ఒక మనిషికి మృత్యువు ఏ వైపు నుంచి ఏ రూపంలో వస్తుందో ఎవరూ ఊహించలేరు. బయటకు వెళ్ళిన మనిషి క్షేమంగా తిరిగి ఇంటికి వస్తాడని నమ్మకం లేకుండాపోతోంది. మృత్యువుకు, వయస్సతో సంబంధం లేకుండా అందరినీ వెంటాడుతూనే ఉంటుంది. ఈ క్రమంలోనే గత నెలరోజుల క్రితం తల్లి పోయిందన్న బాధలో కుటుంబమంతా తీవ్ర విషాదంలోకి వెళ్ళిపోయింది. ఇప్పుడిప్పుడే ఆ బాధ నుంచి ఆ కుటుంబం తేరుకుంటోంది. అయితే ఆ కుటుంబంలోని ఓ యువకుడు డ్యూటీకి వెళ్తున్న క్రమంలో యాక్సిడెంట్ కు గురయ్యాడు. తీవ్ర గాయాల పాలై దుర్మరణం చెందాడు. ఈ ఘటన రంగారెడ్డి జిల్లాలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు..
కందుకూరు మండలం రాచులూరు గ్రామానికి చెందిన తిరుగమళ్ల శ్రీనాథ్ అనే యువకుడు అమెజాన్ కంపెనీలో సెక్యూరిటీ గార్డుగా పని చేస్తున్నాడు. ఈ క్రమంలోనే ఆదివారం డ్యూటీ నిమిత్తం ద్విచక్ర వాహనంపై వెళ్తుండగా తనకి మృత్యువు టిప్పర్ రూపంలో దూసుకు వచ్చింది. ద్విచక్ర వాహనంపై వెళ్తున్న శ్రీనాథ్ టిప్పర్ రావడం గమనించి దానిని తప్పించపోయాడు. అయితే ఆ టిప్పర్ వేగంగా అతనిపై నుంచి వెళ్లడంతో శ్రీనాథ్ చక్రాల కింద పడి అక్కడికక్కడే మృతిచెందాడు.
ఈ విషయం తెలిసిన తన తండ్రి, చెల్లి సంఘటన స్థలానికి చేరుకొని భోరున విలపించారు. మమ్మల్నిద్దర్నీ వదిలి అమ్మ దగ్గరికి వెళ్లి పోయావా అన్నయ్యా.. అంటూ ఆ చెల్లెలి రోదన పలువురికి కంటతడి పెట్టించింది. ఈ విషయం తెలిసిన అతని బంధువులు, స్నేహితులు రోడ్డుపై బైఠాయించి తనకు న్యాయం చేయాలని, కేవలం డ్రైవర్ నిర్లక్ష్యం కారణంగానే నిండు ప్రాణం పోయిందని పెద్ద ఎత్తున ఆందోళన చేశారు. ఈ క్రమంలోనే పోలీసులు కేసు నమోదు చేసుకుని పరారీలో ఉన్న డ్రైవర్ కోసం గాలింపు చర్యలు చేపట్టారు.
అస్సాం రైఫిల్స్ వారు పలు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు గాను ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల…
బ్యాంకుల్లో ఉన్నత స్థానాల్లో ఉద్యోగం చేయాలని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బరోడా గొప్ప అవకాశాన్ని కల్పిస్తోంది. ఆ…
బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిరపడాలని అనుకుంటున్న వారి కోసం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…
పబ్లిక్ సెక్టార్‌కు చెందిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి గాను ఆసక్తి,…
దేశంలోని ప్రముఖ పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి పలు…
రైల్వేలో ఉద్యోగం చేయాలనుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు శుభవార్త చెప్పింది. పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…
ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో పనిచేయాలని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవకాశం అని చెప్పవచ్చు. ఇండియన్ ఎయిర్…
పోస్టల్ శాఖలో ఉద్యోగం చేయాలని అనుకుంటున్నారా..? అయితే ఈ సదకాశం మీకోసమే. తపాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…