హిందూ సాంప్రదాయాల ప్రకారం పెళ్లి అంటే ఎంతో సంప్రదాయబద్ధంగా జరిగే వేడుక. ఈ వేడుక ద్వారా రెండు జీవితాలూ ఒకటవుతాయి. ప్రతి మనిషి జీవితంలో ఎంతో పవిత్రమైన ఈ పెళ్లి వేడుకను చాలా సాంప్రదాయబద్దంగా, వేదమంత్రాల నడుమ పంచభూతాల సాక్షిగా పండితులు పెళ్లి తంతు కార్యక్రమాన్ని జరిపిస్తారు. అయితే నేటి తరం యువత సాంప్రదాయానికన్నాపెళ్లిలో ఫోటోలు, వీడియోలకు అధిక ప్రాధాన్యత ఇవ్వడం వల్ల సాంప్రదాయాలు, ఆచారాలు మంట కలిసిపోతున్నాయి. ముఖ్యంగా పెళ్లిలో కొన్ని పొరపాట్లు చేయటం వల్ల.. ఎన్నో ఇబ్బందులను ఎదుర్కోవాల్సి వస్తుందని పండితులు తెలియజేస్తున్నారు. మరి పెళ్లిలో ఏ విధమైనటువంటి పొరపాట్లను చేయకూడదనే విషయాలను ఇక్కడ తెలుసుకుందామా..!
పెళ్లిలో అత్యంత ముఖ్యమైన సమయం మాంగళ్యధారణ. మాంగళ్యధారణ సరైన ముహూర్తానికి జరగకపోతే భార్యాభర్తల మధ్య తీవ్ర మనస్పర్ధలు, గొడవలు తలెత్తుతాయి. తలంబ్రాలకు బదులు థర్మోకోల్ వాడటం వల్ల బంధు ద్వేషం పెరుగుతుంది. పెళ్లికి వచ్చిన అతిథులు మండపంపైకి చెప్పులు వేసుకుని వెళ్లడం వల్ల మండపంలో ఉన్న దేవతలు వెళ్లిపోతారని ఆ దంపతుల జీవితంలో కష్టాలు ఎదురవుతాయని పండితులు చెబుతున్నారు.
అయితే ప్రస్తుతం పెళ్లిళ్లలో చెప్పులు వేసుకుని వెళ్లడం ఒక ఫ్యాషనైపోయింది. పురోహితుల నుంచి వేదమంత్రాలు రావాల్సిన చోట సెల్ ఫోన్లు, మైకులలో మంత్రాలు వినిపిస్తూ మన సాంప్రదాయాలను తుంగలో తొక్కుతున్నారు. ఇలా ఎంతో సాంప్రదాయబద్ధంగా వేడుకగా జరుపుకునే ఈ పెళ్లి కార్యక్రమంలో ఇలాంటి పొరపాట్లు చేయకూడదని పండితులు తెలియజేస్తున్నారు.
అస్సాం రైఫిల్స్ వారు పలు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు గాను ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల…
బ్యాంకుల్లో ఉన్నత స్థానాల్లో ఉద్యోగం చేయాలని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బరోడా గొప్ప అవకాశాన్ని కల్పిస్తోంది. ఆ…
బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిరపడాలని అనుకుంటున్న వారి కోసం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…
పబ్లిక్ సెక్టార్‌కు చెందిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి గాను ఆసక్తి,…
దేశంలోని ప్రముఖ పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి పలు…
రైల్వేలో ఉద్యోగం చేయాలనుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు శుభవార్త చెప్పింది. పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…
ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో పనిచేయాలని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవకాశం అని చెప్పవచ్చు. ఇండియన్ ఎయిర్…
పోస్టల్ శాఖలో ఉద్యోగం చేయాలని అనుకుంటున్నారా..? అయితే ఈ సదకాశం మీకోసమే. తపాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…