి,…
దేశంలోని ప్రముఖ పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి పలు…
రైల్వేలో ఉద్యోగం చేయాలనుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు శుభవార్త చెప్పింది. పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…
ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో పనిచేయాలని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవకాశం అని చెప్పవచ్చు. ఇండియన్ ఎయిర్…
పోస్టల్ శాఖలో ఉద్యోగం చేయాలని అనుకుంటున్నారా..? అయితే ఈ సదకాశం మీకోసమే. తపాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…