Video : ఈ రోజుల్లో అసలు ఎప్పుడు ఏం జరుగుతుందో ఎవరికీ తెలియడం లేదు. అప్పటి వరకు ఆరోగ్యంగా ఉన్న వ్యక్తులు కూడా అకస్మాత్తుగా కుప్పకూలి గుండె పోటుతో చనిపోతున్నారు. చిన్నా పెద్దా అనే తేడా లేకుండా హార్ట్ ఎటాక్ చాప కింద నీరులా చాలా మందిని కబలిస్తోంది. ఇలాంటి సంఘటనలు తరచూ జరుగుతూనే ఉన్నాయి. వీటి వెనుక అసలు కారణం ఏమిటి.. అని ఇప్పటికీ సైంటిస్టులు కానీ, డాక్టర్లు కానీ చెప్పలేకపోతున్నారు. ఇక తాజాగా ఇలాంటిదే ఓ సంఘటన ఢిల్లీలో చోటు చేసుకుంది. ఈ సంఘటనకు సంబంధించి వివరాల్లోకి వెళితే..
ఢిల్లీలోని రూప్ నగర్ పోలీస్ స్టేషన్‌లో హెడ్ కానిస్టేబుల్‌గా పనిచేస్తున్న రవికుమార్ తాజాగా ఓ కార్యక్రమంలో పాల్గొన్నాడు. తాను పనిచేస్తున్న పోలీస్ స్టేషన్‌కు చెందిన ఇన్‌స్పెక్టర్ బదిలీ కావడంతో ఆయనకు తోటి పోలీసు సిబ్బంది ఫేర్ వెల్ పార్టీని ఏర్పాటు చేశారు. దీంతో ఆగస్టు 28వ తేదీన రాత్రి స్టేషన్‌లోనే ఫేర్ వెల్ పార్టీని జరుపుకున్నారు. అందులో భాగంగా రవికుమార్ తోటి పోలీసు సిబ్బందితో కలిసి చాలా సేపు హుషారుగా డ్యాన్స్ చేశాడు. అయితే వెంటనే అకస్మాత్తుగా కుప్పకూలిపోయాడు.
దీంతో రవికుమార్‌ను తోటి పోలీసులు వెంటనే హాస్పిటల్‌కు చికిత్స నిమిత్తం తరలించారు. అతన్ని పరీక్షించిన వైద్యులు అప్పటికే మృతి చెందాడని నిర్దారించారు. అయితే రవికుమార్ డ్యాన్స్ చేస్తున్న వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. దీంతో నెటిజన్లు సైతం షాక్‌కు గురవుతున్నారు. అప్పటి వరకు బాగానే ఉన్న వ్యక్తి సడెన్‌గా హార్ట్ ఎటాక్‌తో చనిపోవడం తోటి ఉద్యోగులను సైతం ఎంతో విచారానికి గురి చేసింది.
#Delhi: Head constable dies of #cardiacarrest while dancing in a farewell party. Om Shanti! https://t.co/uMiczVsaCN pic.twitter.com/yITy9AVarJ
— Dee (@DeeEternalOpt) August 29, 2024
కాగా రవికుమార్‌కు భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. అతను 2010లో ఢిల్లీలో పోలీస్ విభాగంలో విధుల్లో చేరాడు. అతను కొంత కాలంగా గుండె సమస్యతో బాధపడుతున్నాడని తోటి పోలీసులు తెలిపారు. ఇంతలోనే అతన్ని మృత్యువు తీసుకెళ్లిపోయింది. ఇలా ప్రస్తుతం చాలా మంది సడెన్‌గా గుండె పోటుతో మరణిస్తున్నారు. కనుక మీరు కూడా జాగ్రత్తగా ఉండండి. గుండె ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించండి.