ప్రముఖ మొబైల్ గేమ్ పబ్‌జి వల్ల ఎంత మంది ఎన్ని రకాలుగా నష్టపోయారో గతంలో అనేక సంఘటనల్లో మనం చూశాం. ఈ గేమ్‌ను ఆడకపోవడం వల్ల కొందరు ఆత్మహత్యలు చేసుకున్నారు. కొందరైతే కుటుంబ సభ్యులకు చెందిన డబ్బును దొంగిలించి గేమ్‌లో ఐటమ్‌లను కొనేందుకు ఖర్చు చేశారు. అయితే పాకిస్థాన్‌లో ఆ వ్యక్తి మాత్రం ఇంకాస్త ముందుకే వెళ్లాడు. పబ్‌జి గేమ్‌లో ప్లేయర్లు ఎలాగైతే ఒకర్నొకరు కాల్చి చంపుకుంటారో దాన్ని రియల్ లైఫ్‌కు అనువదించుకుని అలాగే ఇంట్లోని కుటుంబ సభ్యులను గన్‌తో కాల్చి చంపాడు. వివరాల్లోకి వెళితే…
పాకిస్థాన్‌లోని లాహోర్ ప్రాంతం నవా కోట్ లో నివాసం ఉండే బిలాల్ పబ్‌జి గేమ్‌కు బానిస అయ్యాడు. ఈ క్రమంలోనే కొన్ని రోజుల కిందట తన భార్యకు కూడా విడాకులు ఇచ్చాడు. అయితే గేమ్‌ను ఆడొద్దని చెప్పినందుకు ఓ గన్ సంపాదించి ఇంట్లోని కుటుంబ సభ్యులను కాల్చి చంపాడు. తన సోదరుడు, సోదరి, మరదలు, ఇంకొకరిని కాల్చాడు. దీంతో ఆ నలుగురు అక్కికక్కడే చనిపోయారు.
ఇక ఆ వ్యక్తి చేసిన దాడిలో తన తల్లికి తీవ్ర గాయాలు అయ్యాయి. దీంతో ఆమె హాస్పిటల్‌లో చికిత్స పొందుతోంది. ప్రస్తుతం ఆమె పరిస్థితి విషమంగా ఉందని పోలీసులు తెలిపారు. ఆ వ్యక్తి ఇంటి నుంచి కాల్పులు, పెద్ద అరుపులు వినిపించడంతో ఇరుగు పొరుగు వారు వెంటనే అక్కడకు వెళ్లి ఆ వ్యక్తిని పట్టుకుని పోలీసులకు అప్పగించారు. పోలీసులు అతన్ని అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. కేసు దర్యాప్తు చేపట్టారు. కాగా పాకిస్థాన్‌లో 2020లో ఈ గేమ్‌ను బ్యాన్ చేశారు. కానీ సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున విమర్శలు రావడంతో గేమ్‌పై ఉన్న నిషేధాన్ని ఎత్తేశారు. ఈ క్రమంలోనే తాజాగా ఈ సంఘటన చోటు చేసుకోవడం గమనార్హం.
అస్సాం రైఫిల్స్ వారు పలు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు గాను ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల…
బ్యాంకుల్లో ఉన్నత స్థానాల్లో ఉద్యోగం చేయాలని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బరోడా గొప్ప అవకాశాన్ని కల్పిస్తోంది. ఆ…
బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిరపడాలని అనుకుంటున్న వారి కోసం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…
పబ్లిక్ సెక్టార్‌కు చెందిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి గాను ఆసక్తి,…
దేశంలోని ప్రముఖ పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి పలు…
రైల్వేలో ఉద్యోగం చేయాలనుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు శుభవార్త చెప్పింది. పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…
ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో పనిచేయాలని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవకాశం అని చెప్పవచ్చు. ఇండియన్ ఎయిర్…
పోస్టల్ శాఖలో ఉద్యోగం చేయాలని అనుకుంటున్నారా..? అయితే ఈ సదకాశం మీకోసమే. తపాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…