క్రైమ్‌

దారుణం.. కూల్ డ్రింక్ తాగిన బాలిక వాంతులు చేసుకుని మృతి.. శ‌రీరం మొత్తం నీలి రంగులోకి మారింది..

చెన్నైలో దారుణ‌మైన సంఘ‌ట‌న చోటు చేసుకుంది. కూల్ డ్రింక్ తాగిన ఓ బాలిక ర‌క్తంలో కూడిన వాంతులు చేసుకుంది. త‌రువాత ఆమె వెంట‌నే చ‌నిపోయింది. ఆమె శ‌రీరం మొత్తం నీలి రంగులోకి మారిపోయింది. వివ‌రాల్లోకి వెళితే..

చెన్నైలోని బీసెంట్ నగర్ లో స్థానిక కిరాణా దుకాణం నుండి 13 ఏళ్ల బాలిక ధ‌ర‌ణి ఓ కూల్ డ్రింక్‌ను కొనుగోలు చేసింది. అనంత‌రం ఆ కూల్ డ్రింక్‌ను ఆమె తాగింది. అయితే ఆమె కూల్‌డ్రింక్ తాగాక ఆమెకు ర‌క్తంతో కూడిన వాంతులు అయ్యాయి.

ఈ క్ర‌మంలో ఆమె అక్క అశ్విని తమ‌ తల్లిదండ్రులను ఇంటికి తిరిగి రమ్మని పిలిచింది. ధ‌రణిని సమీపంలోని ఆసుపత్రికి తరలించగా అప్ప‌టికే ఆమె మరణించినట్లు వైద్యులు ప్రకటించారు. వారు ఆసుపత్రికి చేరుకునే సమయానికి ధ‌రణి శరీరం మొత్తం నీలం రంగులోకి మారింది.

ఈ సంఘటన తర్వాత ఆహార భద్రత అధికారులు తాత్కాలికంగా చెన్నైలోని శీతల పానీయాల తయారీ యూనిట్‌ను మూసివేశారు. తదుపరి నోటీసు వచ్చేవరకు యూనిట్ మూసివేయబడుతుంద‌ని తెలిపారు.

కాగా వివిధ దుకాణాలకు పంపిన ఒకే బ్యాచ్ కూల్ డ్రింక్ సీసాలు 540 ఉంటే వాటిని అధికారులు స్వాధీనం చేసుకున్నారు. షాపుల నుండి బ్యాచ్‌ను అధికారులు రీకాల్ చేసే సమయానికి చెన్నై అంతటా 17 సీసాలు అమ్ముడయ్యాయి. బీసెంట్ నగర్ నివాసితులు తమ పరిసరాల్లో విక్రయించే ఉత్పత్తుల నాణ్యతను తనిఖీ చేయాల‌ని ఆహార భద్రతా అధికారులను డిమాండ్ చేశారు.

కాగా ధ‌రణికి ఆస్తమా ఉంది. ఆమెను కూల్‌ డ్రింక్స్ తాగ‌కూడదని వైద్యులు చెప్పారు. ఈ వివ‌రాల‌ను పోలీసులు తెలిపారు. ఆమె మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం రాయపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పోస్ట్‌మార్టం నివేదికలో, పానీయం ఆమె శ్వాసకోశ వ్యవస్థలోకి ప్రవేశించిన తర్వాత ఊపిరాడకపోవడమే మరణానికి కారణమని చెప్పబడింది.

కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. పానీయం నమూనాలను ఫోరెన్సిక్ పరీక్ష కోసం పంపినట్లు పోలీసులు తెలియజేశారు. షోలవరంలోని తయారీ యూనిట్ అధికారులను త్వరలో ప్రశ్నించనున్నారు.

Share
IDL Desk

Recent Posts

టెన్త్‌, ఇంట‌ర్‌, డిప్లొమా చ‌దివిన వారికి ఉద్యోగాలు.. ఆన్‌లైన్‌లో అప్లై చేయండి..!

అస్సాం రైఫిల్స్ వారు ప‌లు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టుల‌ను భ‌ర్తీ చేసేందుకు గాను ఆస‌క్తి, అర్హ‌త ఉన్న అభ్య‌ర్థుల…

Friday, 14 March 2025, 10:39 AM

డిగ్రీ చ‌దివిన వారికి శుభ‌వార్త‌.. బ్యాంక్ ఆఫ్ బ‌రోడాలో ఉద్యోగాలు..

బ్యాంకుల్లో ఉన్న‌త స్థానాల్లో ఉద్యోగం చేయాల‌ని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బ‌రోడా గొప్ప అవ‌కాశాన్ని క‌ల్పిస్తోంది. ఆ…

Sunday, 2 March 2025, 2:33 PM

యూనియ‌న్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సువ‌ర్ణ అవ‌కాశం.. 2691 పోస్టుల‌కు నోటిఫికేష‌న్‌..

బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిర‌ప‌డాల‌ని అనుకుంటున్న వారి కోసం యూనియ‌న్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…

Saturday, 22 February 2025, 10:19 AM

భార‌త్ ఎల‌క్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL)లో ఉద్యోగాలు.. వివ‌రాలు ఇవే..!

ప‌బ్లిక్ సెక్టార్‌కు చెందిన భార‌త్ ఎల‌క్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) ప‌లు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భ‌ర్తీకి గాను ఆస‌క్తి,…

Friday, 21 February 2025, 1:28 PM

బ్యాంక్ ఆఫ్ బ‌రోడాలో 4500 పోస్టులు.. జీతం నెల‌కు రూ.64వేలు..

దేశంలోని ప్ర‌ముఖ ప‌బ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బ‌రోడా ఆస‌క్తి, అర్హ‌త ఉన్న అభ్య‌ర్థుల నుంచి ప‌లు…

Thursday, 20 February 2025, 5:38 PM

టెన్త్ చ‌దివిన వారికి గుడ్ న్యూస్‌.. సికింద్రాబాద్ జోన్‌లో రైల్వే ఉద్యోగాలు..

రైల్వేలో ఉద్యోగం చేయాల‌నుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు శుభ‌వార్త చెప్పింది. ప‌లు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…

Tuesday, 18 February 2025, 5:22 PM

ఇండియ‌న్ ఎయిర్ ఫోర్స్‌లో ఉద్యోగాలు.. నెల‌కు రూ.40వేలు జీతం.. ఇంట‌ర్ అర్హ‌త‌తో..!

ఇండియ‌న్ ఎయిర్ ఫోర్స్‌లో ప‌నిచేయాల‌ని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవ‌కాశం అని చెప్ప‌వ‌చ్చు. ఇండియ‌న్ ఎయిర్…

Monday, 17 February 2025, 9:55 PM

పోస్ట‌ల్ శాఖ‌లో 45వేల ఉద్యోగాలు.. రాత ప‌రీక్ష‌, ఇంట‌ర్వ్యూ లేకుండానే ఎంపిక‌.. టెన్త్ చ‌దివితే చాలు..!

పోస్ట‌ల్ శాఖ‌లో ఉద్యోగం చేయాల‌ని అనుకుంటున్నారా..? అయితే ఈ స‌ద‌కాశం మీకోస‌మే. త‌పాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…

Monday, 17 February 2025, 3:09 PM