నటుడు, సినీ విమర్శకుడు కత్తి మహేష్ రోడ్డు ప్రమాదంలో తీవ్ర గాయాలకు గురై చెన్నైలోని అపోలో హాస్పిటల్‌లో చికిత్స పొందుతూ మృతి చెందిన విషయం విదితమే. అయితే కత్తి మహేష్ మృతిపై పలువురు అనుమానాలు వ్యక్తం చేశారు. దీంతో నెల్లూరు పోలీసులు విచారణ చేపట్టారు. ఈ క్రమంలోనే పోలీసులు బుధవారం పలువురిని ప్రశ్నించారు.
కత్తి మహేష్ కారు డ్రైవర్ సురేష్‌ను పోలీసులు నెల్లూరుకు పిలిపించి విచారణ చేపట్టారు. కోవూరు పోలీస్ స్టేషన్‌లో సురేష్‌ను పోలీసులు విచారించారు. ఈ క్రమంలో సురేష్ అసలు ప్రమాదం ఎలా జరిగింది, ఆ సమయంలో ఏం జరిగింది ? అన్న వివరాలను పోలీసులకు వెల్లడించాడు.
నిద్ర సమయం కావడంతో నెల్లూరులో ఆగి విశ్రాంతి తీసుకోవాలనుకున్నాం. ఆలోపే ఈ ఘటన జరిగింది. ప్రమాద సమయంలో కత్తి మహేష్ నిద్రపోతున్నారు. సీటు బెల్టు పెట్టుకోకపోవడం వల్ల ఆయన ముందుకు పడిపోయారు. నేను సీటు బెల్ట్ పెట్టుకున్నా. అందువల్లే నాకేమీ కాలేదు. ప్రమాదం నుంచి సురక్షితంగా బయట పడ్డా. కంటెయినర్ డ్రైవర్ నిర్లక్ష్యం వల్లే ఈ ప్రమాదం చోటు చేసుకుంది.. అని సురేష్ తెలిపాడు.
ప్రమాదం జరిగిన సమయంలో కారులో ఎయిర్ బ్యాగ్స్ ఓపెన్ అయ్యాయి. అయినప్పటికీ పగిలిన అద్దాల ముక్కలు మహేష్ కంటికి గుచ్చుకున్నాయి. హైవే పెట్రోలింగ్ పోలీసుల సహాయంతో మహేష్‌ను వెంటనే హాస్పిటల్‌లో చేర్చా. విచారణకు సహకరిస్తా. ఈ కేసులో నన్ను అనుమానించాల్సిన పనిలేదు.. అని సురేష్ అన్నాడు. కాగా పోలీసులు ఈ కేసులో మరికొంత మందిని విచారించనున్నారు.
అస్సాం రైఫిల్స్ వారు పలు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు గాను ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల…
బ్యాంకుల్లో ఉన్నత స్థానాల్లో ఉద్యోగం చేయాలని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బరోడా గొప్ప అవకాశాన్ని కల్పిస్తోంది. ఆ…
బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిరపడాలని అనుకుంటున్న వారి కోసం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…
పబ్లిక్ సెక్టార్‌కు చెందిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి గాను ఆసక్తి,…
దేశంలోని ప్రముఖ పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి పలు…
రైల్వేలో ఉద్యోగం చేయాలనుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు శుభవార్త చెప్పింది. పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…
ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో పనిచేయాలని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవకాశం అని చెప్పవచ్చు. ఇండియన్ ఎయిర్…
పోస్టల్ శాఖలో ఉద్యోగం చేయాలని అనుకుంటున్నారా..? అయితే ఈ సదకాశం మీకోసమే. తపాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…