సాధారణంగా మనం రోజూ అనేక రకాల పనులను చేస్తుంటాం. కొన్ని పనులను మనం తెలిసే చేస్తాం. కొన్ని పనులను చేయడం వల్ల అదృష్టం కలసి వస్తుంది. అయితే కొన్ని పనులను మాత్రం తెలియకుండానే చేస్తుంటాం. దీంతో అశుభం కలుగుతుంది. ఫలితంగా అన్నీ సమస్యలే వస్తుంటాయి. ఎవరైనా సరే డబ్బు సంపాదించాలని.. సుఖంగా జీవించాలని.. ఆ డబ్బు ఎక్కువ కాలం ఉండాలని.. సంతోషంగా జీవితం గడపాలని కోరుకుంటారు. కానీ అనేక రకాల సమస్యలు మనల్ని చుట్టు ముడుతుంటాయి. అయితే కొన్ని రకాల పనులను మనం రోజూ చేస్తూనే ఉంటాం. కానీ వాటిని చేస్తే అశుభం జరుగుతుందని.. అన్నీ సమస్యలే వస్తాయని పండితులు చెబుతున్నారు.
ఇక కొన్ని రకాల పనులను మనం రోజు మొత్తం మీద చేసినా.. సాయంత్రం సంధ్యా సమయంలో మాత్రం కొన్ని పనులను ఎట్టి పరిస్థితిలోనూ చేయరాదు. చేస్తే అరిష్టం కలుగుతుంది. అన్ని విధాలుగా సమస్యలే వస్తాయి. ముఖ్యంగా ఆర్థికంగా ఇబ్బందులు ఎదురవుతాయి. ఇక సూర్యాస్తమయం సమయంలో చేయకూడని ఆ పనులు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం.
సూర్యాస్తమయం సమయంలో కొన్ని రకాల పనులను మనం ఎట్టి పరిస్థితిలోనూ చేయరాదు. అవేమిటంటే.. తులసి ఆకులను సాయంత్రం సమయంలో అసలు కోయరాదు. అంతేకాదు.. ఆ మొక్కను కూడా తాకరాదు. అలా చేస్తే లక్ష్మీదేవికి కోపం వస్తుందట. దీంతో డబ్బు చేతిలో నిలవదు. ఆర్థిక సమస్యలు వస్తాయి. అలాగే సాయంత్రం సమయంలో చీపురును వాడరాదు. సాయంత్రం కన్నా ముందే చీపురును ఉపయోగించాలి. సూర్యాస్తమయం సమయంలో చీపురును ఉపయోగిస్తే ఇంట్లో లక్ష్మీదేవి ఉండదని చెబుతున్నారు.
ఇక సాయంత్రం సమయంలో ఇతరులు ఎవరికీ కూడా పాలు, పెరుగు, చక్కెర వంటి తెల్లని పదార్థాలను ఇవ్వకూడదు. అలాగే సాయంత్రం సమయంలో చెత్తను బయట వేయరాదు. ఎవరికీ అప్పులు ఇవ్వరాదు. ఇస్తే వెనక్కి రావు. అలాగే సాయంత్రం సమయంలో గోర్లను, శిరోజాలను కట్ చేయరాదు. ఇలా కొన్ని పనులను మనం సూర్యుడు అస్తమించే సమయంలో చేయకూడదు. చేస్తే అన్నీ సమస్యలే వస్తాయన్న విషయాన్ని గుర్తుంచుకోవాలి.
అస్సాం రైఫిల్స్ వారు పలు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు గాను ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల…
బ్యాంకుల్లో ఉన్నత స్థానాల్లో ఉద్యోగం చేయాలని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బరోడా గొప్ప అవకాశాన్ని కల్పిస్తోంది. ఆ…
బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిరపడాలని అనుకుంటున్న వారి కోసం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…
పబ్లిక్ సెక్టార్‌కు చెందిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి గాను ఆసక్తి,…
దేశంలోని ప్రముఖ పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి పలు…
రైల్వేలో ఉద్యోగం చేయాలనుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు శుభవార్త చెప్పింది. పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…
ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో పనిచేయాలని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవకాశం అని చెప్పవచ్చు. ఇండియన్ ఎయిర్…
పోస్టల్ శాఖలో ఉద్యోగం చేయాలని అనుకుంటున్నారా..? అయితే ఈ సదకాశం మీకోసమే. తపాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…