సాధారణంగా మనం ఆలయానికి వెళ్ళినప్పుడు అక్కడ వివిధ రకాల పదార్థాలను, పండ్లను నైవేద్యంగా పెడుతుంటారు. ఎన్నో రకాల తీపి పదార్థాలను తయారు చేసి ముందుగా స్వామివారికి నైవేద్యంగా పెట్టి ఆ తర్వాత భక్తులకు ప్రసాదంగా ఇస్తారు. అయితే మీరు ఎప్పుడైనా స్వామివారికి నైవేద్యంగా న్యూడిల్స్ పెట్టడం విన్నారా ? వినడానికి ఎంతో ఆశ్చర్యంగా ఉన్నా ఇది నిజం. కోల్‌కతాలోని చైనా టౌన్ (China Town)లో తంగ్రా అనే ప్రాంతానికి వెళితే అక్కడ ఉన్న కాళీమాత ఆలయంలో అమ్మవారికి నైవేద్యంగా నూడుల్స్ పెట్టడం మనం చూడవచ్చు.
అసలు ఈ ఆలయంలో అమ్మవారికి నైవేద్యంగా నూడుల్స్ పెట్టడం ఏంటి అనే విషయానికి వస్తే.. కోల్‌కతాలోని చైనా టౌన్‌కి వెళితే మనం మన దేశం వదిలి చైనాలోకి వెళ్ళిన అనుభూతి కలుగుతుంది. ఎందుకంటే ఆ ప్రాంతంలో ఎక్కువగా చైనీయులు స్థిరపడి ఉన్నారు. ఇక్కడ వెలసినటువంటి అమ్మవారి ఆలయం విషయానికి వస్తే 60 సంవత్సరాల క్రితం ఒక చెట్టు కింద రెండు విగ్రహాలు ఉండటంతో ప్రజలు ఆ విగ్రహాలకు పూజ చేసేవారు. అయితే రాను రాను ఈ ప్రాంతవాసులు విగ్రహాలకు ఆలయం నిర్మించి ఈ ఆలయంలో అమ్మవారికి పెద్ద ఎత్తున పూజలు చేసేవారు.
అయితే ఈ ప్రాంతంలో ఎక్కువగా చైనీయులు ఉండటం వల్ల అమ్మ వారికి ముందుగా నైవేద్యంగా నూడుల్స్ సమర్పించిన తరువాతనే భక్తులకు ప్రసాదంగా పెట్టడం ఆనవాయితీగా వస్తోంది. అయితే అమ్మవారి ఆలయాన్ని దర్శించడం కోసం ఎంతో మంది భక్తులు వస్తున్నప్పటికీ అమ్మవారికి నైవేద్యంగా నూడుల్స్ సమర్పించనిదే పూజలు చేయరు. ఇక్కడ అమ్మవారికి కేవలం నూడుల్స్ మాత్రమే కాకుండా చాప్ సుయ్, స్టిక్కీ రైస్ వంటివి కూడా ప్రసాదంగా భక్తులకు పెడతారు.
మన శరీరంలో ఊపిరితిత్తులు ఎంత ముఖ్యమైనవో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఊపిరితిత్తులు దెబ్బతింటే శ్వాస తీసుకోవడం చాలా కష్టమవడంతోపాటు అతి తక్కువ…
ఇటీవలి కాలంలో వీధికుక్కల బెడద మరింత ఎక్కువైంది. పిల్లల నుంచి పెద్దల వరకు అందరూ రోడ్డుపై స్వేచ్ఛగా తిరిగేందుకు చాలా…
సాహో చిత్రంలో ప్రభాస్ సరసన కథానాయికగా నటించి అలరించిన శ్రద్ధా కపూర్ రీసెంట్గా స్త్రీ2 అనే మూవీతో పలకరించింది. 2018లో…
ప్రముఖ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ పెద్ద చిక్కుల్లో పడ్డాడు. జానీ మాస్టర్ తనను లైంగికంగా వేధించాడని రాయదుర్గం పోలీసులకు మహిళా…
ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాన్ ఇటు రాజకీయాలు, అటు సినిమాలు రెండింటిని బ్యాలెన్స్ చేస్తూ ముందుకు సాగుతున్నారు. అయితే…
హారర్ సినిమా ప్రేమికుల్లో 'డీమాంటీ కాలనీ' సినిమాకు సపరేట్ ఫ్యాన్ బేస్ ఉన్న విషయం తెలిసిందే. తమిళ సినిమాయే అయినప్పటికీ...…
ఒక్కోసారి ఎవరిని ఎప్పుడు అదృష్టం ఎలా వరిస్తుందో తెలియదు. ఊహించని విధంగా లక్షాధికారి అవుతుంటారు. తుగ్గలి మండలం సూర్యతాండాలో రైతుకూలీకి…
ఈ రోజుల్లో బంధాలు ఎక్కువ కాలం కొనసాగడం లేదు. లక్షలు ఖర్చు పెట్టి ఎంతో అట్టహాసంగా పెళ్లి చేసుకుంటుండగా,ఆ పెళ్లి…