Durga Devi : చాలామంది ప్రతి రోజూ లలితా సహస్రనామాలను చదువుతూ ఉంటారు. లలితా సహస్రనామంలో అమ్మవారికి ఇష్టమైన నైవేద్యాలు గురించి ఉన్నాయి. మరి వాటిని తెలుసుకుందాం. లలితా సహస్రనామంలో గుడాన్న ప్రీతమానస అని ఉంటుంది. గుడ అంటే బెల్లం. అన్నం అంటే బియ్యాన్ని వండడం. బియ్యం, బెల్లంతో చేసే వంటకం. పరమాన్నం అన్నమాట. అమ్మవారికి ఇది ఎంతో ఇష్టం.
స్నిగ్దౌదన ప్రియా.. స్నిగ్ద అంటే తెలుపు. ఓదనము అంటే అన్నము. అంటే పసుపు కలిపినది. తెల్లని అన్నం అన్నమాట. తెల్లగా ఉంటుంది కనుక కొబ్బరి అన్నం కూడా కావచ్చు. దీన్ని తయారు చేసి కూడా అమ్మవారికి పెట్టొచ్చు. పాయసాన్నప్రియ.. పాలు, బియ్యంతో చేసే ఒక వంటకం అన్నమాట. ఇది కూడా అమ్మవారికి ఎంతో ఇష్టం. మధుప్రీతా అంటే.. మధు అంటే తేనె, ప్రీత అంటే ఇష్టమైనది. తేనెతో చేసిన పదార్థాలని మనం చెప్పచ్చు. తేనె గారెలు అంటే కూడా అమ్మవారికి ఎంతో ఇష్టం.
దద్ధ్యన్నాసక్తి హృదయా.. పెరుగు అన్నం. దద్దోజనం. సర్వోదనప్రీతచిత్తా అంటే కదంబం. దీనిని కాయగూరలు, బియ్యంతో చేస్తారు. ఇది కూడా అమ్మవారికి ఎంతో ఇష్టం. హరిద్రానైక రసిక.. హరిద్రము అంటే పసుపు. అలానే అన్నం. మన పరిభాషలో పులిహోర. ఇది కూడా అమ్మవారికి ఎంతో ఇష్టం.
ముగ్దౌదనాసక్త హృదయ.. అంటే పెసలతో చేసిన అన్నం. ఆసక్తి అంటే అభిరుచి కలిగిన. హృదయము అంటే మనసు కలిగినది. పెసలతో వండిన అన్నం. పులగమని మనం చెప్పుకోవచ్చు. ఇవన్నీ కూడా అమ్మవారికి చాలా ఇష్టం. అందుకే వీటిని నైవేద్యంగా చేసి పెడుతూ ఉంటారు. నవరాత్రుల్లో కూడా అమ్మవారిని పూజించి, తొమ్మిది రోజులు కూడా తొమ్మిది రకాల వంటకాలని నైవేద్యం పెడుతూ ఉంటారు. అయితే ఇలా లలితా సహస్రంలో నైవేద్యం గురించి ఉన్నట్లు చాలామందికి తెలియదు.
అస్సాం రైఫిల్స్ వారు పలు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు గాను ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల…
బ్యాంకుల్లో ఉన్నత స్థానాల్లో ఉద్యోగం చేయాలని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బరోడా గొప్ప అవకాశాన్ని కల్పిస్తోంది. ఆ…
బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిరపడాలని అనుకుంటున్న వారి కోసం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…
పబ్లిక్ సెక్టార్కు చెందిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి గాను ఆసక్తి,…
దేశంలోని ప్రముఖ పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి పలు…
రైల్వేలో ఉద్యోగం చేయాలనుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు శుభవార్త చెప్పింది. పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…
ఇండియన్ ఎయిర్ ఫోర్స్లో పనిచేయాలని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవకాశం అని చెప్పవచ్చు. ఇండియన్ ఎయిర్…
పోస్టల్ శాఖలో ఉద్యోగం చేయాలని అనుకుంటున్నారా..? అయితే ఈ సదకాశం మీకోసమే. తపాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…