ప్రస్తుత తరుణంలో చాలా మంది చిన్న చిన్న విషయాలకే మనస్థాపం చెందిన బలవంతంగా ప్రాణాలు తీసుకుంటున్నారు. కుటుంబ సభ్యులు తమపై ఆధారపడి ఉన్నారన్న విషయాన్ని కూడా గుర్తించకుండా క్షణికావేశంలో నిర్ణయాలను తీసుకుంటున్నారు. ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. దీంతో ఇంట్లోని వారికి కడుపుకోత మిగులుస్తున్నారు. తాజాగా ఇలాంటిదే ఓ సంఘటన చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే..
హైదరాబాద్‌లోని గోల్నాక అనే ప్రాంతంలో ఉన్న తిరుమలనగర్‌లో నివాసం ఉంటున్న శ్రీనివాసులు ఇంట్లోనే టైలరింగ్ పని చేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. అతని భార్య విజయలక్ష్మి. వీరికి ఇద్దరు పిల్లలు ఉన్నారు. అయితే టైలరింగ్ పని చేయడమే కాకుండా శ్రీనివాసులు కాలనీల్లో తిరుగుతూ చీరలను విక్రయిస్తుంటాడు.
ఈ క్రమంలోనే అతను ఇటీవల తన భార్యకు ప్రేమతో ఓ జాకెట్ కుట్టాడు. కానీ అది నచ్చలేదని విజయలక్ష్మి చెప్పింది. ఈ క్రమంలో దంపతులు ఇద్దరి మధ్య తీవ్రమైన గొడవ జరిగింది. దీనికి మనస్థాపం చెందిన విజయలక్ష్మి ఇంట్లో ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. అలా ఆమె క్షణికావేశంలో తీసుకున్న నిర్ణయం తన పిల్లలకు తల్లి లేకుండా చేసింది.
అస్సాం రైఫిల్స్ వారు పలు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు గాను ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల…
బ్యాంకుల్లో ఉన్నత స్థానాల్లో ఉద్యోగం చేయాలని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బరోడా గొప్ప అవకాశాన్ని కల్పిస్తోంది. ఆ…
బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిరపడాలని అనుకుంటున్న వారి కోసం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…
పబ్లిక్ సెక్టార్కు చెందిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి గాను ఆసక్తి,…
దేశంలోని ప్రముఖ పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి పలు…
రైల్వేలో ఉద్యోగం చేయాలనుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు శుభవార్త చెప్పింది. పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…
ఇండియన్ ఎయిర్ ఫోర్స్లో పనిచేయాలని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవకాశం అని చెప్పవచ్చు. ఇండియన్ ఎయిర్…
పోస్టల్ శాఖలో ఉద్యోగం చేయాలని అనుకుంటున్నారా..? అయితే ఈ సదకాశం మీకోసమే. తపాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…