భారత దేశంలోని మహిళలకు బంగారానికి ఎంతో అవినాభావ సంబంధం ఉంది. బంగారం ఎంత ఉన్నా ఇంకా కొనాలనే ఆశ ప్రతి ఒక్కరిలో ఉంటుంది. ముఖ్యంగా బంగారం ఫ్రీగా వస్తుంది అంటే ఏ మహిళ వదులుకోదు. అచ్చం అదే రీతిలోనే ఎంతో సంపన్నురాలైన ఓ మహిళ బంగారు నగలు ఉచితంగా వస్తున్నాయంటే కక్కుర్తిపడి కోట్లలో మోసపోయింది. చివరికి తాను మోసపోయానని గ్రహించి సైబర్ పోలీసులను ఆదేశించింది. పూర్తి వివరాల్లోకి వెళితే..
పూణేలోని ఓ కంపెనీలో సీనియర్ ఎగ్జిక్యూటివ్‌గా పనిచేస్తున్న ఓ మహిళకు ఫేస్బుక్ ద్వారా ఫ్రెండ్ రిక్వెస్ట్ వచ్చింది. ఆమె ఆ రిక్వెస్ట్ యాక్సెప్ట్ చేయడంతో అవతలి వ్యక్తి ఆమెకు ఒక డాక్టర్ గా పరిచయమయ్యాడు. వీరిద్దరి మధ్య పరిచయం ఏర్పడి నంబర్లు మార్చుకొని అప్పుడప్పుడు చాటింగ్ చేసేవారు. ఈ క్రమంలోనే అవతల వ్యక్తి ఆమెకు బంగారు నగలను పంపిస్తున్నా అంటూ ఫోన్ చేసి చెప్పాడు.
సీనియర్ ఎగ్జిక్యూటివ్ గా పనిచేస్తున్న ఆమెకు కోట్లలో బ్యాంక్ బ్యాలెన్స్ ఉన్న ఉచితంగా వచ్చే నగలకు కక్కుర్తి పడింది. ఆ వ్యక్తి ఫోన్ చేసి ఢిల్లీ విమానాశ్రయానికి నగలు వచ్చాయని, వాటిని తీసుకోవడం కోసం కష్టమ్ చార్జీలు భరించాలని చెప్పాడు. ఈ క్రమంలోనే ఆమె అతని ఖాతాకు డబ్బులు పంపింది. మరికొందరు కస్టమ్స్ అధికారుల మంటూ టాక్స్ కడితేనే ఆ నగలు ఇస్తామని ఫోన్లు చేయడంతో వారికి కూడా డబ్బులు చెల్లించింది.
ఈ క్రమంలోనే కొందరు సైబర్ నేరగాళ్లు అధికారుల మంటూ తరచూ ఆమెకు ఫోన్ చేస్తూ డబ్బులు చెల్లించాలని డిమాండ్ చేసేవారు. మీకు ఇంత విలువైన నగలు ఎక్కడినుంచి వచ్చాయి,డబ్బులు పంపించకపోతే మీ పై కేసు నమోదు చేసి అరెస్ట్ చేస్తామంటూ బెదిరించారు. ఈ క్రమంలోనే ఆ మహిళ మొత్తం 67 ఖాతాల్లో సుమారు 3.9 కోట్లు జమ చేసింది. 25 బ్యాంకులకు చెందిన ఖాతాలకు 207 ట్రాన్సాక్షన్స్ చేసింది. అయినా ఫోన్ వేధింపులు తగ్గక పోవడంతో ఆమె పోలీసులను ఆశ్రయించి అసలు విషయం బయట పెట్టింది
అస్సాం రైఫిల్స్ వారు పలు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు గాను ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల…
బ్యాంకుల్లో ఉన్నత స్థానాల్లో ఉద్యోగం చేయాలని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బరోడా గొప్ప అవకాశాన్ని కల్పిస్తోంది. ఆ…
బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిరపడాలని అనుకుంటున్న వారి కోసం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…
పబ్లిక్ సెక్టార్‌కు చెందిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి గాను ఆసక్తి,…
దేశంలోని ప్రముఖ పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి పలు…
రైల్వేలో ఉద్యోగం చేయాలనుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు శుభవార్త చెప్పింది. పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…
ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో పనిచేయాలని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవకాశం అని చెప్పవచ్చు. ఇండియన్ ఎయిర్…
పోస్టల్ శాఖలో ఉద్యోగం చేయాలని అనుకుంటున్నారా..? అయితే ఈ సదకాశం మీకోసమే. తపాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…