Mantram : ఇదివరకు రోజుల్లో కేవలం మంత్రాలు వంటి వాటిని చదువుకునేవారు. కానీ ఇప్పుడు టెక్నాలజీ బాగా పెరిగింది. టెక్నాలజీ పెరగడంతో స్మార్ట్ ఫోన్ కి బాగా ప్రతి ఒక్కరు అలవాటు పడిపోయారు. పైగా రింగ్ టోన్స్ కింద మంత్రాలని కూడా పెట్టుకుంటున్నారు. మంత్రం మన మనసు పొరల్లో ఉండే పలు రకాల ఆలోచనల్ని దూరం చేస్తుంది. మహాశక్తివంతమైన మంత్రాలని మన ఋషులు అమోఘ తపశక్తితో భగవద్ ఆవేశంలో పలికిన వాక్యాలే మంత్రాలు. ఎన్నో శక్తివంతమైన మంత్రాలు ఉన్నాయి.
ఇష్టదేవతలని ప్రసన్నం చేసుకోవడమే మంత్ర లక్ష్యం. అయితే పవిత్రమైన మంత్రాలని సెల్ఫోన్ రింగ్ టోన్స్ కింద పెట్టుకోవచ్చా..? పెట్టుకుంటే ఏం జరుగుతుంది అనేది తెలుసుకుందాం. మంత్రం అనేది ఒక శాసనం. పరమాత్మ సాక్షాత్కారానికి ఆయుధం. ఏ మంత్రం అయినా సరే గురు ఉపదేశం లేనిదే ఫలించదు. మంత్రాలని పురాణాల్లో చెప్పిన విధంగా పాటించాలి.
మంత్రాలని రింగ్ టోన్స్ కింద పెట్టుకోవడం మంచిది కాదు. మహా పాపం. మంత్ర ఉచ్చారణకి కఠోరమైన నియమాలు ఉన్నాయి. ఈ రోజుల్లో చాలామంది రింగ్ టోన్స్ కింద గాయత్రి మంత్రం, మృత్యుంజయ మంత్రం వంటివి పెట్టుకుంటున్నారు. ఇలాంటి చర్యల వల్ల మన ఫలితం పొందడం మాట ఎలా ఉన్నా, మనల్ని అవి పతనం వైపుకు తీసుకెళ్తాయి. మంత్రాలు ఎప్పుడూ పాటలు కాదు. మననం చేయాల్సినది మంత్రం.
మూల మంత్రాలని గురూపదేశం ద్వారా పొందినా మనసులో చేయాలి. మంత్రాలు ఏమీ భజనలు పాటలు కావు. అయితే అలా రింగ్ టోన్స్ కింద పెట్టుకోవాలనుకునే వాళ్ళు అన్నమాచార్య కీర్తనలు, త్యాగరాజ కీర్తనలు వంటివి పెట్టుకోవచ్చు. వాటిని హాయిగా పాడుకోవచ్చు.
కానీ మంత్రాలని అలా పెట్టుకోకూడదు. రింగ్ టోన్స్ కింద పెట్టుకోవడానికి చాలానే ఉన్నాయి. మనం మంత్రాలనే పెట్టుకోవాల్సిన పనిలేదు. మంత్ర ఉపదేశం ఉన్నవారు మాత్రమే ప్రణవంతో చెయ్యాలి. ఉపదేశం లేని వాళ్ళు ప్రణవ సంహితంగా చేయరాదని శాస్త్రాలు అంటున్నాయి.
మన శరీరంలో ఊపిరితిత్తులు ఎంత ముఖ్యమైనవో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఊపిరితిత్తులు దెబ్బతింటే శ్వాస తీసుకోవడం చాలా కష్టమవడంతోపాటు అతి తక్కువ…
ఇటీవలి కాలంలో వీధికుక్కల బెడద మరింత ఎక్కువైంది. పిల్లల నుంచి పెద్దల వరకు అందరూ రోడ్డుపై స్వేచ్ఛగా తిరిగేందుకు చాలా…
సాహో చిత్రంలో ప్రభాస్ సరసన కథానాయికగా నటించి అలరించిన శ్రద్ధా కపూర్ రీసెంట్గా స్త్రీ2 అనే మూవీతో పలకరించింది. 2018లో…
ప్రముఖ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ పెద్ద చిక్కుల్లో పడ్డాడు. జానీ మాస్టర్ తనను లైంగికంగా వేధించాడని రాయదుర్గం పోలీసులకు మహిళా…
ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాన్ ఇటు రాజకీయాలు, అటు సినిమాలు రెండింటిని బ్యాలెన్స్ చేస్తూ ముందుకు సాగుతున్నారు. అయితే…
హారర్ సినిమా ప్రేమికుల్లో 'డీమాంటీ కాలనీ' సినిమాకు సపరేట్ ఫ్యాన్ బేస్ ఉన్న విషయం తెలిసిందే. తమిళ సినిమాయే అయినప్పటికీ...…
ఒక్కోసారి ఎవరిని ఎప్పుడు అదృష్టం ఎలా వరిస్తుందో తెలియదు. ఊహించని విధంగా లక్షాధికారి అవుతుంటారు. తుగ్గలి మండలం సూర్యతాండాలో రైతుకూలీకి…
ఈ రోజుల్లో బంధాలు ఎక్కువ కాలం కొనసాగడం లేదు. లక్షలు ఖర్చు పెట్టి ఎంతో అట్టహాసంగా పెళ్లి చేసుకుంటుండగా,ఆ పెళ్లి…