సాధారణంగా దొంగతనం చేసే వారు రాత్రిపూట జన సంచారం లేని ప్రదేశాలలో దొంగతనాలు చేస్తుంటారు. ఈ విధంగా రాత్రిపూట దొంగతనాలు చేసిన ఎంతోమంది దొంగలను పోలీసులు గుర్తించారు. కానీ ఈ దొంగ మాత్రం పట్టపగలు దొంగతనాలు చేస్తూ పోలీసులకు దొరకకుండా ఉండడమే ఇతని ప్రత్యేకత. అందరూ దొంగలు రాత్రిపూట దొంగతనం చేస్తే ఇతను మాత్రం పట్టపగలు దొంగతనాలు చేస్తుంటాడు.గత ఏడు సంవత్సరాలుగా ఆంధ్ర, తమిళనాడు పోలీసుల కళ్లుగప్పి తిరుగుతున్న ఈ దొంగను ఎట్టకేలకు పోలీసులు అరెస్టు చేశారు. పోలీసులు తెలిపిన కథనం మేరకు…
తమిళనాడు రాష్ట్రం తిరప్పత్తూరు జిల్లా కరంభూరు గ్రామానికి చెందిన గోవిందరాజన్ కుమారుడు శక్తివేల్(33) అక్కడ టాక్సీ డ్రైవర్‌గా పని చేస్తున్నారు. ఎవ్వరికీ ఏమాత్రం అనుమానం రాకుండా దొంగతనాలు చేయటం ఇతని ప్రత్యేకత. ఎక్కువ జనాభా లేని గ్రామాలను ఎంపిక చేసుకొని ఉదయం అందరూ పొలం పనులకు వెళ్లగానే ఇతను కారులో వెళ్లి ఆ ఇంటి తలుపు పై లేదా చుట్టుపక్కల తాళాన్ని వెతికి సులభంగా ఇంట్లోకి ప్రవేశించి ఇంట్లో ఉన్న బంగారు నగలను దొంగతనం చేస్తుంటాడు.
ఏడు సంవత్సరాల నుంచి దొంగతనం చేస్తున్న ఇతని పై ఇప్పటి వరకు రెండు రాష్ట్రాలలో కేవలం 15 కేసులు మాత్రమే నమోదయ్యాయి.పోలీసులకు అందిన ఫిర్యాదు మేరకు ఈ దొంగ దాదాపు 250 గ్రాముల బంగారాన్ని దొంగిలించినట్లు తెలిపారు. ఈ విధంగా ఉదయం పూట మాత్రమే జరుగుతున్న దొంగతనాలు పై నిఘా పెట్టిన ఐడీ పార్టీ ఈ చోరీలకు పాల్పడుతున్నది శక్తివేల్‌గా గుర్తించి, చివరికి బైరెడ్డిపల్లి వద్ద అతనిని అదుపులోకి తీసుకున్నారు.
అస్సాం రైఫిల్స్ వారు పలు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు గాను ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల…
బ్యాంకుల్లో ఉన్నత స్థానాల్లో ఉద్యోగం చేయాలని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బరోడా గొప్ప అవకాశాన్ని కల్పిస్తోంది. ఆ…
బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిరపడాలని అనుకుంటున్న వారి కోసం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…
పబ్లిక్ సెక్టార్‌కు చెందిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి గాను ఆసక్తి,…
దేశంలోని ప్రముఖ పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి పలు…
రైల్వేలో ఉద్యోగం చేయాలనుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు శుభవార్త చెప్పింది. పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…
ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో పనిచేయాలని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవకాశం అని చెప్పవచ్చు. ఇండియన్ ఎయిర్…
పోస్టల్ శాఖలో ఉద్యోగం చేయాలని అనుకుంటున్నారా..? అయితే ఈ సదకాశం మీకోసమే. తపాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…