సాధారణంగా మనం భోజనం చేసేటప్పుడు కూరలో ఉప్పు, కారం తక్కువైందని చెప్పడం సర్వసాధారణమే. అయితే ఈ విధంగా చెప్పినప్పుడు ఉప్పు తక్కువైతే మరికొంత వేయడం లేదా ఎక్కువ ఉంటే అందుకు తగిన పరిష్కారాన్ని ఆలోచిస్తాం. మరికొందరు ఒక్కరోజుతో పోయేదే కదా, ఎప్పుడూ ఇలా జరగదు కదా.. అంటూ సరి పెట్టుకుని తింటుంటారు. అయితే కూరలో ఉప్పు తక్కువైందన్న పాపానికి హర్యానాలో భార్య ఏకంగా భర్త తల పగలగొట్టింది. వివరాల్లోకి వెళితే..
హర్యానాలోని హింసార్ జిల్లాలో బార్వాలా పట్టణంలో దినేష్, బిందియా దంపతులు నివసిస్తున్నారు. ఈ క్రమంలోనే ప్రతి రోజులాగే బిందియా తన భర్త కోసం వంట చేసి పెట్టింది. భోజనం చేసేటప్పుడు భర్త దినేష్ కూరలు సరిగాలేవని, కూరలో ఉప్పు తక్కువైందని చెప్పాడు. తన భర్త తను చేసిన వంటలు నచ్చలేదని చెప్పడం, వాటిల్లో ఉప్పు తగ్గిందని చెప్పడంతో.. వారిద్దరి మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది.
ఈ విధంగా వారిద్దరి మధ్య మాటల యుద్ధం పెరగడంతో ఇద్దరూ తారాస్థాయిలో గొడవ పడ్డారు. ఈ క్రమంలోనే బిందియా ఎంతో ఆగ్రహానికి గురై ఇనుప రాడ్ తీసుకొని ఒక్కసారిగా తన భర్త దినేష్ తలపై కొట్టింది. ఈ విషయం గమనించిన పొరుగింటి వ్యక్తి వెంటనే దినేష్ ను చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తీసుకు వెళ్ళాడు. అనంతరం ఈ ఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసుకున్నారు. తన భార్యతో తనకు ఇలాంటి గొడవలు మామూలేనని, గతంలో ఇలాంటి ఘటనలు చాలా చోటుచేసుకున్నాయని ఈ సందర్భంగా దినేష్ తెలియజేశాడు.
అస్సాం రైఫిల్స్ వారు పలు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు గాను ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల…
బ్యాంకుల్లో ఉన్నత స్థానాల్లో ఉద్యోగం చేయాలని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బరోడా గొప్ప అవకాశాన్ని కల్పిస్తోంది. ఆ…
బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిరపడాలని అనుకుంటున్న వారి కోసం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…
పబ్లిక్ సెక్టార్‌కు చెందిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి గాను ఆసక్తి,…
దేశంలోని ప్రముఖ పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి పలు…
రైల్వేలో ఉద్యోగం చేయాలనుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు శుభవార్త చెప్పింది. పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…
ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో పనిచేయాలని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవకాశం అని చెప్పవచ్చు. ఇండియన్ ఎయిర్…
పోస్టల్ శాఖలో ఉద్యోగం చేయాలని అనుకుంటున్నారా..? అయితే ఈ సదకాశం మీకోసమే. తపాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…