God Idol In Car : సాధారణంగా ఎవరైనా సరే కొత్త కారును కొనేటప్పుడు దాని రంగు, ఫీచర్లు వంటి వాటిని చెక్ చేస్తారు. అన్నీ అనుకున్న ప్రకారమే చూసుకుని మరీ కార్లను కొంటారు. అయితే అంతా బాగానే ఉంటుంది కానీ కారును కొన్న తరువాత చాలా మంది చేసే తప్పు ఒకటి ఉంది. అదేమిటంటే.. సాధారణంగా కారును కొన్నాక పూజలు అవీ చేయిస్తారు. ఆ తరువాత దేవుళ్ల విగ్రహాలను కారులో పెడుతుంటారు.
కారు డాష్‌బోర్డుపై, ముందు కిటికీకి రెండు వైపులా లేదా మిర్రర్‌కు దేవుళ్ల విగ్రహాలను వేలాడదీయడం వంటివి చేస్తుంటారు. అయితే ఇలా దేవుళ్ల విగ్రహాలను కారులో పెట్టేటప్పుడు కొన్ని నియమాలను పాటించాల్సి ఉంటుందని, లేదంటే తీవ్ర సమస్యలు వచ్చి అంతా నష్టమే కలుగుతుందని పండితులు చెబుతున్నారు. ఇక ఆ నియమాలు ఏమిటో ఇప్పుడు చూద్దాం.
చాలా మంది కార్లలో వినాయకుడు లేదా హనుమాన్, దుర్గామత విగ్రహాలను చిన్న సైజ్‌లో ఉండేవి చూసి పెట్టుకుంటారు. అయితే వాస్తవానికి అసలు విగ్రహాలను కారులో పెట్టకూడదట. కేవలం ఫొటోలను మాత్రమే పెట్టుకోవాలని, లేదంటే నష్టం కలుగుతుందని, చెడు సంభవిస్తుందని పండితులు హెచ్చరిస్తున్నారు. ఇక చాలా మంది దేవుళ్ల విగ్రహాలు లేదా ఫొటోలను కారులో పెట్టి అనేక రకాల పనులు చేస్తుంటారు.
కారులో దేవుళ్ల విగ్రహాలు లేదా ఫొటోలు ఉన్నప్పుడు ఎట్టి పరిస్థితిలోనూ కారులో మద్యం సేవించరాదు, పొగ తాగరాదు, నాన్ వెజ్, ఉల్లిపాయలు, వెల్లుల్లి తినకూడదు, ఇలా చాలా మంది చేస్తుంటారు. కనుక ఈ అలవాటు మీకు కూడా ఉంటే మానుకోండి, లేదంటే అంతా అశుభమే జరుగుతుంది, కోరి కష్టాలను తెచ్చుకున్నట్లు అవుతుంది. ఇక కారులో విగ్రహాలు లేదా ఫొటోలను పెడితే తప్పనిసరిగా కారును రోజూ శుభ్రం చేయాలి. అలాగే కారులో ఉండే దేవుళ్లకు పూజ చేయాలి. అలా చేయలేకపోతే కారులో విగ్రహాలు లేదా ఫొటోలను పెట్టకూడదు. లేదంటే అంతా నష్టమే సంభవిస్తుందని, సమస్యల బారిన పడతారని పండితులు హెచ్చరిస్తున్నారు. కనుక మీరు కూడా ఇలా చేస్తుంటే వెంటనే ఈ అలవాటును మానుకోండి.
అస్సాం రైఫిల్స్ వారు పలు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు గాను ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల…
బ్యాంకుల్లో ఉన్నత స్థానాల్లో ఉద్యోగం చేయాలని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బరోడా గొప్ప అవకాశాన్ని కల్పిస్తోంది. ఆ…
బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిరపడాలని అనుకుంటున్న వారి కోసం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…
పబ్లిక్ సెక్టార్‌కు చెందిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి గాను ఆసక్తి,…
దేశంలోని ప్రముఖ పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి పలు…
రైల్వేలో ఉద్యోగం చేయాలనుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు శుభవార్త చెప్పింది. పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…
ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో పనిచేయాలని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవకాశం అని చెప్పవచ్చు. ఇండియన్ ఎయిర్…
పోస్టల్ శాఖలో ఉద్యోగం చేయాలని అనుకుంటున్నారా..? అయితే ఈ సదకాశం మీకోసమే. తపాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…