పేగు తెంచుకుని పుట్టిన బిడ్డను కళ్లల్లో పెట్టి కాపాడుకోవాల్సిన ఓ తల్లి తనకి అనారోగ్యం చేసిందని తన పాలిట కసాయి తల్లిగా మారిపోయింది. ఆడబిడ్డ పుట్టడమే ఇష్టంలేని ఆ తల్లి చివరకు ఆ బిడ్డకు అనారోగ్యం చేయటంతో విసుగుచెంది తన బిడ్డను నీటి తొట్టిలోకి వేసి చంపిన ఘటన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన కథనం మేరకు..
ఆంధ్రప్రదేశ్ కృష్ణాజిల్లా బాపులపాడు మండలం రేమల్లి గ్రామానికి చెందిన కలపాల హరికృష్ణకు ఆరేళ్ల కిందట చాట్రాయి మండలానికి చెందిన సీతామహాలక్ష్మితో వివాహం జరిగింది. వీరిద్దరు వ్యవసాయ పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. వీరి పెళ్లి జరిగి ఆరు సంవత్సరాలు కావస్తున్నా వీరికి సంతానం కలగకపోవడంతో సంతానం కోసం ఎన్నో ఆసుపత్రుల చుట్టూ తిరిగారు. అయితే సీతా మహాలక్ష్మి గర్భం దాల్చడంతో ఆ కుటుంబంలో ఆనందం వెల్లివిరిసింది.
ఈ క్రమంలోనే సీతామహాలక్ష్మి జూలై 30వ తేదీన పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చింది. తల్లి బిడ్డ ఇద్దరు ఆరోగ్యంగా ఉన్నారని వైద్య సిబ్బంది వారిద్దరిని డిశ్చార్జ్ చేశారు.ఇంటికి వెళ్ళిన కొద్దిరోజులకు పాప అనారోగ్యానికి గురికావడంతో పాప చికిత్స నిమిత్తం ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. గొంతులో కొద్దిగా ఇన్ఫెక్షన్ ఉందని వైద్యులు సూచించడంతో మూడు రోజుల పాటు ఆస్పత్రిలో ఉండాలని వైద్యులు చెప్పారు. ఈ క్రమంలోనే కూతురు పుట్టడం నచ్చని సీతామహాలక్ష్మి తనకి ప్రస్తుతం అనారోగ్యం చేయడంతో జీర్ణించు కోలేక కూతురి పట్ల విసుగు చెంది ఆస్పత్రి ఆవరణలో ఒక నీటి తొట్టిలో పడేసింది.
తన బిడ్డ కనిపించడం లేదని హరికృష్ణ ఆస్పత్రి వర్గాలకు తెలియజేయడంతో అందరూ పాప ఆచూకీ కోసం వెతక సాగారు.ఈ క్రమంలోనే పాప నీటి తొట్టిలో విగతజీవిగా పడి ఉండడం చూసి సీతా మహాలక్ష్మి విచారించగా అసలు విషయం బయటపడింది.ఆరు సంవత్సరాల తర్వాత సంతానం కలిగిందని ఆ తండ్రి ఆనందంలో ఉండగా ఆ తల్లి ఏమాత్రం జాలి దయ లేకుండా కన్నబిడ్డను కర్కశంగా చంపడంతో ఆమెపై పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు.
అస్సాం రైఫిల్స్ వారు పలు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు గాను ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల…
బ్యాంకుల్లో ఉన్నత స్థానాల్లో ఉద్యోగం చేయాలని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బరోడా గొప్ప అవకాశాన్ని కల్పిస్తోంది. ఆ…
బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిరపడాలని అనుకుంటున్న వారి కోసం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…
పబ్లిక్ సెక్టార్‌కు చెందిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి గాను ఆసక్తి,…
దేశంలోని ప్రముఖ పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి పలు…
రైల్వేలో ఉద్యోగం చేయాలనుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు శుభవార్త చెప్పింది. పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…
ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో పనిచేయాలని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవకాశం అని చెప్పవచ్చు. ఇండియన్ ఎయిర్…
పోస్టల్ శాఖలో ఉద్యోగం చేయాలని అనుకుంటున్నారా..? అయితే ఈ సదకాశం మీకోసమే. తపాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…