Ganapathi : గణపతి.. సకలకార్యాలు దిగ్విజయం కావడానికి ఆరాధించే తొలి దైవం గణనాయకుడు. ఆయన అనుగ్రహం ఉంటేనే ఏ పని అయినా పూర్తవుతుంది. దేవతలు సైతం ఆయనను ఆరాధించనిదే ఏ పని కూడా తలపెట్టరు. గణపతికి బహురూపాలు ఉన్నాయి. ముఖ్యంగా 32 రకాల గణపతుల ఆరాధన ఎక్కువగా చేస్తారు. ఆయా రకాల గణపతి రూపాలను ఆరాధించడం వల్ల కలిగే ఫలితాలు తెలుసుకుందాం.
హరిద్ర (పసుపు) గణపతిని పూజగదిలో పెట్టుకుని పూజిస్తే అన్ని విధాలా ధన, కనక, వస్తు,వాహనాలు వృద్ది చెందుతాయి. పసుపు గణపతి లేక హరిద్ర గణపతి పూజవలన దేహ కాంతి పెరుగుతుంది. సమస్త చర్మ రోగాలు నయం అవుతాయి. పసుపు గణపతి లేక హల్ దిగణపతి లేక హరిద్ర గణపతి పూజతోపాటు గౌరీ దేవీని పూజించటం ద్వారా ఇంట్లో వుండే వధువుకు లేక వరుడికు ఉన్న వివాహ దోషాలు తొలగిపోతాయి త్వరలో వివాహం నిశ్చయం అవుతుంది. హరిద్ర గణపతిని పూజిస్తే వారికి డబ్బు సమస్య రాదు. అప్పుల బాధ తొలగిపోతుంది. కామెర్లు ఉన్నవారి ఇంటి వారు హరిద్ర గణపతిని దానంగా ఇస్తే కామెర్ల రోగం తొలగిపోతుంది. దుకాణల్లో చాల రోజులుగా అమ్ముడు కాకుండా మిగిలివుండే వస్తువులఫై హరిద్ర గణపతిని తాకిస్తే వెంటనే వ్యాపారం అవుతుంది.
పగడపు గణపతిని పూజించటం వల్ల ఆరోగ్య రక్ష కలుగుతుంది. నరుల దిష్టి వంటి హాని కలగకుండా ఇది కాపాడుతుంది. ఇంటిలోగాని, వ్యాపారసంస్ధలలో గాని తూర్పు దిక్కు దోషాలు ఉన్నవారు, ప్రభుత్వ ఉద్యోగంలో ఇబ్బందులు ఉన్నవారు, నేత్రసమస్యలు ఉన్నవారు, తరచుగా ఆరోగ్య సమస్యలు ఉన్నవారు ముఖ్యంగా రుణ విముక్తి కోసం పగడపు గణపతిని పూజించాలి. మరకత గణపతిని పూజించడం ద్వారా తెలివితేటలు పెరుగుతాయి, జ్ఞాపకశక్తి పెరుగును. వ్యాపారం శ్రీఘ్రంగా అభివృద్ది పథంలో నడుస్తుంది. గుండె జబ్బులు, ప్రసరణ వ్యవస్థలో లోపాలు, ఆపరేషన్ తర్వాత త్వరగా కొలుకోవడం సరిచేస్తుంది. శరీరంలో ప్రాణ శక్తిని పెంపొందిస్తుంది. కంటి చూపుని సరిగా ఉంచుతుంది. డబ్బు దుబారని తగ్గిస్తుంది.
ఉద్యోగంలో ఉన్నతి, సంఘంలో గౌరవం కోసం చందన గణపతిని పూజించాలి. భార్యాపుత్రులతో సుఖజీవనం, వృత్తి ఉద్యోగాలలో తగాదాలు లేకుండా ఉండడానికి స్పటిక గణపతిని పూజించాలి. వెండి గణపతిని పూజించినా ఇదే ఫలితం వస్తుంది. అధిక శ్రమ నుంచి విముక్తి, శ్రమకు తగిన ఫలితం దక్కడానికి నల్లరాయితో చేసిన గణపతిని పూజించాలి. అంతేకాకుండా వీధి శూలాల నివారణకి కూడా నల్ల రాతి వినాయక విగ్రహలనే వాడడం మంచిది. శ్వేతార్కం లేదా తెల్ల జిల్లేడు మొక్క ఇంట్లో ఉంటే ఇక వారికి దారిద్య్ర బాధలు ఉండవు. శ్వేతార్క మూలానికి వశీకరణశక్తి ఉంటుంది. నరుల దిష్టి వంటి హాని కలగకుండా ఇది కాపాడుతుంది. ఇంటిలోగాని, వ్యాపారసంస్ధలలో గాని తూర్పు దిక్కు దోషాలు ఉన్నవారు, ప్రభుత్వ ఉద్యోగంలో ఇబ్బందులు ఉన్నవారు, నేత్రసమస్యలు ఉన్నవారు, తరచుగా ఆరోగ్య సమస్యలు ఉన్నవారు శ్వేతార్క గణపతిని పూజించటం గాని, శ్వేతార్క వేరుని తాయిత్తులలో ధరించటంగాని చేస్తే శుభప్రదం.
అస్సాం రైఫిల్స్ వారు పలు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు గాను ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల…
బ్యాంకుల్లో ఉన్నత స్థానాల్లో ఉద్యోగం చేయాలని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బరోడా గొప్ప అవకాశాన్ని కల్పిస్తోంది. ఆ…
బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిరపడాలని అనుకుంటున్న వారి కోసం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…
పబ్లిక్ సెక్టార్‌కు చెందిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి గాను ఆసక్తి,…
దేశంలోని ప్రముఖ పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి పలు…
రైల్వేలో ఉద్యోగం చేయాలనుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు శుభవార్త చెప్పింది. పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…
ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో పనిచేయాలని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవకాశం అని చెప్పవచ్చు. ఇండియన్ ఎయిర్…
పోస్టల్ శాఖలో ఉద్యోగం చేయాలని అనుకుంటున్నారా..? అయితే ఈ సదకాశం మీకోసమే. తపాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…