ప్రపంచ వ్యాప్తంగా హిందువులు జరుపుకొనే ఎన్నో ముఖ్యమైన పండుగలలో వినాయక చవితి ఒకటి. ఈ వినాయక చవితి రోజు వినాయకుడికి ప్రత్యేక పూజలు చేసి స్వామివారి కృపకు పాత్రులవుతారు. ఈ విధంగా వినాయక చవితి రోజు స్వామివారిని పూజించడం వల్ల మనకు కలిగే విఘ్నాలు తొలగిపోయి అన్నీ శుభాలు కలుగుతాయని భక్తులు భావిస్తారు. ఈ క్రమంలోనే స్వామివారి కరుణాకటాక్షాల కోసం వినాయక చవితి రోజు పెద్ద ఎత్తున స్వామి వారికి ఉపవాస దీక్షలతో పూజా కార్యక్రమాలను నిర్వహిస్తారు.
వినాయక చవితి రోజు ముఖ్యంగా నైవేద్యాల గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. వినాయకుడి పూజలో నైవేద్యాలను సమర్పించడం వల్ల స్వామివారు ఎంతో ప్రీతి చెందుతారు. ముఖ్యంగా స్వామివారి నైవేద్యంలో తప్పనిసరిగా బెల్లంతో చేసిన పిండివంటలు ఉండాలి. ఈ క్రమంలోనే చాలామంది బెల్లంతో చేసిన పూర్ణాలు, కుడుములను తప్పనిసరిగా తయారు చేసి నైవేద్యంగా సమర్పిస్తారు.
కుడుములు, పూర్ణాలే కాకుండా స్వామివారికి శనగ పిండి బూందీ లడ్డూలనూ, పంచామృతం, బొబ్బట్లు, కేసరి, పులిహోర వంటి ఆహార పదార్థాలను స్వామివారికి నైవేద్యంగా సమర్పిస్తారు. ఈ విధమైన నైవేద్యాలను సమర్పించి పూజ చేయటం వల్ల గణపయ్య ఆశీస్సులు ఎల్లవేళలా మనపై ఉంటాయి. అయితే తప్పనిసరిగా నైవేద్యాలను సమర్పించాలనే నియమం కూడా లేదు. ఎంతోమంది ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతుంటారు. భక్తి శ్రద్ధలతో కేవలం ఒక బెల్లపు ముక్కను స్వామివారికి నైవేద్యంగా సమర్పించి పూజించడం వల్ల స్వామివారి కరుణా కటాక్షాలు ఎల్లవేళలా తన భక్తులపై ఉంటాయని పండితులు చెబుతున్నారు.
అస్సాం రైఫిల్స్ వారు పలు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు గాను ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల…
బ్యాంకుల్లో ఉన్నత స్థానాల్లో ఉద్యోగం చేయాలని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బరోడా గొప్ప అవకాశాన్ని కల్పిస్తోంది. ఆ…
బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిరపడాలని అనుకుంటున్న వారి కోసం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…
పబ్లిక్ సెక్టార్‌కు చెందిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి గాను ఆసక్తి,…
దేశంలోని ప్రముఖ పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి పలు…
రైల్వేలో ఉద్యోగం చేయాలనుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు శుభవార్త చెప్పింది. పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…
ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో పనిచేయాలని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవకాశం అని చెప్పవచ్చు. ఇండియన్ ఎయిర్…
పోస్టల్ శాఖలో ఉద్యోగం చేయాలని అనుకుంటున్నారా..? అయితే ఈ సదకాశం మీకోసమే. తపాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…