తెల్లవారుజామున ఒక గడ్డివాము తగలబడటంతో అది చూసిన స్థానికులు పెద్ద ఎత్తున బిందెలతో నీటిని పోస్తూ మంటలను ఆర్పడానికి ప్రయత్నం చేశారు. అయితే అప్పటికే పెద్ద ఎత్తున మంటలు వ్యాపించడంతో ఈ విషయాన్ని పోలీసులకు, అగ్నిమాపకసిబ్బందికి సమాచారం అందించడంతో అగ్నిమాపక సిబ్బంది అక్కడికి చేరుకుని మంటలను అదుపు చేశారు. అయితే అంతా సద్దుమణిగింది అనుకున్న క్రమంలో అక్కడ ఓ విచిత్ర సంఘటన చోటు చేసుకుంది. పూర్తిగా కాలిపోయి బూడిదగా మారిన గడ్డివాములో నాలుగు మృతదేహాలు కనిపించిన ఘటన తమిళనాడులోని దిండిగల్ జిల్లా వట్టకొండన్‌వలసు గ్రామంలో చోటు చేసుకుంది. పూర్తి వివరాల్లోకి వెళితే..
శనివారం తెల్లవారుజామున గడ్డివాము అంటుకొని పెద్దఎత్తున మంటలు రావడంతో స్థానికులు అందరూ మంటలను అదుపు చేసే ప్రయత్నం చేశారు. మంటలు అదుపులోకి రాకపోవడంతో ఈ విషయాన్ని అగ్నిమాపక సిబ్బందికి చేరవేయడంతో వారు మంటలను అదుపు చేశారు. ఈ క్రమంలో ఆ బూడిదలో ఒకే కుటుంబానికి చెందిన నలుగురు మృతదేహాలు కనిపించడంతో ఈ ఘటన అందరిలో తీవ్ర ఉత్కంఠతను కలిగిస్తోంది. అయితే ఆ మృతదేహలు అక్కడికి ఎలా వచ్చాయి అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేపడుతున్నారు.
ఒకవేళ ఈ కుటుంబ సభ్యులు మొత్తం గడ్డివాము మంటలను అదుపు చేసే క్రమంలో పొరపాటుగా అందులో పడి చనిపోయారా.. లేక కావాలనే ఆత్మహత్యకు పాల్పడ్డారా.. లేకపోతే మరేవరైనా హత్య చేసి ఈ విధంగా చిత్రీకరించారా.. అన్న కోణంలో పోలీసులు ఆరా తీస్తున్నారు.
అస్సాం రైఫిల్స్ వారు పలు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు గాను ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల…
బ్యాంకుల్లో ఉన్నత స్థానాల్లో ఉద్యోగం చేయాలని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బరోడా గొప్ప అవకాశాన్ని కల్పిస్తోంది. ఆ…
బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిరపడాలని అనుకుంటున్న వారి కోసం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…
పబ్లిక్ సెక్టార్‌కు చెందిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి గాను ఆసక్తి,…
దేశంలోని ప్రముఖ పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి పలు…
రైల్వేలో ఉద్యోగం చేయాలనుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు శుభవార్త చెప్పింది. పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…
ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో పనిచేయాలని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవకాశం అని చెప్పవచ్చు. ఇండియన్ ఎయిర్…
పోస్టల్ శాఖలో ఉద్యోగం చేయాలని అనుకుంటున్నారా..? అయితే ఈ సదకాశం మీకోసమే. తపాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…