క్రైమ్‌

దారుణం: ఏడు రోజులకే ముగిసిన ఏడడుగుల బంధం!

జీవితంలో ఎన్నో కలలు కని ఆ కలలను నిజం చేసుకోవడానికి అత్తవారింట అడుగుపెట్టిన నవవధువు తన కాళ్ల పారాణి ఆరకముందే కాటికి కాలు చాపింది. పెళ్లి జరిగి 7 రోజులు కూడా జరగకుండానే ఆ వధువు ఏడడుగుల బంధానికి స్వస్తి పలికింది.ఇంటి ముందు పందిరి కూడా తీయకుండానే నవవధువు పరలోకానికి వెళ్లిపోవడంతో ఇరు కుటుంబాలు గుండెలవిసేలా చేసిన రోదనలు ఇతరులకు కన్నీరును తెప్పించాయి. పూర్తి వివరాల్లోకి వెళితే.

సామర్లకోట మండలం మేడపాడుకు చెందిన తొండారపు వీరవెంకటలక్ష్మి పెద్ద కుమార్తె అశ్వినీ స్వాతి అనే యువతికి కోరుకొండ మండలం గాదరాడకు చెందిన కనుమురెడ్డి అశోక్‌తో గత నెల 29న వివాహం చేశారు. రెండు రోజుల కిందటే వధూవరులిద్దరూ వరుడి స్వగ్రామానికి వచ్చారు. అయితే ఆషాడమాసం వస్తున్న కారణంగా నవ వధువును పుట్టింటికి తీసుకెళ్లాలని, సోమవారం మంచి రోజు కావడంతో ఆమెను పుట్టింటికి పంపడానికి ప్రయాణం చేస్తున్నారు.

ఈ క్రమంలోనే అందరూ ఇంట్లో ఉండగానే స్వాతి లోపలికి వెళ్లి ఫ్యాన్ కు ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. స్వాతికి అశోక్ వరుసకు మేనమామ అవుతాడు. అశోక్ తాపీ పని చేసేవాడు.ఈ క్రమంలోనే కొత్త ఇంటిని కట్టించి వివాహం చేసుకొని ఎన్నో ఆశలతో జీవితంలోకి అడుగుపెట్టిన అశోక్ అశ్విని మృతదేహం చూసి కుప్పకూలిపోయాడు. అయితే ఇరు కుటుంబాలు బంధువులు కావడంతో ఆమె మృతి చెందిన విషయం పోలీసులకు ఫిర్యాదు చేయకుండా మిగతా కార్యక్రమాలను చేపట్టారు. ఈ క్రమంలోనే ఓ వ్యక్తి పోలీసులకు ఫిర్యాదు చేయడంతో సంఘటన స్థలానికి పోలీసులు రావడంతో అశ్వినీ తల్లి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్నారు.

Share
Sailaja N

Recent Posts

టెన్త్‌, ఇంట‌ర్‌, డిప్లొమా చ‌దివిన వారికి ఉద్యోగాలు.. ఆన్‌లైన్‌లో అప్లై చేయండి..!

అస్సాం రైఫిల్స్ వారు ప‌లు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టుల‌ను భ‌ర్తీ చేసేందుకు గాను ఆస‌క్తి, అర్హ‌త ఉన్న అభ్య‌ర్థుల…

Friday, 14 March 2025, 10:39 AM

డిగ్రీ చ‌దివిన వారికి శుభ‌వార్త‌.. బ్యాంక్ ఆఫ్ బ‌రోడాలో ఉద్యోగాలు..

బ్యాంకుల్లో ఉన్న‌త స్థానాల్లో ఉద్యోగం చేయాల‌ని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బ‌రోడా గొప్ప అవ‌కాశాన్ని క‌ల్పిస్తోంది. ఆ…

Sunday, 2 March 2025, 2:33 PM

యూనియ‌న్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సువ‌ర్ణ అవ‌కాశం.. 2691 పోస్టుల‌కు నోటిఫికేష‌న్‌..

బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిర‌ప‌డాల‌ని అనుకుంటున్న వారి కోసం యూనియ‌న్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…

Saturday, 22 February 2025, 10:19 AM

భార‌త్ ఎల‌క్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL)లో ఉద్యోగాలు.. వివ‌రాలు ఇవే..!

ప‌బ్లిక్ సెక్టార్‌కు చెందిన భార‌త్ ఎల‌క్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) ప‌లు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భ‌ర్తీకి గాను ఆస‌క్తి,…

Friday, 21 February 2025, 1:28 PM

బ్యాంక్ ఆఫ్ బ‌రోడాలో 4500 పోస్టులు.. జీతం నెల‌కు రూ.64వేలు..

దేశంలోని ప్ర‌ముఖ ప‌బ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బ‌రోడా ఆస‌క్తి, అర్హ‌త ఉన్న అభ్య‌ర్థుల నుంచి ప‌లు…

Thursday, 20 February 2025, 5:38 PM

టెన్త్ చ‌దివిన వారికి గుడ్ న్యూస్‌.. సికింద్రాబాద్ జోన్‌లో రైల్వే ఉద్యోగాలు..

రైల్వేలో ఉద్యోగం చేయాల‌నుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు శుభ‌వార్త చెప్పింది. ప‌లు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…

Tuesday, 18 February 2025, 5:22 PM

ఇండియ‌న్ ఎయిర్ ఫోర్స్‌లో ఉద్యోగాలు.. నెల‌కు రూ.40వేలు జీతం.. ఇంట‌ర్ అర్హ‌త‌తో..!

ఇండియ‌న్ ఎయిర్ ఫోర్స్‌లో ప‌నిచేయాల‌ని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవ‌కాశం అని చెప్ప‌వ‌చ్చు. ఇండియ‌న్ ఎయిర్…

Monday, 17 February 2025, 9:55 PM

పోస్ట‌ల్ శాఖ‌లో 45వేల ఉద్యోగాలు.. రాత ప‌రీక్ష‌, ఇంట‌ర్వ్యూ లేకుండానే ఎంపిక‌.. టెన్త్ చ‌దివితే చాలు..!

పోస్ట‌ల్ శాఖ‌లో ఉద్యోగం చేయాల‌ని అనుకుంటున్నారా..? అయితే ఈ స‌ద‌కాశం మీకోస‌మే. త‌పాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…

Monday, 17 February 2025, 3:09 PM