మన హిందూ సాంప్రదాయాల ప్రకారం ఒక్కో దేవుడికి ఒక వాహనం ఉంది. విష్ణుమూర్తికి గరుడు వాహనం అయితే, పరమేశ్వరుడికి నంది వాహనంగా ఉంది. అదేవిధంగా వినాయకుడికి ఎలుక వాహనం అయితే కార్తికేయునికి నెమలి వాహనం. ఇలా ఒక్కొక్క దేవునికి ఒక్కొక్క వాహనం ఉంటుంది. అలాగే లక్ష్మీదేవికి కూడా వాహనం గుడ్లగూబ అని మనకి తెలిసినదే. అయితే గుడ్లగూబ లక్ష్మీదేవికి వాహనంగా మారడానికి గల కారణం ఏమిటి? అనే విషయాలను ఇక్కడ తెలుసుకుందాం.
సాధారణంగా గుడ్లగూబను ఒక అపశకున పక్షిగా భావిస్తాము. గుడ్లగూబ మన పరిసరాలలో అరిస్తే ఏదో కీడు జరుగుతుందని భావిస్తాము. అలాంటి గుడ్లగూబ సాక్షాత్తు లక్ష్మీదేవికి వాహనంగా ఎలా మారింది అనే విషయానికి వస్తే…పురాణాల ప్రకారం దేవతలు రాక్షసులు సాగర మధనం చేస్తున్న సమయంలో సముద్ర గర్భం నుంచి ఒక్కో వస్తువు బయటకు ఉద్భవిస్తాయి. ఈ క్రమంలోనే పాల కడలి నుంచి లక్ష్మీదేవి కూడా ఉద్భవించింది.
ఈ విధంగా సముద్రం నుంచి లక్ష్మీదేవి ఉద్భవించడానికి తనకు వాహనం కావాలని కోరుకో అప్పటికే నెమలిని కార్తికేయుడు వాహనంగా తీసుకున్నారు.ఈ క్రమంలోనే లక్ష్మీదేవికి గుడ్లగూబ నూతన వాహనంగా ఎంపిక చేసుకున్నట్లు పురాణాలు చెబుతున్నాయి. అదే విధంగా మరొక కథనం ప్రకారం రైతులు ఎంతో కష్టపడి పంటలు పండించి ఆ పంట నాశనం కాకుండా ఉండడం కోసం లక్ష్మీదేవికి ప్రార్థిస్తారు. ఈ క్రమంలోనే ఆ పంటను నాశనం చేసే కీటకాలను తినడం కోసం లక్ష్మీదేవి గుడ్లగూబను వాహనంగా తీసుకుని పంటను రక్షించమని పంపుతుందని మరొక కథనం కూడా పురాణాలలో తెలియజేయడమైనది.